ఆడ పెంగ్విన్లు ఎందుకు చనిపోతున్నాయి?
దక్షిణ అమెరికాలోని మాజెలానిక్ జాతి ఆడ పెంగ్విన్లు సముద్ర తీరాల వెంబడి చనిపోయి, లేదా గాయపడి కనిపిస్తున్నాయి.
సరైన ఆహారం లేక అవి బీచ్‌ల దగ్గరకు చేరి మరణిస్తున్నాయి.
ఆడ పెంగ్విన్లే ఇలా ఎందుకు చనిపోతున్నాయనే దానిపై పరిశోధనలు జరిగాయి.
సంతానోత్పత్తి తరువాత అవి ఎక్కడికి వెళ్తున్నాయో పరిశీలించారు. ఆహారం కోసం ఆడ పెంగ్విన్లు ఉత్తర దిశకు వలస వెళ్లడాన్ని గమనించారు. అలా ప్రయాణించి వాటిలో కొన్ని బ్రెజిల్ కూడా చేరుకుంటున్నాయి.
కానీ, మగ పెంగ్విన్లు ఆహారం కోసం ఎక్కువ దూరం వెళ్లకుండా నీటిలో లోతులకు వెళ్తున్నాయి. దూరాలకు వెళ్లిన ఆడ పెంగ్విన్లు అక్కడే చిక్కుకుపోతున్నాయి. అక్కడ వాటికి ఏం చేయాలో పాలుపోవట్లేదు. దాంతో అలసి సొలసి చనిపోతున్నాయి.
వాటిని కాపాడేందుకు శాస్త్రవేత్తలు ప్రణాళికలు రచిస్తున్నారు.
ఇవి కూడా చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









