పజిల్: వీరిలో హంతకుడెవరో చెప్పగలరా?

ఫొటో సోర్స్, Getty Images
పజిల్ 5
అక్కడ ఐదుగురు మనుషులు ఉన్నారు.
వారిలో ఒకరు, మిగిలిన వాళ్లలో ఒకరిని కాల్చి చంపారు.
కొన్ని సూచనలు:
1. నిన్న న్యూయార్క్‌లో జరిగిన మారథాన్‌లో డాన్.. మరో వ్యక్తితో కలిసి పరుగెత్తాడు.
2. నగరానికి వెళ్లడానికి ముందు మైక్ తన ఊరిలో వ్యవసాయం చేస్తుండేవాడు.
3. జెఫ్ కంప్యూటర్ నిపుణుడు. వచ్చేవారం బెన్ ఇంట్లో కొత్త కంప్యూటర్‌ను అమర్చేందుకు సిద్ధమవుతున్నాడు.
4. కొద్ది రోజుల క్రితమే వైద్యులు హంతకుడి కాలును తొలగించారు.
5. జాక్‌ను బెన్ ఒక్కసారి మాత్రమే కలిశాడు. అదికూడా ఆరు నెలల క్రితం.
6. హత్య జరిగినప్పటి నుంచి జాక్ ఒంటరిగా ఉంటున్నాడు.
7. డాన్ తాగుబోతు.
8. జెఫ్, బెన్ కలిసి ఓ కంప్యూటర్‌ను రూపొందించుకున్నారు.
9. జాక్‌కి హంతకుడు సోదరుడు. ఇద్దరూ చిన్నప్పటి నుంచి సియాటిల్ నగరంలో కలిసే పెరిగారు.
ఇప్పుడు చెప్పండి హంతకుడెవరో !
జవాబు
మైక్‌ని జెఫ్ చంపాడు.
ఎలా అంటే?
1. జాక్ హంతకుడు కాదు. ఎందుకంటే, అతను హంతకుడికి సోదరుడు.
2. డాన్ హంతకుడు అయ్యే అవకాశం లేదు. ఎందుకంటే, అతడు మారథాన్‌లో పరుగెత్తాడు. హంతకుడు కొద్ది రోజుల కిందటే కాలును కోల్పోయాడు. అతడు పరుగెత్తలేడు కదా.
3. బెన్ హంతకుడు కాదు. ఎందుకంటే, అతడు జాక్‌ని ఒక్కసారే కలిశాడు. కానీ, జాక్, హంతకుడు అన్నదమ్ములు. చిన్నప్పటి నుంచీ కలిసే పెరిగారు.
4. ఇక మిగిలింది జెఫ్, మైక్.
ఈ ఇద్దరిలో జెఫ్ బతికే ఉన్నాడు (అతను వచ్చేవారం కంప్యూటర్‌ను అమర్చేందుకు సిద్ధమవుతున్నాడు). కాబట్టి, అతనే హంతకుడు అయ్యుంటాడు. మరోవైపు జాక్‌కి మైక్ సోదరుడు కాదు.
జాక్, డాన్, జెఫ్ ముగ్గురూ బతికే ఉన్నారని తెలిసిపోయింది. బెన్ కూడా బతికే ఉన్నాడు కాబట్టే అతని కంప్యూటర్‌ను అమర్చేందుకు జెఫ్ సిద్ధమవుతున్నాడు.
మైక్‌ని జెఫ్ హత్య చేశాడు.
ఈ పజిల్‌నురోసెట్టా స్టోన్ గ్రూపు సంస్థ ఫిట్ బ్రెయిన్స్ రూపొందించింది.
ఇవి కూడా ప్రయత్నించండి:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









