పాక్ ఎన్నికల ర్యాలీలో ఆత్మాహుతి దాడి, 85 మంది మృతి

ఫొటో సోర్స్, Getty Images
పాకిస్తాన్ ఎన్నికల ర్యాలీలో జరిగిన ఆత్మాహుతి దాడిలో 85 మంది చనిపోయారు. ఈ మేరకు పాక్ ఆరోగ్య శాఖ మంత్రి వెల్లడించారు. 150 మందికిపైగా గాయపడ్డారని వివరించారు.
ఇక్కడ ఈ నెల 25న ఎన్నికలు జరుగనున్నాయి.
ఆరోగ్య శాఖ మంత్రి ఫైజ్ కాకర్ బీబీసీతో మాట్లాడుతూ.. వాయువ్య పాకిస్తాన్‌లోని బలూచిస్థాన్ పీపుల్స్ పార్టీ అభ్యర్థి సిరాజ్ రస్సానీ నియోజకవర్గంలో ఈ ఆత్మాహుతి దాడి జరిగిందని చెప్పారు.

ఫొటో సోర్స్, ...
ఈ దాడిలో సిరాజ్ కూడా మృతి చెందారని ఆయన సోదరుడు వెల్లడించారు.
దక్షిణ క్వెట్టాకి 35 కిలోమీటర్ల దూరంలో ఈ బాంబు పేలుడు జరిగిందని స్థానిక పోలీసు అధికారులు చెప్పారు.
బలూచిస్థాన్ ఎన్నికల నేపథ్యంలో గత 24 గంటల్లో మూడు బాంబు దాడులు జరిగాయని అధికారులు తెలిపారు.
బలూచిస్థాన్ రాజధానికి సమీపంలోని మస్టంగ్ పట్టణంలో తాజా దాడి జరిగింది.
ఎన్నికల ర్యాలీ మధ్యలో ఒకరు తనను తాను పేల్చేసుకోవడంతో భారీ ప్రాణ నష్టం జరిగిందిన అధికారులు వివరించినట్లు ఏఎఫ్‌పీ తెలిపింది.
ఇవి కూడా చదవండి:
- వీళ్లు స్మార్ట్ రైతులు.. యాప్స్‌తో లాభాలు పండిస్తున్నారు
- ఉత్తరప్రదేశ్ మహిళలకు పాలమూరు వనితల పాఠాలు
- BBC Special: కాళేశ్వరం ప్రాజెక్టు పర్యటక ప్రాంతంగా ఎందుకు మారింది?
- సోషల్: అద్దె ఇంటికి ఎవరైనా అద్దె కట్టాల్సిందే కదా, మరి కులం అడగడం ఎందుకు?
- ప్రపంచం నుంచి చీకటిని మానస తరిమేయాలనుకుంటోంది. ఇలా..
- స్త్రీ గౌరవం రెండు కాళ్ల మధ్య లేదు : బీబీసీ ఇంటర్వ్యూలో రేణూ దేశాయ్
- హాలీవుడ్ సినిమాల రేంజ్లో జైళ్ల నుంచి తప్పించుకున్నారు వీళ్లంతా
- అమెరికా-బ్రిటన్ చారిత్రక సంబంధాలకు డొనాల్డ్ ట్రంప్ ముగింపు పలుకుతారా?








