ఈ మహిళ ఎవరు? ఈ ఫొటో ఎవరు తీశారు?

ఒక విమానం. అందులో ఒక మహిళ. ఆమె నోట్లో ఓ సిగరెట్. దాన్ని వెలిగిస్తున్న నెహ్రూ. ఈ ఫొటోను క్లిక్‌మనిపించింది ఎవరో తెలుసా?

భారతదేశ విభజనపై 1947లో జరిగిన సమావేశానికి వస్తున్న మహాత్మా గాంధీ, ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్

ఫొటో సోర్స్, HV Archive/ The Alkazi Collection of Photography

ఫొటో క్యాప్షన్, భారతదేశ విభజనపై 1947లో జరిగిన సమావేశానికి వస్తున్న మహాత్మా గాంధీ. స్వాతంత్ర్య సమర యోధుడు ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్, మహాత్మా గాంధీ వ్యక్తిగత వైద్యురాలు సుశీలా నాయర్ కూడా చిత్రంలో ఉన్నారు.
విజయ్ చౌక్ వద్ద గుర్రపు బగ్గీలో లార్డ్ మౌంట్‌బాటెన్

ఫొటో సోర్స్, HV Archive/ The Alkazi Collection of Photography

ఫొటో క్యాప్షన్, 1947 ఆగస్టు 15న లార్డ్ మౌంట్‌బాటెన్ భారత గవర్నర్ జనరల్‌గా బాధ్యతలు స్వీకరించారు. ఆ సందర్భంగా రాష్ట్రపతి భవన్ నుంచి పార్లమెంట్ భవనం వరకు ఆయనను గుర్రపు బగ్గీలో తీసుకెళ్లారు. విజయ్ చౌక్ వద్ద తీసిన చిత్రం ఇది.
గణతంత్ర దినోత్సవ పరేడ్

ఫొటో సోర్స్, HV Archive/ The Alkazi Collection of Photography

ఫొటో క్యాప్షన్, భారత్ 1950 జనవరి 26న తొలి గణతంత్ర దినోత్సవం జరుపుకొంది. ప్రస్తుతం నేషనల్ స్టేడియం ఉన్న చోట నాడు రిపబ్లిక్ డే పరేడ్ జరిగింది. నాటి రాష్ట్రపతి బాబు రాజేంద్ర ప్రసాద్ గౌరవ వందనం అందుకున్నారు.
ఫ్యాషన్ షోలో పాల్గొన్న రాణి ఎలిజబెత్-2

ఫొటో సోర్స్, HV Archive/ The Alkazi Collection of Photography

ఫొటో క్యాప్షన్, దిల్లీలోని సెంట్రల్ కాటేజ్ ఇండస్ట్రీస్‌లో బ్రిటిష్ అధికారుల భార్యలు ఒక ఫ్యాషన్ షో నిర్వహించారు. రాణి ఎలిజబెత్-2 ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
నక్కల వేటలో కల్నల్

ఫొటో సోర్స్, HV Archive/ The Alkazi Collection of Photography

ఫొటో క్యాప్షన్, 1940: కల్నల్ సాహ్నీ నేతృత్వంలో నక్కలను వేటాడారు.
నృత్యం చేస్తున్న నర్సులు

ఫొటో సోర్స్, HV Archive/ The Alkazi Collection of Photography

ఫొటో క్యాప్షన్, 1940: బాంబేలో శిక్షణలో ఉన్న నర్సులు
జేజే స్కూల్ ఆఫ్ ఆర్ట్స్ విద్యార్తులు

ఫొటో సోర్స్, HV Archive/ The Alkazi Collection of Photography

ఫొటో క్యాప్షన్, 1930: బాంబేలోని జేజే స్కూల్ ఆఫ్ ఆర్ట్స్ విద్యార్థులు
జవహర్ లాల్ నెహ్రూ, సిమోన్

ఫొటో సోర్స్, HV Archive/ The Alkazi Collection of Photography

ఫొటో క్యాప్షన్, బ్రిటీష్ ఓవర్‌సీస్ ఎయిర్ కార్పొరేషన్‌కి చెందిన విమానంలో బ్రిటన్ డిప్యూటీ హై కమిషనర్ భార్య సిమోన్ సిగరెట్ వెలిగిస్తున్న జవహర్ లాల్ నెహ్రూ. ఈ ఫొటో తీసింది ఎవరో తెలియాలంటే మరో రెండు ఫొటోలు ముందుకెళ్లండి.
జవహర్ లాల్ నెహ్రూ, విజయలక్ష్మీ పండిట్

ఫొటో సోర్స్, HV Archive/ The Alkazi Collection of Photography

ఫొటో క్యాప్షన్, దిల్లీలోని పాలెం విమానాశ్రయంలో తన సోదరి విజయలక్ష్మీ పండిట్‌తో జవహర్ లాల్ నెహ్రూ. రష్యాలో భారత దౌత్యవేత్తగా పదవీ కాలం ముగిసిన తరువాత ఆమె భారత్‌కు తిరిగి వచ్చినప్పటిది ఈ చిత్రం.
హోమీ వ్యారావాలా

ఫొటో సోర్స్, HV Archive/ The Alkazi Collection of Photography

ఫొటో క్యాప్షన్, తన కెమెరాతో హోమీ వ్యారావాలా. పై చిత్రాలు అన్నీ ఆమె తీశారు. 1913 డిసెంబరు 9న ఆమె జన్మించారు.