ఈ గోళీల పజిల్ విప్పగలరా?
గుడ్ లక్!

ఫొటో సోర్స్, Getty Images
పజిల్ 10
మీరు మరణ శిక్ష పడిన ఓ ఖైదీ. అయితే, ఓ చిన్న గేమ్‌లో నెగ్గితే శిక్షను తగ్గిస్తానని న్యాయమూర్తి మీకు ఆఫర్ ఇచ్చారు.
50 నల్లని గోళీలు, 50 తెల్లని గోళీలు, రెండు ఖాళీ గిన్నెలను మీకు జడ్జీ ఇచ్చారు.
"ఈ 100 గోళీలను విభజించి రెండు గిన్నెల్లో పెట్టండి. మీకు నచ్చినట్టుగా ఎలాగైనా విభజించండి.
తర్వాత మీ కళ్లకు గంతలు కడతాను. రెండు గిన్నెలను చుట్టూ, అటూఇటూ జరుపుతాను.
అప్పుడు మీరు ఒక గిన్నెను ఎంపిక చేసుకుని, అందులోంచి ఒక గోళీని తీస్తారు.
ఒకవేళ మీరు తీసిన గోళీ తెల్లనిదైతే మీకు శిక్ష తగ్గుతుంది. నల్ల రంగుదైతే మీకు మరణ శిక్ష పడుతుంది" అని జడ్జీ చెబుతారు.
మరి చివరికి తీసింది తెల్లని గోళీ అయ్యే అవకాశం(సంభావ్యత) గరిష్ఠంగా ఉండేలా, ఆ గోళీలను మీరు ఎలా విభజిస్తారు?
చెప్పలేకపోతున్నారా!

జవాబు
ఒక గోళీని ఒక గిన్నెలో పెట్టండి. మిగతా అన్నింటినీ రెండో గిన్నెలో వేయండి(49 తెల్లవి, 50 నల్లవి)
ఇలా చేస్తే, మీరు ఒకే తెల్లని గోళీ ఉన్న గిన్నెను ఎంచుకునే అవకాశం 50/50తో ప్రారంభమవుతుంది. అది మీ ప్రాణాన్ని కాపాడుతుంది.
ఒకవేళ రెండో గిన్నెను తీసుకున్నా, అందులోనూ 49 తెల్లని గోళీల నుంచి ఒకదాన్ని ఎంచుకునే అవకాశం దాదాపు 50/50 ఉంటుంది.
* ఈ పజిల్‌ను ఫిట్ బ్రెయిన్స్ అనే సంస్థ రూపొందించింది.
ఇవి కూడా ప్రయత్నించండి
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








