విజయ్ మాల్యా: దేశం నుంచి వెళ్లే ముందు ఆర్థిక మంత్రిని కలిశాను

ఫొటో సోర్స్, Getty Images
లిక్కర్ వ్యాపారి, రూ. 9,000 కోట్ల రుణాల ఎగవేతకు పాల్పడినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న విజయ్ మాల్యా సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను భారత్ విడిచి వెళ్లేముందు 2016లో కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీని కలిశానని తెలిపారు.
అయితే, మాల్యా చేసిన ఆరోపణలను అరుణ్ జైట్లీ ఖండించారు. 2014 నుంచి విజయ్ మాల్యాకు తాను ఎన్నడూ అపాయింట్‌మెంట్ కూడా ఇవ్వలేదని అన్నారు.
ఫ్యాక్చువల్ సిచువేషన్ అనే శీర్షికతో ఫేస్‌బుక్‌లో జైట్లీ ఓ పోస్టు పెట్టారు. మాల్యా చేసిన వ్యాఖ్యల్లో వాస్తవం లేదని అన్నారు.
"ఆయన రాజ్యసభ సభ్యుడిగా ఉన్నప్పుడు అప్పుడప్పుడు సభకు వచ్చేవారు. ఓరోజు నేను నా గదికి వెళ్లేందుకు సభ నుంచి బయటకు నడుచుకుంటూ వెళ్తుండగా ఆయన నావెంట పడుతూ సెటిల్‌మెంట్ గురించి చెప్పారు. అప్పుడు అతను చెప్పేది వినకుండా, "నాతో మాట్లాడటం కాదు, బ్యాంకులతో సెటిల్‌మెంట్ చేసుకోవాలి" అని చెప్పాను. అతను ఇవ్వబోయిన పేపర్‌ను కూడా నేను తీసుకోలేదు" అని అరుణ్ జైట్లీ వివరించారు.
మాల్యాను భారత్‌కు అప్పగించే కేసుపై బుధవారం లండన్‌లోని వెస్ట్‌మినిస్టర్ కోర్టులో విచారణ జరిగింది.
ఈ సందర్భంగా కోర్టుకు హాజరైన మాల్యా, కోర్టు బయట మీడియాతో మాట్లాడారు.
అప్పుడు విలేఖరులు అడిగిన ఓ ప్రశ్నకు మాల్యా సమాధానమిస్తూ... "జెనీవాలో ఓ సమావేశానికి హాజరయ్యేందుకు వెళ్లాను. వెళ్లే ముందు ఆర్థిక మంత్రిని కలిశాను. ఆ సందర్భంగా బ్యాంకులతో సెటిల్‌మెంట్‌కు సంబంధించి కూడా నేను ప్రస్తావించాను. అది నిజం'' అన్నారు.
ఆర్థిక మంత్రిని ఎందుకు కలిశారని ప్రశ్నించగా, అందుకు మాల్యా స్పందిస్తూ "మీకెందుకు చెప్పాలి? ఇలాంటివి అడిగి నన్ను ఇబ్బందిపెట్టకండి" అన్నారు.
తనతో ఆర్థికమంత్రి ఏమన్నారో మాల్యా వెల్లడించలేదు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 1
వారి సమావేశం వివరాలు వెల్లడించాలి: కాంగ్రెస్
ఈ వివాదంపై విపక్షాలు తీవ్రంగా స్పందించాయి. భారత్‌ని విడిచి వెళ్లేందుకు విజయ్ మాల్యాకు ఎందుకు, ఎలా అనుమతించారో ప్రభుత్వం సమాధానం చెప్పాలని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత అభిషేక్ మనుసింఘ్వీ అన్నారు.
ఈ విషయాన్ని ఆర్థిక మంత్రి ఎందుకు ఇన్నాళ్లు దాచిపెట్టారు? అని దిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ నేత అరవింద్ కేజ్రీవాల్ ట్వీట్ చేశారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 2
"దేశం విడిచి వెళ్లేముందు నీరవ్ మోదీని ప్రధానమంత్రి మోదీ కలుస్తారు. విజయ్ మాల్యాను ఆర్థిక మంత్రి కలుస్తారు. ఈ సమావేశాల్లో ఏం జరిగింది? ప్రజలు తెలుసుకోవాలనుకుంటున్నారు" అంటూ కేజ్రీవాల్ మరో ట్వీట్ చేశారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 3
విజయ్ మాల్యాను భారత్‌కు అప్పగించాలా? వద్దా? అన్న కేసులో విచారణ పూర్తయింది. దీనిపై డిసెంబర్ 10 వెస్ట్‌మినిస్టర్ కోర్టు నిర్ణయం వెల్లడించనుంది.
ఇవి కూడా చదవండి
- ‘భాగస్వామిని ఆకట్టుకునే శృంగార కళను మర్చిపోతున్న భారతీయులు’
- క్రయానిక్స్: చనిపోయాక బతకొచ్చా? మృత్యువును కూడా మోసం చేయొచ్చా?
- అవునా.. ఐన్‌స్టీన్‌ది మొద్దు నిద్రా?
- క్యాన్సర్‌ను పసిగట్టే రక్తపరీక్ష!!
- మరణంతో మెదడు పోరాడుతుందా? చనిపోయే ముందు ఏం జరుగుతుంది?
- ఎవరు అబద్ధాల కోరు?
- #BBCSpecial జ్ఞాపకశక్తిని పెంచుకోవడానికి ఎనిమిది మార్గాలు
- ఈ మిరపకాయ తింటే ఆసుపత్రిపాలే!
- ఏం చేసినా బరువు తగ్గట్లేదా? ఈ ఐదూ కారణాలు కావొచ్చు..
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








