సౌదీ అరేబియాలో మహిళల డ్రైవింగ్‌పై నిషేధం ఎత్తివేత

ఫొటో సోర్స్, Reuters
సౌదీ మహిళలపై దశాబ్దాలుగా కొనసాగిన డ్రైవింగ్ నిషేధాన్ని అధికారికంగా ఎత్తివేశారు.
ఈ నిర్ణయాన్ని సౌదీ అరేబియా గత సెప్టెంబర్‌లోనే ప్రకటించింది. ఈ నెల ఆరంభంలో తొలిసారి మహిళలకు లైసెన్సులు ఇచ్చే ప్రక్రియ మొదలైంది.
ప్రపంచంలో మహిళలు డ్రైవింగ్ చేయడాన్ని అనుమతించని ఏకైక దేశం సౌదీ అరేబియానే కావడంతో మహిళలు ఎటు వెళ్లాలన్నా ప్రైవేటు డ్రైవర్లు తప్పనిసరి అయ్యేవారు.
అయితే, సౌదీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడమనేది మామూలుగా జరగిందేమీ కాదు. మహిళల డ్రైవింగ్ హక్కు కోసం ఎందరో కార్యకర్తలు ఉద్యమం సాగించారు. ప్రభుత్వం వారిని అణచివేసింది కూడా.
కనీసం ఎనిమిది మంది మహిళా కార్యకర్తలను అరెస్టు చేశారు. వారిపై కౌంటర్ టెర్రరిజం కోర్టులో విచారణ జరిపి వారికి సుదీర్ఘ జైలు శిక్షలు విధించారని హక్కుల సంస్థ ఆమ్నెస్టీ తెలిపింది.
వారిలో ఒకరు లౌజైన్ అల్-హాథ్‌లౌల్. మహిళల డ్రైవింగ్ హక్కుల కోసం ఉద్యమించిన వారిలో కీలక వ్యక్తి.
సౌదీ అరేబియాలో ఇంకా ఎన్నో సంస్కరణలు రావాల్సి ఉందని ఆమ్నెస్టీ అభిప్రాయపడింది. అనేక చట్టాలు మహిళలను పురుషుల నీడలోనే ఉండేలా చేస్తున్నాయి.

ఫొటో సోర్స్, Reuters
డ్రైవింగ్ కోసం సిద్ధమవుతున్న సౌదీ మహిళలు
మహిళల డ్రైవింగ్‌పై నిషేధం జూన్ 24న ఎత్తివేస్తున్నట్టు ప్రకటించగానే ఆ దేశంలోని చమురు ఉత్పత్తి సంస్థ ఆర్మాకో తమ మహిళా సిబ్బందికి కారు నడిపించే శిక్షణనిచ్చింది.
ఢహ్రాన్‌లోని సౌదీ అర్మాకో డ్రైవింగ్ సెంటర్‌లో డ్రైవింగ్ నేర్చుకుంటున్న 200 మంది మహిళా ఉద్యోగులను రాయిటర్స్ ఫొటోగ్రాఫర్ అహ్మద్ జెదల్లా, రిపోర్టర్ రైనా ఎల్ గమల్ కలిశారు.
ఇక్కడి విద్యార్థుల్లో ఒకరైన మరియా అల్-ఫరాజ్( దిగువ ఫొటోల్లో ఎడమ) డ్రైవింగ్ శిక్షకురాలైన అహ్లామ్ అల్-సోమాలీ దగ్గర పాఠం నేర్చుకుంటున్నారు.

ఫొటో సోర్స్, Reuters
డ్రైవింగ్ నేర్చుకోవడంతోపాటూ, ఆయిల్ లెవల్స్ ఎలా చెక్ చేయాలి, టైరు ఎలా మార్చాలి, సీట్ బెల్ట్ ధరించడం ఎంత ముఖ్యం అనేది కూడా ఆమె తెలుసుకుంటున్నారు.

ఫొటో సోర్స్, Reuters

ఫొటో సోర్స్, Reuters

ఫొటో సోర్స్, Reuters
డ్రైవింగ్ నిషేధం ఎత్తివేయడం అనేది సౌదీ అరేబియా మహిళలకు చాలా పెద్ద విషయం. గతంలో డ్రైవింగ్ చేస్తూ పట్టుబడితే వారిని అరెస్ట్ చేసేవారు, ఫైన్ విధించేవారు. ఎక్కడికైనా వెళ్లాలంటే వారు కుటుంబంలో ఉన్న పురుషులు లేదా ప్రైవేటు డ్రైవర్లపై ఆధారపడేవారు.

ఫొటో సోర్స్, Reuters
జూన్ 24న తాను కారు డ్రైవింగ్ వీల్ ముందు కూర్చుని, తల్లిని ఎక్కడికైనా తీసుకుని వెళ్లాలనుకుంటున్నట్టు ఆర్కిటెక్ట్ అబ్దుల్ గాదెర్ (దిగువ ఫొటోలో) చెప్పారు.

ఫొటో సోర్స్, Reuters
"డ్రైవింగ్ సీట్లో కూర్చోవడం అంటే మన ప్రయాణాన్ని మనం కంట్రోల్ చేస్తున్నట్టే" అన్నారు అబ్దుల్ గాదెర్.
"ఎప్పుడు వెళ్లాలో, ఏం చేయాలో, ఎప్పుడు తిరిగి రావాలో నేనే నిర్ణయిస్తా"
"మాకు రోజువారీ పనులు చేసుకోడానికి కారు కావాలి. మేం పనిచేస్తున్నాం. మేం తల్లులం, సామాజిక మాధ్యమాల్లో మాకు చాలా పరిచయాలున్నాయి. మేం బయటికెళ్లాల్సి ఉంటుంది- అందుకే మాకు డ్రైవింగ్ అవసరం- ఇది నా జీవితాన్ని మార్చేస్తుంది." అని గాదెర్ అన్నారు.

ఫొటో సోర్స్, Reuters
ఆర్మాకోలో పనిచేసే 66 వేల మంది ఉద్యోగుల్లో ఆరు శాతం మంది మహిళలు ఉన్నారు. అంటే 3 వేల మందికి పైగా మహిళలు డ్రైవింగ్ స్కూల్లో తమ పేర్లు నమోదు చేసుకున్నారని రాయిటర్స్ తెలిపింది.

ఫొటో సోర్స్, Reuters
ఫొటోలు - అహ్మద్ జడల్లా
ఇవి కూడా చదవండి:
- 'సంజయ్ గాంధీ డెడ్‌లైన్ పెట్టారంటే ఒక్కరోజులో పని కావాల్సిందే'
- ఫేస్‌బుక్‌కు కటీఫ్ చెప్పేస్తున్న అమెరికా కుర్రకారు
- ఏ సెల్‌ఫోన్‌తో ఎంత ప్రమాదం?
- మీ మైండ్‌ని రీఛార్జి చేయడానికి ఐదు మార్గాలు
- #FIFA2018: అర్జెంటీనా స్టార్ ఆటగాడు లియోనెల్ మెస్సీకి అసలేమైంది
- ఫుట్‌బాల్: మెస్సీని కలుసుకొనేందుకు రష్యాకు కేరళ యువకుడి సైకిల్ యాత్ర
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








