కోహ్లీ 160 నాటౌట్: ‘పుస్తకం తిరగేసినంత తేలిగ్గా ఆడాడు’

ఫొటో సోర్స్, ANESH DEBIKY/AFP/Getty Images
దక్షిణాఫ్రికాతో జరుగుతున్న వన్డే సిరీస్‌లో భారత జట్టు సారథి విరాట్ కోహ్లీ కెప్టెన్ ఇన్నింగ్స్‌తో మరోసారి సత్తా చాటాడు. మూడో వన్డేలో 159 బంతుల్లో 160 పరుగులు చేసి, నాటౌట్‌గా నిలిచాడు. ఇందులో 12 ఫోర్లు, 2 సిక్స్ ఉన్నాయి.
ఈ సిరీస్‌లో విరాట్‌కు ఇది రెండో సెంచరీ. తొలి వన్డేలో సెంచరీతో జట్టును గెలిపించిన కోహ్లీ రెండో వన్డేలోనూ 46 పరుగులతో రాణించాడు.
బుధవారం కేప్‌టౌన్‌లో జరుగుతున్న మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు నిర్ణీత 50 ఓవర్లకు ఆరు వికెట్లు కోల్పోయి 303 పరుగులు చేసింది. సగానికి పైగా పరుగులు విరాట్ కోహ్లీవే.
తొలి ఓవర్లోనే రోహిత్ శర్మ డకౌట్ కాగా, తర్వాత క్రీజులోకి వచ్చిన కోహ్లీ తొలుత నెమ్మదిగా ఆడాడు.
కుదురుకున్నాక సహచరులతో కలసి చక్కటి ఇన్నింగ్స్ నిర్మించాడు. శిఖర్ ధావన్ 76 పరుగులతో కెప్టెన్‌కు అండగా నిలిచాడు.
''పేజీలు తిప్పినంత సులభంగా కోహ్లీ సెంచరీ చేశాడు'' అని ప్రముఖ కామెంటేటర్ హర్షా భోగ్లే 'ట్విటర్'లో వ్యాఖ్యానించాడు.
దక్షిణాఫ్రికాపై కోహ్లికి ఇదే అత్యధిక స్కోరు. దీంతో వన్డేల్లో 34వ సెంచరీని పూర్తి చేసిన కోహ్లి, అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక శతకాలు సాధించిన వారి జాబితాలో ఐదో స్థానానికి చేరాడు.
దక్షిణాఫ్రికా బౌలర్లలో జేపీ డుమిని రెండు వికెట్లు తీయగా, తాహిర్, క్రిస్ మోరిస్, రబడ తలో వికెట్ దక్కించుకున్నారు.
ఇవి కూడా చదవండి:
- రోహిట్: ఏంటా వేగం.. ఏంటా బాదుడు?
- పాకిస్తాన్‌ను ఓడించి వరల్డ్ కప్ గెలిచిన భారత జట్టు
- ఆంధ్రప్రదేశ్‌పై స్పందించారు.. హామీలపై మాత్రం మౌనం వహించారు
- ఆసియాలో విమానయానాన్ని ఎవరు శాసిస్తున్నారు?
- కేంద్ర బడ్జెట్లో జరిగిన 'అన్యాయానికి' నిరసనగా రేపు ఏపీ బంద్!!
- చంద్రబాబు సాధిస్తారా? జగన్ అస్త్రంగా మలుచుకుంటారా?
- పాదయాత్రలో జగన్ ఇస్తున్న హామీల అమలు సాధ్యమేనా?
- ఆరోగ్య బీమాకు ప్రశంసలు.. ఆదాయ పన్నుపై విమర్శలు
- పోలవరం గ్రౌండ్ రిపోర్ట్: అసలేం జరుగుతోందక్కడ?
- BBC EXCLUSIVE : కేసీఆర్‌తో కోదండరామ్‌కు ఎక్కడ చెడింది?
- తిట్టారంటే జైలుకే: తెలంగాణ ప్రభుత్వ చర్యతో లాభమెంత? నష్టమెంత?
- ‘బాబు గారూ ఆనాడు కాపు ఆందోళనకు మద్దతిచ్చారు..మరి డబ్బెంత ఇచ్చారు?’
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








