సౌదీ అరేబియాలో తలాక్: 'రహస్య విడాకుల్లో' మహిళలకు మెసేజ్ తప్పనిసరి

ఫొటో సోర్స్, AFP/GETTY
సౌదీ అరేబియాలో చాలా మంది మహిళలకు భర్తలు తమకు తలాక్ ఇచ్చిన విషయమే తెలీడం లేదు. ఆ పరిస్థితిని మార్చడానికి ఆదివారం ప్రభుత్వం ఒక కొత్త నిబంధనను అమలులోకి తెచ్చింది.
మహిళలకు తలాక్ గురించి మెసేజ్ పంపించి, విడాకుల సమాచారం అందించాలనే కొత్త నిబంధనలను ఆదివారం నుంచి సౌదీ అరేబియాలోని అన్ని కోర్టుల్లో తప్పనిసరి చేశారు.
"ఈ చట్టం వల్ల పురుషులు తమ భార్యలకు సమాచారం ఇవ్వకుండానే విడాకులు తీసుకునే కేసులకు అడ్డుకట్ట పడుతుంది" అని స్థానిక మహిళా న్యాయవాదులు చెప్పారు.
ఇలాంటి కేసులను 'రహస్య విడాకులు'గా భావిస్తుంటారు.
చట్టంలోని మార్గనిర్దేశకాలు మహిళలకు వారి వైవాహిక స్థితి గురించి పూర్తి సమాచారం ఉండాలని చెబుతున్నాయి. ఈ నిబంధన ద్వారా వారికి దక్కాల్సిన భరణం, పోషణ ఖర్చులు లాంటి హక్కులను సంరక్షించవచ్చని భావిస్తున్నారు.
సౌదీ అరేబియా గత ఏడాది మహిళల డ్రైవింగ్‌పై ఉన్న నిషేధాన్ని ఎత్తివేసింది. ఇది దశాబ్దాలపాటు కొనసాగుతూ వచ్చింది.

ఫొటో సోర్స్, Reuters
మహిళల హక్కుల సంరక్షణ
"మహిళలకు విడాకులు ఇచ్చినపుడు వారి హక్కులను సంరక్షించేలా, విడాకులకు ముందు అటార్నీ అధికారాలు దుర్వినియోగం కాకుండా ఈ కొత్త చట్టం నిర్ణయాలు తీసుకుంటుందని" సౌదీ అరేబియా న్యాయవాది నస్రీన్ అల్ గామదీ బ్లూంబర్గ్‌తో చెప్పారు.
"చాలా మంది మహిళలు భర్తలు తమకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే తలాక్ ఇచ్చారని కోర్టుల్లో అపీల్ చేశారు" అని న్యాయవాది సామియా అల్ హిందీ స్థానిక పత్రికతో చెప్పారు.
ఆర్థిక, సామాజిక సవరణల ప్రక్రియలో భాగంగా ఈ కొత్త నిబంధనలు అమలు చేసినట్టు సౌదీ అరేబియా క్రౌన్ ప్రిన్స్ చెప్పారు.
వీటి ప్రకారం మహిళలకు ఫుట్‌బాల్ మ్యాచ్ చూడ్డానికి, సంప్రదాయం ప్రకారం పురుషులే చేయాలని చెప్పే చాలా పనులు చేయడానికి అనుమతులు ఇచ్చారు.

ఫొటో సోర్స్, Getty Images
సౌదీ అరేబియా మహిళలు ఇప్పటికీ చేయలేనివి
సౌదీ అరేబియాలో మహిళలు ఇప్పటికీ చేయలేనివి కొన్ని అలాగే ఉన్నాయి.
అంటే ఆ దేశంలోని మహిళలు ఇప్పటికీ కొన్ని పురుషులు అంటే భర్త, తండ్రి, సోదరుడు లేదా కొడుకు అంగీకారంతో మాత్రమే చేయాల్సి ఉంటుంది. అవి...
- పాస్‌పోర్ట్ కోసం దరఖాస్తు
- విదేశీ యాత్ర
- వివాహం
- బ్యాంక్ అకౌంట్ తెరవడం
- వ్యాపార చేయడం
- ప్రత్యామ్నాయ సర్జరీలు
పురుషుల సంరక్షణ వ్యవస్థ ఉండడం వల్ల సౌదీ అరేబియాను మధ్యప్రాచ్యంలో అత్యంత లైంగిక అసమానత ఉన్న దేశంగా భావిస్తారు.
ఇవి కూడా చదవండి:
- సౌదీ మహిళలు ఇక స్టేడియానికి వెళ్లొచ్చు!
- నిషేధం ఎత్తివేతతో డ్రైవింగ్‌కు రెడీ అవుతున్న సౌదీ మహిళలు
- పెట్రో మంటలు ఇప్పట్లో చల్లారవు
- సౌదీలో తొలిసారి: స్టేడియాల్లోకి మహిళలు
- నిజంగానే భారత్ మహిళలకు అత్యంత ప్రమాదకర దేశమా? రాయిటర్స్ నివేదికలో వాస్తవమెంత?
- కాఫీ పైన సెల్ఫీ... మీకూ కావాలా?
- మళ్లీ ఫైవ్ స్టార్ హోటల్‌గా మారనున్న జైలు
- మహాత్మా గాంధీకి నోబెల్ శాంతి పురస్కారం ఎందుకు రాలేదు?
- భారత్‌లో పెరుగుతున్న పోర్న్ వీక్షణ
- చైనా నుంచి టీ రహస్యాన్ని ఆంగ్లేయులు ఎలా దొంగిలించారు?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









