బెంగళూరులో ఉబర్, ఓలా బోట్ ట్యాక్సీలు నడుస్తాయంటూ సోషల్ మీడియాలో ఎందుకు జోకులు పేలుతున్నాయి?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, ఇమ్రాన్ ఖురేషీ
- హోదా, బీబీసీ కోసం
బెంగళూరులో కురిసిన భారీ వర్షాలకు రోడ్లు జలమయమయ్యాయి. బెంగళూరును ఐటీ రాజధాని అని పిలుస్తారు. కానీ, బెంగళూరులో కురిసిన వర్షాల నేపథ్యంలో ఒక గ్రాఫిక్‌తో కూడిన పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అయింది.
ఈ పోస్టర్‌లో ఉబర్ ట్యాక్సీ సంస్థ కార్లకు బదులు నౌకలను పంపిస్తున్నట్లు పేజీని మార్చారు.

ఫొటో సోర్స్, Twitter
బెంగళూరు ఔటర్ రింగ్ రోడ్ లో నీటితో నిండిన రోడ్లు ఆగ్నేయ బెంగళూరు ప్రాంతం పై తీవ్రమైన ప్రభావం చూపించింది.
వ్యాపారవేత్త మోహన్‌దాస్ పాయ్ ఐటీ రంగం దృక్కోణంలో ఒక ట్వీట్ చేశారు.
"10 నిమిషాల్లో సరుకులు డెలివరీ చేసే యాప్స్ రూపొందించే ఐటీ ఉద్యోగులు, రెండు గంటల సేపు ప్రయాణించి తమ ఆఫీసుకు చేరుకోవాల్సిన నగరం బహుశా ప్రపంచంలో బెంగళూరు ఒక్కటే అయి ఉండొచ్చు" అని ఆయన ట్వీట్ చేశారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 1
వరదల్లో చిక్కుకున్న వారిని రక్షించేందుకు బుల్ డోజర్లను వినియోగించడం పై కూడా ట్వీట్లు చేశారు.
ఆదివారం రాత్రి బెంగళూరులో కురిసిన వర్షాలతో వరదల మాదిరి పరిస్థితి తలెత్తింది.
గతంలో ఇంత భారీ వర్షపాతం సెప్టెంబరు 1998లో (18 సెంటీమీటర్లు) 2014లో (13.23 సెంటీమీటర్లు) కురిసినట్లు వాతావరణ శాఖ తెలిపింది.
ఆదివారం 13.18 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయింది.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 2
"నేనొక మీటింగ్‌కు హాజరయ్యేందుకు ఆఫీసుకు వెళ్లాను. నేనక్కడకు వెళ్ళేటప్పటికి ఆఫీసుకు ఎవరూ రాలేదు. దీంతో, నేను వెనక్కి తిరిగి వచ్చాను" అని పేరు చెప్పేందుకు ఇష్టపడని ఒక ఐటీ ఉద్యోగి చెప్పారు.
"నేనొక సంస్థలో బాధ్యతాయుతమైన స్థానంలో ఉన్నాను. కానీ, సంస్థకు సంబంధించిన మెసేజీలు కూడా చదవలేకపోవడం సిగ్గు చేటు. వర్షంలో ఆఫీసుకు రావద్దని సందేశం పంపారు. ఆ సందేశం నేను చూసుకోలేదు. ఔటర్ రింగ్ రోడ్ నుంచి మాత్రమే కాదు, ఏ దారిలోనైనా ఆఫీసుకు చేరుకోవడం చాలా కష్టమైన పని" అని చెప్పారు.
బెంగళూరులో చాలా ఐటీ సంస్థలు ఒక వారం రోజులు తమ ఉద్యోగులను ఇంటి నుంచే పని చేయమని సూచించాయి. చాలా స్కూళ్లు కూడా ఆన్ లైన్ విధానానికి మారాయి.

ఫొటో సోర్స్, Getty Images
ఇంత విధ్వంసం ఎందుకు?
బెంగళూరులో వాతావరణం చాలా త్వరగా వేడెక్కి మబ్బులు ఏర్పడుతూ ఉంటాయి. దీంతో వర్షాలు విరివిగా కురుస్తాయి.
"ఉత్తర, ఈశాన్య ప్రాంతంలో కంటే కూడా దక్షిణ, ఆగ్నేయ బెంగళూరులో ఎక్కువ సమస్యలుండటానికి ఇదొక కారణం" అని బెంగళూరు వాతావరణ శాఖ లో సీనియర్ సైంటిస్ట్ ఏ ప్రసాద్ చెప్పారు.
"11 డిగ్రీల ల్యాటిట్యూడ్ దగ్గర ఏర్పడిన మబ్బుల వల్ల మాండ్యా జిల్లాలో భారీ వర్షాలు కురిశాయి. కావేరీ జలాలను శుద్ధి చేసి బెంగళూరుకు పంపిణీ చేసేందుకు పంపు సెట్లను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం కురిసిన భారీ వర్షాలతో మంచి నీటి సరఫరా పై ప్రభావం పడుతుంది" అని చెప్పారు.
"ఈ నగరంలో సాధారణ వర్షపాతం కంటే మూడు లేదా నాలుగు రెట్లు ఎక్కువ వర్షపాతం నమోదవుతోంది. మొదటి సారి నగరంలో చెరువులు, కాల్వలు పూర్తిగా నిండిపోయాయి. ఇక అదనంగా ఒక్క చుక్క నీరు చేర్చేందుకు కూడా వీలులేదు. ఈ వర్షాల వల్ల నిండిపోయిన నీటిని తొలగించేందుకు వేరే మార్గాలేవీ లేవు. ఈ వర్షాలు నగరానికి చిక్కులు తెచ్చాయి. వీటిని వరదల కిందే పరిగణించాలి" అని బెంగళూరు మునిసిపల్ కమిషనర్ తుషార్ గిరినాథ్ అన్నారు.
అధికారులు చేపట్టిన చర్యలతో సోమవారం నాటికి ప్రభావిత ప్రాంతాలను సగానికి పైగా తగ్గించినట్లు చెప్పారు.
మురికి కాలువలను శుభ్రం చేసే పనులను కూడా చేపట్టినట్లు చెప్పారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 3
తరచుగా సమస్యలెందుకు వస్తున్నాయి?
బెంగళూరులో రోడ్ల పై నీరు చేరడం గురించి తరచుగా ఫిర్యాదులు వినిపిస్తున్నాయి.
"ఈ సారి ఎక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే వాళ్ళ ప్రాంతాల్లో వర్షాలు కురవడంతో గతంలో కంటే కూడా విమర్శలు ఎక్కువగా వినిపిస్తున్నాయి" అని జనాగ్రహ స్వచ్చంద సంస్థ అధికారి శ్రీనివాసన్ అలావలి చెప్పారు.
మరో సారి ఇదే స్థాయిలో వర్షం పడితే పరిస్థితులు మరింత తీవ్రమవుతాయని అన్నారు.

