ఏంజెలినా జోలిలా కనిపించేందుకు 50 సర్జరీలు

సహర్ తబార్, ఏంజెలినా జోలి

ఫొటో సోర్స్, Getty/Instagram

ఫొటో క్యాప్షన్, సహర్ తబార్

ఫలానా సినిమాలో, ఫలానా హీరో హెయిర్ స్టయిల్‌నో, ఫలానా హీరోయిన్ వేసుకున్న డ్రస్‌నో అనుకరించే వాళ్లను చాలా మందిని చూసి ఉంటాం. కానీ తన ఫేవరెట్ స్టార్‌లా కనిపించాలని అసలు మొహాన్నే దూరం చేసుకుందో అభిమాని.

ఏంజెలినా జోలిలా కనిపించేందుకు 50 సర్జరీలు చేయించుకున్న ఇరాన్‌లోని టెహరాన్‌కు చెందిన సహర్ తబార్‌కు ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలోయర్లు విపరీతంగా పెరిగిపోయారు.

పోస్ట్‌ Instagram స్కిప్ చేయండి, 1
Instagram ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో Instagram అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు Instagram కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of Instagram ముగిసింది, 1

తబార్ అమెరికా నటి ఏంజెలినా జోలికి వీరాభిమాని.

జోలి ముక్కు, దొండపండులాంటి పెదాలంటే తబార్‌కు చాలా ఇష్టం. అందుకే అలా కనిపించాలని 50 సార్లు ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్నానని తబార్ చెబుతోంది.

50 ఆపరేషన్లతో ఆమె ముఖస్వరూపం పూర్తిగా మారిపోయింది. 40 కిలోల వరకు బరువు కోల్పోయింది.

ఆ ప్లాస్టిక్ సర్జరీ సందర్భంగా తన ముఖంలో వచ్చిన మార్పులకు సంబంధించిన చిత్రాలకు ఇన్‌స్టాగ్రామ్‌లో విపరీతమైన స్పందన వస్తోంది. ప్రస్తుతం ఆమెకు ఇన్‌స్టాగ్రామ్‌లో సుమారు 4 లక్షల మంది ఫాలోయర్లున్నారు.

పోస్ట్‌ Instagram స్కిప్ చేయండి, 2
Instagram ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో Instagram అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు Instagram కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of Instagram ముగిసింది, 2

అయితే ఆమె అబద్ధం చెబుతోందని కొందరు జోలి అభిమానులు అంటున్నారు. తబార్ సర్జరీ చేసుకోలేదనీ.. ప్రోస్థటిక్స్, మేకప్‌ సహాయంతో అలా కనిపిస్తోందని వారు అంటున్నారు.

తాము అభిమానించే వారి కోసం కొంతమంది ఇలాంటి పని చేస్తుంటారని.. తబార్ కూడా అలాంటి వాళ్లలో ఒకరనేది వాళ్ల అభిప్రాయం.

మా ఇతర కథనాలు:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లోనూ సబ్‌స్క్రైబ్ చేయండి.)