ఐర్లండ్‌ పార్లమెంటులో అండర్ వేర్ ప్రదర్శించిన ఎంపీ... ఎందుకంటే...

అండర్ వేర్ పై చర్చ

17 ఏళ్ల యువతిపై అత్యాచారం చేసిన నిందితుడినిని కోర్టు నిర్దోషిగా విడుదల చేయడంతో 'సమ్మతితో సెక్స్' అంశంపై ఐర్లండ్‌లోని చాలా ప్రాంతాల్లో వ్యతిరేక ప్రదర్శనలు జరుగుతున్నాయి.

ఈ కేసు విచారణ సమయంలో డిఫెన్స్ తరఫు న్యాయవాది కోర్టులో "మీరు ఆమె ఎలాంటి దుస్తులు వేసుకుందో కూడా చూడాల్సి ఉంటుంది. ఆమె ముందు వైపు లేసులు ఉన్న థాంగ్ ధరించారు" అని వాదించారు.

28 ఏళ్ల నిందితుడిని జ్యూరీ దోషిగా గుర్తించలేకపోయింది.

'అత్యాచార బాధితురాలిపైనే ఆరోపణలు నమోదు చేస్తున్న' అంశాన్ని సభలో లేవనెత్తేందుకు ఒక ఐర్లండ్‌ మహిళా ఎంపీ పార్లమెంటుకు అండర్ వేర్ తీసుకురావడంతో దీనిపై దేశవ్యాప్తంగా చర్చ మొదలైంది.

రూతం కోపింగర్ అనే ఎంపీ పార్లమెంటుకు నీలం రంగు రిబ్బన్లున్న ఒక అండర్ వేర్ తీసుకొచ్చారు. దాన్ని సభలో చూపిస్తూ "ఇక్కడ థాంగ్ చూపించడం ఇబ్బందికరంగా ఉండచ్చు. కానీ ఒక అండర్ వేర్ కోర్టులో చూపించినపుడు, ఆ కేసులో అత్యాచార బాధితురాలు లేదా ఒక మహిళకు ఎలా ఉంటుంది" అన్నారు.

ఈ కేసు గురించి మొదట నవంబర్ 6న ఐరిష్ ఎగ్జామినర్ వార్తాపత్రిక రిపోర్ట్ ప్రచురించింది.

పరస్పర అంగీకారంతోనే ఆ యువతికి, తనకు మధ్య లైంగిక సంబంధం ఏర్పడిందని నిందితుడు చెబుతున్నాడు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 1
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 1

వకీలు వాదన తర్వాత వివాదం

కానీ అతడి న్యాయవాది ఎలిజబెత్ ఒ-కొనెల్ చేసిన వివాదాస్పద వాదనలపై సోషల్ మీడియాలో తీవ్రంగా చర్చ జరుగుతోంది.

యువతి నిందితుడి పట్ల ఆకర్షణకు లోనైందని, ఎవరినైనా కలిసేందుకు, ఎవరితో అయినా ఉండేందుకు ఆమె సమ్మతించిందనే విషయాన్ని కాదనడానికి ఆధారాలు ఉన్నాయా అని ఆ లాయర్ అన్నట్టు ఎగ్జామినర్ కథనం తెలిపింది.

"మీరు ఆమె ఎలాంటి బట్టలు వేసుకుంది అనేది గమనించాలి. ఆమె లేసులు ఉన్న థాంగ్ వేసుకుని ఉంది" అని లాయర్ జ్యూరీకి చెప్పారు.

కోర్టులో వాదనల గురించి వార్తాపత్రిక ఒక కథనం ప్రచురించిన తర్వాత రోజు ఆ అడ్వకేట్ వాదనను డబ్లిన్ రేప్ క్రైసిస్ సెంటర్ చీఫ్ విమర్శించారు.

అయితే ఆమె కోర్టు తీర్పును విమర్శించలేదు. కానీ, ఇలాంటి వ్యాఖ్యలు తరచూ చేస్తున్నారని, అందుకే చట్ట ప్రక్రియలో సవరణలు అవసరమని డిమాండ్ చేశారు.

ఇటు ఐర్లండ్‌ ప్రజలు కూడా ఈ కేసులో వాదనలపై సోషల్ మీడియాలో తీవ్రంగా స్పందిస్తున్నారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 2
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 2

పార్లమెంటులో అండర్ వేర్ ప్రదర్శన

#ThisIsNotConsent అనే హ్యాష్‌ట్యాగ్‌తో చాలా మంది ట్వీట్లు చేస్తున్నారు. చాలా మంది మహిళలు అండర్ వేర్ ఫొటోలు కూడా పోస్ట్ చేస్తున్నారు.

కోర్టులో ఇలాంటి చర్చ జరగడాన్ని వ్యతిరేకిస్తున్న నెటిజన్లు తమ అండర్ వేర్ రంగు, దాని ఆకారం కూడా చూపిస్తున్నారు.

చాలా మంది మహిళలు అత్యాచార కేసుల సమయంలో ఏం మాట్లాడాలి, ఏం మాట్లాడకూడదు అనే విషయంలో కఠిన నియమాలు ఉన్న కొన్ని దేశాల గురించి కూడా ప్రస్తావించారు.

ఐర్లండ్‌ పార్లమెంటులో అండర్ వేర్ చూపించిన తర్వాత ఎంపీ టీడీ రూత్ కోపింగర్ మాట్లాడుతూ.. "జడ్జిలకు, జ్యూరీ సభ్యులకు ఇలాంటి విషయాల్లో తప్పనిసరి శిక్షణ ఇప్పించాల్సి ఉంటుంది’’ అని అన్నారు

ఇదే ఏడాది ఉత్తర ఐర్లండ్‌లో అత్యాచార కేసులో చిక్కుకున్న ఇద్దరు ప్రముఖ రగ్బీ క్రీడాకారులను నిర్దోషులుగా విడుదల చేశారు.

కోర్టులో విచారణ వివరాలు బహిర్గతం కావడంతో ఐర్లండ్‌, ఉత్తర ఐర్లండ్‌ అంతటా ఆందోళనలు జరిగాయి.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 3
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 3

దేశవ్యాప్తంగా వ్యతిరేక ప్రదర్శనలు

రాజధాని డబ్లిన్ సహా చాలా నగరాల్లో ఆందోళనలు నిర్వహించారు. సామాజిక కార్యకర్త రోజ్ నేతృత్వంలో సోషల్ మీడియాలో ఉద్యమం నడిచింది.

డబ్లిన్‌తోపాటు కోర్క్, లిమెరిక్, వాటర్‌ఫర్డ్ నగరాల్లో కూడా ఆందోళనలు జరిగాయి.

"మేం ఏం వేసుకున్నా, మేం ఎక్కడికి వెళ్లినా.. ఎస్ అంటే ఎస్, నో అంటే నో" అని నినాదాలు చేస్తూ మహిళలు రోడ్లపై ప్రదర్శనలు చేశారు. బాధితురాలిని నిందించడం ఆపాలని పిలుపునిచ్చారు.

కోపింగర్ ప్రశ్నకు సమాధానం ఇచ్చిన ఐర్లాండ్ రక్షణ మంత్రి లియో వరడ్కర్ "ఎవరూ అత్యాచారం చేయమని అడగరు. ఏం వేసుకున్నా, ఎవరితో వెళ్లినా అది బాధితురాలి తప్పు కాదు. లైంగిక హింస, లేదా అత్యాచారానికి గురైన నేరానికి ఎవరూ బాధితురాలిపై ఆరోపణలు చేయకూడదు" అన్నారు.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)