అమెరికా మధ్యంతర ఎన్నికలు: డోనల్డ్ ట్రంప్ భవిష్యత్తుకు ఇవెంత కీలకం?

అమెరికాలో మధ్యంతర ఎన్నికలు వస్తున్నాయి. ఈ ఎన్నికలతో ట్రంప్ భవితవ్యం తేలే అవకాశం ఉంది.
నవంబర్ 6న అమెరికన్ కాంగ్రెస్‌పై ఆధిపత్యానికి పోరు జరుగుతుంది. డెమొక్రాట్లు, రిపబ్లికన్లు ఈ ఎన్నికల్లో పోటీపడతారు.
ప్రస్తుతం సెనేట్‌లో ట్రంప్ నేతృత్వంలోని రిపబ్లికన్లే మెజారిటీలో ఉన్నారు. అందులో 51మంది రిపబ్లికన్లు, 49మంది డెమొక్రాట్లు ఉన్నారు.
ఇప్పుడు దాదాపు 30శాతం డెమొక్రాట్ల స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.
యూఎస్ కాంగ్రెస్‌లో మరో భాగం ప్రతినిధుల సభ. అందులో 240మంది రిపబ్లికన్లు, 195మంది డెమొక్రాట్లు ఉన్నారు. ఈ సభకు జరిగే ఎన్నికల్లో కూడా డెమొక్రాట్లకు మెజారిటీ రావొచ్చని అంచనా వేస్తున్నారు.
ఒకవేళ ఈ ఎన్నికల్లో డెమొక్రాట్లు నెగ్గితే, ట్రంప్ నిర్ణయాలను వీళ్లు అడ్డుకునే అవకాశం ఉంటుంది. ట్రంప్ పైన, ఆయన పాలనలోని నిర్ణయాలపైన విచారణ జరిపించే అధికారం వారికి లభిస్తుంది. అవసరమైతే ట్రంప్‌పై అభిశంసన తీర్మానం కూడా పెట్టొచ్చు.
జడ్జిలు, కేబినెట్ అధికారులను నియమిస్తూ ట్రంప్ తీసుకున్న నిర్ణయాలను వీటో చేయడానికి డెమొక్రాట్లకు సాధారణ మెజారిటీ చాలు.
కానీ, రెండు సభల్లోనూ మళ్లీ రిపబ్లికన్లకే మెజారిటీ లభిస్తే తన విధానాలను అమలు చేయడంలో ట్రంప్‌కు ఎదురు ఉండకపోవచ్చు.
ఇవి కూడా చదవండి
- ప్రపంచాన్ని ట్రంప్ మరింత ప్రమాదంలోకి నెట్టేశారా?
- ట్రంప్ ఏం తింటారు? వాటి అర్థం ఏంటి?
- లక్షలాది మొబైల్స్‌కు ‘ట్రంప్ అలర్ట్’
- అసలు న్యూక్లియర్ బటన్ ట్రంప్ వద్దే ఉంటుందా?
- అమెరికా స్తంభించటానికి ట్రంప్ ఎంత వరకు కారణం?
- ట్రంప్ తడబడ్డారా? పొరబడ్డారా? మాట మార్చారా?
- మొఘలుల పాలనలో నవరాత్రి వేడుకలు ఎలా జరిగేవి?
- డోనల్డ్ ట్రంప్: పర్యావరణ శాస్త్రవేత్తలకు 'రాజకీయ అజెండా' ఉంది
- వర్ణాంతర వివాహం: ఆఫ్రికా అబ్బాయి, ఇండియా అమ్మాయి.. ఓ అందమైన ప్రేమ కథ
- భారత్: పదేళ్లలో రెట్టింపైన సిజేరియన్ జననాల శాతం
- బీబీసీ పరిశోధన: కామెరూన్లో ఈ మహిళను చంపిన సైనికులను ఎలా కనుగొన్నామంటే...
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









