దీపావళి టపాసులు: రాత్రి 8 నుంచి 10 గంటల వరకే కాల్చాలి - సుప్రీంకోర్టు

టపాసులు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, దీపావళి అంటే వెంటనే గుర్తుకొచ్చేది బాణాసంచా వెలుగులే.

బాణసంచాపై దేశవ్యాప్తంగా నిషేధం విధించలేమని అయితే, కొన్ని షరతులు వర్తిస్తాయని సుప్రీంకోర్టు మంగళవారం కీలక తీర్పు వెలువరించిందని ఏఎన్‌ఐ వార్తసంస్థ తెలిపింది.

దీపావళిలాంటి పర్వదినాల్లో దేశ వ్యాప్తంగా రాత్రి రెండు గంటలు మాత్రమే టపాసులు కాల్చాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.

పర్యావరణం, ప్రజారోగ్యం దృష్ట్యా దేశవ్యాప్తంగా బాణసంచా తయారీ, అమ్మాలను నిలిపివేయాలని సుప్రీం కోర్టులో పలు కేసులు నమోదయ్యాయి.

వీటిపై విచారించిన సుప్రీం... బాణసంచాపై దేశవ్యాప్తంగా నిషేధం విధించేందుకు నిరాకరించింది. అయితే,

ఆన్‌లైన్‌లో బాణసంచా అమ్మరాదని, లైసెన్స్ ఉన్న వ్యాపారులనే టపాసులు అమ్మేందుకు ప్రభుత్వం అనుమతించాలని సూచించింది.

సుప్రీంకోర్టు

ఫొటో సోర్స్, Reuters

సుప్రీం కోర్టు తీర్పులోని ముఖ్యాంశాలు

దీపావళికి ఏడు రోజుల ముందు తరువాత గాలి నాణ్యత ఎలా ఉందో కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి పరిశీలించాలి.

దిల్లీ రాజధాని పరిధిలో కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి గుర్తించిన నివాస సముదాయాల్లోనే బాణసంచా కాల్చాలి.

దీపావళి రోజున దేశవ్యాప్తంగా రాత్రి 8 నుంచి 10 వరకు రెండు గంటలు మాత్రమే టపాసులు కాల్చాలి.

టపాసులు

ఫొటో సోర్స్, Getty Images

క్రిస్మస్, నూతన సంవత్సర వేడుకల సమయంలో రాత్రి 11.55 నుంచి 12.30 వరకు ( 35 నిమిషాలు) మాత్రమే టపాసులు కాల్చాలి.

ఇతర పండుగలకు, వేడుకలకు కూడా ఇవే షరతులు వర్తిస్తాయి.

తక్కువ పొగ వచ్చే బాణసంచా తయారీకి మాత్రమే అనుమతి ఇవ్వాలి.

బాణసంచా వల్ల ఏర్పడే కాలుష్యంపై ప్రభుత్వం ప్రజలకు అవగాహన కల్పించాలి.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)