తూర్పు యూరప్‌: నారింజ వర్ణంలో మంచు

రష్యా కాకసస్‌లో నారింజ వర్ణం మంచు దృశ్యాలు

ఫొటో సోర్స్, Margarita Alshina

ఫొటో క్యాప్షన్, రష్యా కాకసస్‌లో నారింజ వర్ణం మంచు దృశ్యాలు

తూర్పు యూరప్ ప్రజలను నారింజ వర్ణంలో ఉన్న మంచు అబ్బురపరుస్తోంది. రష్యా, బల్గేరియా, ఉక్రెయిన్, రొమేనియా, మాల్దోవా ప్రజలు నారింజ వర్ణంలో ఉన్న మంచు ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు.

రష్యా కాకసస్‌లో స్నోబోర్డర్

ఫొటో సోర్స్, Katrin JD

సహారా ఎడారిలో చెలరేగిన ఇసుక తుపాను మంచు, వర్షంతో కలిసిపోవడం వల్ల ఇలాంటిది జరుగుతుందని వాతావరణ శాస్త్రవేత్తలు అంటున్నారు.

రష్యా కాకసస్‌లో స్కీయర్లు

ఫొటో సోర్స్, Margarita Alshina

సాధారణంగా ఇది ప్రతి ఐదేళ్లకు ఒకసారి జరిగే పరిణామమే అని, అయితే ఈసారి మాత్రం మంచులో ఇసుక ఎక్కువగా ఉందని తెలిపారు.

కాకసస్ పర్వతాలలో నారింజ వర్ణంలోని మంచు

ఫొటో సోర్స్, Ksusha Knopik

రష్యా నగరం సోచికి చెందిన స్కీయర్లు, స్నోబోర్డర్లు ఆ నారింజ వర్ణంలోని మంచు చిత్రాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

రష్యా కాకసస్‌లో స్కీయర్లు

ఫొటో సోర్స్, Margarita Alshina

కొందరు ఇది అంగారక గ్రహంలా కనిపిస్తోందని వ్యాఖ్యానించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)