2017: టాప్ 10 యూట్యూబ్ ట్రెండింగ్ వీడియోలు

- రచయిత, అరుణ్ పృథ్వి శాండిల్య
- హోదా, బీబీసీ ప్రతినిధి
వీడియోల అడ్డా యూట్యూబ్ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా కోట్లాదిమందికి వినోదం అందించే మాధ్యమంగా మారిపోయింది.
పాటలు, సినిమాలు, సరదాసరదా సన్నివేశాలు, షార్ట్‌ఫిల్మ్‌లు... ఒకటేమిటి..! ఆటాపాటా అన్నీ అక్కడ దొరికేస్తున్నాయి.
నెటిజనులకు నచ్చాలే కానీ లక్షల కొద్దీ లైకులు, కోట్లకొద్దీ వ్యూస్ వచ్చిపడుతున్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే వైరల్ అవుతున్నాయి.
అలా 2017లో వైరల్ అయిన యూట్యూబ్ వీడియోలు ఏవో తెలుసా...? అబ్బో, చాలానే ఉన్నాయి. 2017కి వీడ్కోలు పలుకుతూ వాటిలో కొన్ని గుర్తు చేసుకుందాం.
2005లో ప్రారంభమైన యూట్యూబ్ కొన్నేళ్లుగా ఏటా టాప్ 10 ట్రెండింగ్ వీడియోల జాబితా ఒకటి విడుదల చేస్తోంది.
వ్యూస్, లైకులు, కామెంట్లు, షేర్స్ వంటివన్నీ పరిగణనలోకి తీసుకుని జనాదరణ పొందిన వీడియోల జాబితా రూపొందిస్తోంది. దాని ప్రకారం 'ది మాస్క్ సింగర్-2' అనే థాయ్‌లాండ్ వీడియో ఈ ఏడాది దుమ్ము రేపినట్లు తేలింది.
ఇవీ టాప్ టెన్
ఈ కథనంలో Google YouTube అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు Google YouTube కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of YouTube ముగిసింది, 1
1. ది మాస్క్ సింగర్-2
ఈ ఏడాది జూన్ 1న అప్‌లోడ్ చేసిన దీన్ని డిసెంబరు 30 వరకు ఏకంగా 20 కోట్ల 11 లక్షల మంది చూశారు. ఇక దీన్ని లైక్ చేసినవారి సంఖ్య కూడా తక్కువేమీ కాదు. 5 లక్షల 93 వేల మందికిపైగా దీన్ని ఇష్టపడ్డారు. థాయ్‌లాండ్‌లో ప్రసారమయ్యే ఒక పాటల పోటీకి సంబంధించిన వీడియో ఇది.
ఈ కథనంలో Google YouTube అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు Google YouTube కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of YouTube ముగిసింది, 2
2. షేప్ ఆఫ్ యూ
పాప్ సింగర్ ఎడ్వర్డ్ షెరీన్ పాట 'షేప్ ఆఫ్ యూ'కు కైలీ హనగామి అనే కొరియోగ్రాఫర్ రూపొందించిన నృత్య వీడియో ఇది. దీనికి 12.62 కోట్ల వ్యూస్ ఉన్నాయి.
ఈ కథనంలో Google YouTube అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు Google YouTube కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of YouTube ముగిసింది, 3
3. పింగ్ పాంగ్ ట్రిక్ షాట్స్
అమెరికాకు చెందిన డ్యూడ్ పెర్ఫెక్ట్ అనే సరదా ఆటల టీం రూపొందించిన వీడియో ఇది. ఇందులో పింగ్ పాంగ్ బంతితో పర్ఫెక్ట్‌గా చేసిన విన్యాసాలు నెటిజన్లను ఆకట్టుకోవడంతో ఈ వీడియోకు సుమారు 10 కోట్ల వ్యూస్ వచ్చాయి.
ఈ కథనంలో Google YouTube అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు Google YouTube కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of YouTube ముగిసింది, 4
4. డార్సీ లిన్ వెంట్రిలాక్విజమ్
డార్సీ లిన్ ఫార్మర్ అనే అమెరికా వెంట్రిలాక్విజం కళాకారిణి 'అమెరికాస్ గాట్ టాలెంట్-2017' టీవీ షోలో ఇచ్చిన ప్రదర్శన. 4.3 కోట్ల మందికిపైగా దీన్ని యూట్యూబ్‌లో చూశారు.
ఈ కథనంలో Google YouTube అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు Google YouTube కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of YouTube ముగిసింది, 5
5. కార్ పూల్
పాప్ సింగర్ ఎడ్వర్డ్ షెరీన్ కార్ పూలింగ్ పాట 4.1 కోట్ల వ్యూస్‌తో అయిదో స్థానంలో నిలిచింది.
ఈ కథనంలో Google YouTube అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు Google YouTube కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of YouTube ముగిసింది, 6
6. లేడీగాగా షో
లేడీగాగా ఫుల్ పెప్సీ జీరో షుగర్ షో 3.81 కోట్ల వ్యూస్ సాధించింది.
ఈ కథనంలో Google YouTube అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు Google YouTube కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of YouTube ముగిసింది, 7
7. హిస్టరీ ఆఫ్ ది వరల్డ్
అమెరికాకు చెందిన బిల్ వార్ట్జ్ ఇదీ ప్రపంచ చరిత్ర అంటూ 'హిస్టరీ ఆఫ్ ది ఎంటైర్ వరల్డ్' పేరిట రూపొందించిన 20 నిమిషాల యానిమేటెడ్ వీడియో ఈ ఏడాది వైరల్‌గా మారింది. 3.6 కోట్ల మందికిపైగా దీన్ని చూశారు.
ఈ కథనంలో Google YouTube అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు Google YouTube కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of YouTube ముగిసింది, 8
8. ఇనాగరేషన్ డే
అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ఈ ఏడాది జనవరిలో బాద్యతలు చేపట్టినప్పటి వీడియోకు పలు హాలీవుడ్ సినిమాల్లోని సంభాషణలను జోడించి రూపొందించిన సరదా వీడియో. దీన్ని 3.5 కోట్ల మందికిపైగా చూశారు.
ఈ కథనంలో Google YouTube అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు Google YouTube కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of YouTube ముగిసింది, 9
9. ఇన్ ఏ హార్ట్ బీట్
'ఇన్ ఏ హార్ట్ బీట్' అనే ఈ యానిమేటెడ్ షార్ట్ ఫిలిం ఇది. 3.3 కోట్ల మంది దీన్ని చూశారు.
ఈ కథనంలో Google YouTube అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు Google YouTube కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of YouTube ముగిసింది, 10
10. చిల్డ్రన్ ఇంటరప్షన్ ఇన్ బీబీసీ ఇంటర్వ్యూ
రాబర్ట్ కెల్లీ అనే ప్రొఫెసర్ ఉత్తర, దక్షిణ కొరియాలకు సంబంధించిన అంశాలపై 'బీబీసీ న్యూస్'తో ఇంటి నుంచి స్కైప్‌లో మాట్లాడుతుండగా ఆయన పిల్లలు హఠాత్తుగా సీన్లోకి రావడంతో మొదట కొంత గందరగోళం ఏర్పడడం, ఆ తరువాత ఆయన ఇంటర్వ్యూ సజావుగా సాగడం ఈ వీడియోలో కనిపిస్తుంది. దీన్ని 2.6 కోట్ల మందికిపైగా చూశారు.
మా ఇతర కథనాలు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)