పజిల్: ఈ ఎలుగుబంటి కలరేంటో చెప్పండి

ఫొటో సోర్స్, Getty Images
పజిల్ 6
మీరు 5 కిలోమీటర్లు దక్షిణం వైపు వెళ్లారు. తర్వాత పడమర దిశగా 5 కిలోమీటర్లు ప్రయాణించారు. అక్కడి నుంచి ఉత్తరం వైపునకు 5 కిలోమీటర్లు వెళ్లారు.
ఇప్పుడు మీరు ఎక్కడి నుంచి ప్రయాణం మొదలు పెట్టారో తిరిగి అక్కడికే వచ్చినట్లు గుర్తించారు.
ఈ ప్రయాణంలో మీరు ఒక ఎలుగుబంటిని చూశారు. అది ఏ రంగులో ఉంది?
సమాధానం అంతుబట్టడం లేదా?

జవాబు
తెలుపు.
ఎలా అంటే?
దక్షిణం దిశగా 5 కిలోమీటర్లు ప్రయాణించి, అక్కడ నుంచి పడమర వైపు 5 కిలోమీటర్లు, ఆ తర్వాత ఉత్తరం వైపు తిరిగి 5 కిలోమీటర్లు వెళ్తే మీరు ఎక్కడ బయల్దేరారో, సరిగ్గా అక్కడికే చేరుకోగలిగిన ఏకైక ప్రదేశం ఉత్తర ధృవం.
ఉత్తర ధృవం వద్ద ఉండే ఎలుగుబంట్లు అన్నీ ధృవపు ఎలుగుబంట్లు. తెలుపు రంగులోనే ఉంటాయి.
ఈ ప్రశ్నను స్పెక్ట్రమ్ సీక్రెట్ ఏజెన్సీ ప్రవేశ పరీక్ష నుంచి తీసుకున్నాం.
ఇవి కూడా ప్రయత్నించండి:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








