ఒక గ్యాలన్‌ను ఎలా కొలవాలి?

ఫొటో సోర్స్, Getty Images
పజిల్ - 4
ఓ పాల వ్యాపారి దగ్గర రెండు ఖాళీ డబ్బాలున్నాయి. ఒకదాంట్లో మూడు గ్యాలన్లు, మరొకదానిలో ఐదు గ్యాలన్ల పాలు పట్టగలవు.
అయితే, ఒక్క పాల చుక్క కూడా వృథా కాకుండా అతను ఒక గ్యాలన్ పాలను ఎలా కొలవగలరు.
జవాబు
పాలవ్యాపారి మొదటగా 3 గ్యాలన్ల డబ్బాను పాలతో నింపేస్తారు.
తర్వాత ఆ పాలను పూర్తిగా 5 గ్యాలన్ల డబ్బాలో పోస్తారు.
మళ్లీ ఖాళీగా ఉన్న 3 గ్యాలన్ల డబ్బాను పూర్తిగా పాలతో నింపుతారు.
తర్వాత 5 గ్యాలన్ల డబ్బా పూర్తిగా నిండే వరకు 3 గ్యాలన్ల డబ్బా నుంచి పాలను పోస్తారు.
అప్పుడు 3 గ్యాలన్ల డబ్బాలో ఉండేది కచ్చితంగా ఒక గ్యాలన్ పాలు అవుతుంది.
దీన్ని రోస్టర్ స్టోన్ కంపెనీకి చెందిన ఫిట్ బ్రెయిన్స్ రూపొందించింది.
ఇవి కూడా ప్రయత్నించండి:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









