100 కాదు.. 200 కాదు.. 3500 ఫొటోలు. ప్రతీ ఒక్కటీ ప్రత్యేకమే. వేటి కవే సాటి. వాటికి లేదు పోటీ.
2017 కామెడీ వైల్డ్‌లైఫ్ పోటీల్లో అందర్ని మెప్పించిన కొన్ని ఫొటోలు మీ కోసం.
మిస్ కాకుండా అన్నీ చూడండి.
ఫొటో సోర్స్, Tibor Kercz / Barcroft Images
ఫొటో క్యాప్షన్, కొమ్మపై పట్టుతప్పి కిందకి జారుతూ.. పట్టు కోసం పాకులాడుతున్న గుడ్లగూబ ఫొటో ఇది. ఈ ఏడాది నేచర్స్ ఫన్నీయెస్ట్ ఫొటోగా ఇది అవార్డు దక్కించుకుంది.
కామెడీ వైల్డ్‌లైఫ్ పోటీల్లో ఈ గుడ్లగూబ ఫొటోకు ఫస్ట్ ఫ్రైజ్ వచ్చింది.
హంగరిలో టిబొర్ కెర్జ్ ఫొటోగ్రాఫర్ ఈ ఫొటో తీశారు.
ఈ ఫొటో తీసినందుకు టిబొర్ కెర్జ్ కెన్యా విహార యాత్ర టికెట్లు గెలుచుకున్నారు.
ఫొటో సోర్స్, Andrea Zampatti / Barcroft Images
ఫొటో క్యాప్షన్, ఇది చిలిపి చిట్టెలుక. ఉన్నచోట ఉండకుండా పూల మొక్క పైకెక్కి ఎలా నవ్వుతుందో చూడండి. దీన్ని ఆండ్రియా జంపటి అనే ఫొటో గ్రాఫర్ ఇటలీలో తీశారు. 'భూమి మీద విభాగం'లో ఇది గెలుపొందింది.
ఫొటో సోర్స్, Troy Mayne / Bancroft images
ఫొటో క్యాప్షన్, ఈ తాబేలు మహా ముదురు. తన దారికి అడ్డుగా వచ్చిన ఓ చేప చెంపను ఇలా చెళ్లుమనిపించింది. పాపం చేపకు ఎంత దెబ్బతగిలిందో! ఈ ఫొటో ట్రాయ్ మేని తీశారు. 'అండర్ వాటర్ విభాగం'లో ఈ ఫొటో ఎంపికైంది.
ఫొటో క్యాప్షన్, 'ఆకాశం విభాగం'లో జాన్ త్రెల్‌ఫాల్ తీసిన ఈ ఫొటో గెలుపొందింది. విమానం వెళ్లిన దారిలో ఈ పక్షి ఎగురుకుంటూ వెళ్లడంతో ఈ ఎఫెక్ట్ వచ్చింది.
ఫొటో సోర్స్, Daisy Gilardini
ఫొటో క్యాప్షన్, అమ్మ దగ్గర ఎన్ని కోతి వేషాలు వేసినా చెల్లుతుంది. 'తల్లి పైకి ఎక్కుతున్న పిల్ల ఎలుగుబంటి' ఫొటోను డైసీ గిలార్డిని తీశారు. కెనడాలోని మనిటొబాలో ఈ ఫొటో క్లిక్ మనిపించారు.
ఫొటో క్యాప్షన్, హలో.. మీరు నాలా జలకాలాడగలరా! ఈ జంతువు నీటిలో సరదాగా ఈతకొడుతున్న సమయంలో పెన్నీ పాల్మర్ ఈ ఫోటో తీశారు. అమెరికాలోని కాలిఫోర్నియాలో క్లిక్ మనిపించారీ ఫొటో.
ఫొటో సోర్స్, Photo: Carl Henry
ఫొటో క్యాప్షన్, ఈ పెంగ్విన్లను చూశారా? బుద్ధిగా చర్చికి వెళ్తున్నాయి! అది కూడా క్రమశిక్షణగా. దక్షిణ జార్జియాలోని దక్షిణ అట్లాంటిక్ ద్వీపంలో ఈ ఫొటోను కార్ల్ హెన్రీ తీశారు.
ఫొటో క్యాప్షన్, ఈ కుందేలుకు ఆత్రం ఎక్కువ అనుకుంటా! నోరు చిన్నది.. కానీ ఎంత గడ్డి నోట్లో పెట్టుకుందో చూడండి. ఫొటో గ్రాఫర్ ఆలివియర్ కొలీ బెల్జియంలో ఈ చిత్రం తీశారు. అవార్డు కోసం ఎక్కువ మంది దీన్ని సిఫార్సు చేశారు.
ఫొటో క్యాప్షన్, ఈ రెండు కోతులు బైక్‌పై రైడ్‌కి రెడీ అవుతున్నాయి. ఇండోనేషియాలోని ఉత్తర సులవెసీ ద్వీపంలో ఇలా కెమేరాకి చిక్కాయి..
ఫొటో సోర్స్, Photo: George Cathcart
ఫొటో క్యాప్షన్, ఇది భయమా? షాకా? ఈ సీల్ ఏం ఆలోచిస్తోంది? జార్జ్ కాథ్‌కార్ట్ తీసిన ఈ ఫొటోను ఎక్కువ మంది రెకమండ్ చేశారు. అమెరికాలోని కాలిఫోర్నియా శాన్ సిమియాన్‌లో క్లిక్ చేశారు.
ఫొటో సోర్స్, Photo: Douglas Croft
ఫొటో క్యాప్షన్, ఈ నక్క మహా జిత్తులమారి! ఎక్కడ జాగ లేనట్టు ఇదిగో ఇక్కడే తన పని కానిస్తోంది.! అమెరికా శాన్‌జోస్‌లోని గోల్ఫ్ కోర్టులో తీసిన ఫొటో ఇది.
ఫొటో సోర్స్, Photo: Daniel Trim
ఫొటో క్యాప్షన్, చూడండి.. ఈ చేపలు బురదలో డ్యూయెట్ పాడుకుంటున్నాయి.! థాయ్‌లాండ్‌లో డేనియల్ ట్రిమ్ వీటిని కెమేరాలో బంధించారు.