ఈ బంగారు కడ్డీల్లో ఏది నకిలీ?

ఫొటో సోర్స్, Getty Images
పజిల్
మీ మెదడుకు పని చెప్పండి.
ఈ పజిల్‌ను పరిష్కరించండి.
మీ దగ్గర ఏడు బంగారు కడ్డీలు ఉన్నాయి. కానీ అందులో ఒకటి నకిలీది.
మిగతా వాటికన్నా ఈ నకిలీ బంగారు కడ్డీ బరువు తక్కువ. మీ దగ్గర ఒక త్రాసు ఉంది. కానీ దానిని మీరు రెండు సార్లు మాత్రమే వాడొచ్చు.
మీరు నకిలీ బంగారు కడ్డీని ఎలా గుర్తిస్తారు?
జవాబు
త్రాసుకు ఇరువైపులా గల తక్కెళ్లలో మూడు కడ్డీల చొప్పున ఉంచండి.
త్రాసు సమానంగా ఉన్నట్లయితే.. అందులో పెట్టగా మిగిలిపోయిన కడ్డీ నకిలీది.
త్రాసు సమానంగా లేకపోతే.. తక్కువ బరువున్న తక్కెడలోని మూడు కడ్డీలను తీసుకోండి.
వాటిలో రెండు కడ్డీలను త్రాసు రెండు తక్కెళ్లలో ఉంచండి.
అవి సమానంగా నిలిచిన్లయితే.. అందుల పెట్టని కడ్డీ నకిలీది.
అవి సమానంగా లేకపోతే.. రెండిట్లో తక్కువ బరువున్న కడ్డీ నకిలీది.
ఈ పజిల్ స్పెక్ట్రమ్ సీక్రెట్ ఏజెన్సీ ఎంట్రన్స్ ఎగ్జామ్‌లోనిది.
ఇవి కూడా ప్రయత్నించండి:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









