‘పారిస్ డీల్’కి అమెరికా తిరిగొస్తుంది: మాక్రోన్

ఫొటో సోర్స్, Reuters
వాతావరణ మార్పులపై పోరాడేందుకు చేసిన పారిస్ ఒప్పందంలోకి డొనాల్డ్ ట్రంప్ అమెరికాను మళ్లీ తీసుకువస్తారని ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమాన్యుయెల్ మాక్రోన్ అన్నారు.
కానీ ఈ ఒప్పందంలో నిబంధనలను సడలించాలన్న డొనాల్డ్ ట్రంప్ వాదనను ఒప్పుకోబోమని తెలిపారు.
వాతావరణ మార్పులపై మంగళవారం పారిస్‌లో సదస్సు జరిగింది.
ఈ సదస్సు అనంతరం ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రోన్ సి.బి.ఎస్. ఇంటర్వ్యూలో ఈ వ్యాఖ్యలు చేశారు.
వాతావరణ మార్పుల అంశంలో అంతర్జాతీయ ఒప్పందంపై అమెరికా సంతంకం చేసింది.
గతంలో ఆ ఒప్పందం నుంచి అమెరికా వైదొలిగింది. ఈ వైఖరిని మాక్రోన్ ఖండించారు.
''పారిస్ ఒప్పందంపై అమెరికా ఇదివరకే సంతకం చేసింది. కానీ ఒప్పందం నుంచి వైదొలగింది. ఇది దూకుడు చర్య. ఈ అంశం గురించి మాట్లాడేందుకు ఇతరులకు అవకాశం కూడా ఇవ్వలేదు. అమెరికా ఏకపక్షంగా నిర్ణయం తీసుకుంది. కానీ కూటమి నుంచి బయటకు వెళ్లలేకపోయింది.'' అని మాక్రోన్ అన్నారు.

ఫొటో సోర్స్, AFP/Getty Images
భూతాపాన్ని పారిశ్రామిక విప్లవానికి ముందు రోజుల కంటే 2 సెంటిగ్రేడ్‌లు తగ్గించాలన్నది పారిస్ ఒప్పందం ముఖ్య ఉద్దేశం. ఈ లక్ష్యం దిశగా ప్రపంచ దేశాలను నడిపించాలని మాక్రోన్ అభిలాష.
సి.బి.ఎస్.తో ఆయన మాట్లాడుతూ.. భూతాపం విషయంలో భవిష్యత్ తరాల ముందు తాను దోషిగా నిలబడాలని అనుకోవడంలేదన్నారు. అందుకే భూతాపం సమస్యను పరిష్కరించేందుకు ఓ చిన్న ప్రయత్నం చేస్తున్నానన్నారు.
మంగళవారం జరిగిన సమావేశంలో 50మంది సీనియర్ మంత్రులు, దేశాధ్యక్షులు పాల్గొన్నారు.
ఈ సమావేశంలోనైనా 'ఉద్గార ప్రమాణాల'ను తగ్గించే అంశంలో తగినంత ప్రోత్సాహం లభిస్తుందని శాస్త్రజ్ఞులు ఆశించారు.
ఆర్థిక రంగ కీలక అంశాల్లో కొన్ని ముఖ్యమైన ప్రకటనలు వెలువడనున్నాయి :
- సౌర శక్తి, గాలి మరలతో క్లీన్ ఎనర్జీని ఉత్పత్తి చేసుకునేందుకు పేద దేశాలకు ఆర్థిక సాయం చేయాలి.
- కొత్తగా ఏర్పడే బొగ్గు గనులకు బ్యాంకులు రుణాలు మంజూరు చేయకూడదు.
- సంస్థలు తమ శిలాజ ఇంధన నిక్షేపాలను వెల్లడించాలి. ఉద్గార ప్రమాణాలను తగ్గించేందుకు ప్రభుత్వాలు సిద్ధపడితే.. ఈ నిక్షేపాల విలువ కూడా తగ్గుతుంది.

ఫొటో సోర్స్, Getty Images
షిప్పింగ్ పరిశ్రమను నియంత్రించే మరో కీలక ప్రకటన కూడా వెలువడనుంది. ఇంతవరకూ బహుళజాతి విధానాలతో ఈ పరిశ్రమ.. వివిధ రకాల నిబంధనల నుంచి తప్పించుకుంటూ వస్తోంది.
రాత్రికి రాత్రి సంభవించిన ఈ పరిణామాలతో.. 'ఎక్సాన్' ఆయిల్ దిగ్గజ సంస్థ.. వాతావరణ మార్పుల ప్రభావం తన వ్యాపారంపై ఏవిధంగా ప్రభావం చూపిస్తుందో అంచనా వేస్తామని ప్రకటించింది.
సాంకేతిక పరమైన మార్పులు, వాతావరణ సంబంధమైన పాలసీలు కంపెనీ వ్యవహారాలపై ఏవిధంగా ప్రభావం చూపిస్తాయో..ఏటా అంచనా వేయాలన్నారు.
ఈ ప్రతిపాదనను 'న్యూయార్క్ స్టేట్ ఎంప్లాయీస్ రిటైర్‌మెంట్ ఫండ్' తెరపైకి తెచ్చింది. కంపెనీల్లో యూనియన్‌కు 62శాతం వాటా ఉంది.
ఈ సదస్సులో ఏదైనా ముందడుగు పడిందా లేదా అన్న అంశంలో ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.
మా ఇతర కథనాలు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








