జర్మనీ: కన్నకొడుకుని కామాంధులకు ఆన్‌లైన్లో అమ్మేసిన తల్లిదండ్రులు

ఫొటో సోర్స్, AFP
జర్మనీలో ఒక మహిళ తన కన్నకొడుకుని మారు భర్తతో కలసి డార్క్ నెట్‌లో అమ్మేసింది. అది కూడా పిల్లలపై లైంగిక దాడులకు పాల్పడే కామాంధులకు. ఆమెకు, ఆ పిల్లవాడి సవతి తండ్రికి జర్మనీ కోర్టు 12 ఏళ్ల జైలు శిక్ష విధించింది.
ఆ బాలుడి వయసు తొమ్మిదేళ్లు. ఈ కేసులో విచారణ జూన్ నెలలో మొదలైంది. బెరిన్ తాహా (48), క్రిస్టియన్ లియాస్ (39) ఇద్దరూ జర్మనీ పౌరులు. దక్షిణ జర్మనీలోని ఫ్రీబర్గ్ సమీపంలోని స్టాఫెన్‌లో నివసిస్తున్నారు.
వీరిద్దరూ డార్క్ నెట్‌లో తమ పిల్లవాడిని అమ్మేశారు. ప్రధాన స్రవంతిలోని సెర్చ్ ఇంజన్లకు చిక్కని చీకటి ఇంటర్‌నెట్ మార్కెట్ డార్క్ నెట్.
పిల్లలపై అత్యాచారం, తీవ్రమైన లైంగిక దాడి, బలవంతంగా వ్యభిచారం చేయించటం, పిల్లల పోర్నోగ్రఫీ పంపిణీ చేసిన నేరాల్లో వీరిద్దరూ దోషులుగా ఫ్రీబర్గ్ కోర్టు నిర్ధారించింది.


పిల్లవాడి తల్లికి 12 సంవత్సరాల ఆరు నెలలు, సవతి తండ్రికి 12 సంవత్సరాలు జైలు శిక్ష విధిస్తూ తాజాగా తీర్పు చెప్పింది. ఆ బాలుడిపై పలుమార్లు లైంగిక దాడికి పాల్పిడిన కేసులో ఒక స్పెయిన్ వ్యక్తికి ఇదే కోర్టు పదేళ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పు చెప్పింది.
ఆ బాలుడిని కట్టేసి బూతులు తిడుతూ లైంగిక దాడికి పాల్పడిన వీడియో దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి.
ఆ బాలుడు ఇప్పుడు దత్తత తీసుకున్న కుటుంబం వద్ద నివసిస్తున్నాడు.
- బిహార్: 'సంరక్షణ గృహంలో 29 మంది బాలికలపై అత్యాచారం'
- పెరూ: చరిత్రలో అతి పెద్ద చిన్నారుల బలి ఘటన - 140 కంకాళాలు లభ్యం
- లైంగిక దాడుల బాధితులకు క్షమాపణ చెప్తాం: ఆస్ట్రేలియా
- ఆస్ట్రేలియా: బాలల మీద అకృత్యాలపై రాయల్ కమిషన్ నివేదిక
- కన్నవాళ్లే పిల్లల్ని గొలుసులతో కట్టేశారు!
- ఆశ చూపి పురుషుల్ని వ్యభిచారంలోకి దింపుతున్న మెక్సికో ముఠాలు
- భార్యపై అత్యాచారం చేయించిన భర్త.. స్వలింగ సంపర్కురాలైనందుకు కక్ష
- పిల్లలపై అత్యాచారాలకు పాల్పడితే ఏయే దేశాలలో ఎలాంటి శిక్షలు విధిస్తున్నారు?
- ఈ నగరంలో అత్యాచారాలు సర్వ సాధారణం.. రేపిస్టుల్ని కొట్టి చంపటం కూడా
- అత్యాచారాలను నిరోధించే ప్యాంటీ తయారు చేసిన యువతి!
- అత్యాచారానికి గురైన ఓ అబ్బాయి కథ ఇది!
- ‘మహిళలపై వారి కుటుంబ సభ్యులతోనే అత్యాచారం చేయించేవారు’
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