ఫొటో సోర్స్, ANI
"ఇది వ్యవస్థలో ఉన్న సమస్య. బెంగళూరు సముద్ర మట్టానికి ఎత్తైన ప్రాంతంలో ఉండటమే కాకుండా చాలా సరస్సులు, చెరువులు ఉన్నాయి. అధిక వర్షపాతం కురిసినప్పుడు చెన్నై, హైదరాబాద్, కోల్ కతా నగరాల్లో మాదిరి పరిస్థితులే ఇక్కడ కూడా తలెత్తాయి" అని అన్నారు.
ఒకప్పుడు చెరువులు, నీటితో ఉన్న ప్రాంతాల్లో భవనాలు నిర్మించడంతో ఈ పరిస్థితి తలెత్తింది" అని అన్నారు. అన్ని నగరాల్లోనూ ఇదే సమస్య అని అన్నారు.
ఈ కథనంలో Google YouTube అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు Google YouTube కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of YouTube ముగిసింది, 1
"అభివృద్ధి కోసం చేపట్టిన కార్యక్రమాలు ప్రకృతిని గౌరవించలేదు. ప్రకృతిని నిరోధించగలమని అనుకుంటే మిమ్మల్ని మీరు మోసం చేసుకోవడమే. ప్రకృతిని విధ్వంసం చేస్తే పరిణామాలు తీవ్రంగానే ఉంటాయి" అని అర్బన్ ప్లానర్ వి.రవి చందర్ అన్నారు.
"ఈ సమస్య ఇప్పట్లో పరిష్కారం కాదు. ఈ సమస్య మరింత దారుణంగా మారుతుంది. అవసరం కంటే ఎక్కువ జనావాసాలను నిర్మించాం. మురికి నీటి కాలువలను శుభ్రం చేయలేదు. ఇక్కడే ప్రభుత్వ సామర్ధ్యం ప్రశ్నార్థకంగా మారుతుంది.
"ఇది చాలా ప్రమాదకరమైన వలయం. కార్యనిర్వాహక లోపాలు కూడా ఉన్నాయని అంగీకరిస్తాను. వరదల వల్ల తలెత్తిన సమస్యల తర్వాత ఎవరైనా ఎన్నికల్లో ఓడిపోయారా? ఈ పరిస్థితిని మరింత సంక్లిష్టం చేశారు. 1991లో ఆర్ధిక సంస్కరణలను అమలు చేసిన సమయంలో కూడా ఇలాంటి పరిస్థితే ఉండేది. మనం 21వ శతాబ్దంలో ఉండి ఉండొచ్చు. కానీ, పరిపాలన మాత్రం ఇంకా 19వ శతాబ్దంలోనే కొనసాగుతోంది" అని అన్నారు.
"పరిస్థితులను మెరుగుపరిచేందుకు స్థానిక కమ్యూనిటీలన్నీ కలిసికట్టుగా పని చేయాలి. ప్రజలందరూ సహకరించాలి. నిపుణుల సహాయం తీసుకుని ప్రభుత్వం దగ్గరకు ప్రతిపాదనలు తీసుకుని వెళ్ళాలి. ఇంత కంటే వేరే మార్గం లేదు" అని రవిచందర్ అన్నారు.
ఈ కథనంలో Google YouTube అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు Google YouTube కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of YouTube ముగిసింది, 2
ఇవి కూడా చదవండి:
- ఈద్గా మైదానంలో వినాయక చవితి వేడుకలు... ఏమిటీ వివాదం, వక్ఫ్ ఆస్తులంటే ఏమిటి?
- తెలంగాణలో వాటర్ స్పౌట్: సింగూరు ప్రాజెక్టు నీళ్లు సుడులు తిరుగుతూ ఆకాశంలోకి ఎందుకు వెళ్లాయి?
- బ్రిటన్ కొత్త ప్రధానమంత్రిగా లిజ్ ట్రస్ ఎన్నిక.. ఆమె గురించి మీరు తెలుసుకోవాల్సిన విషయాలు..
- 'నా వయసు 20 ఏళ్లు.. గుండెలో ఇన్ఫెక్షన్ వచ్చింది.. అది బ్లడ్ క్యాన్సర్‌గా మారుతుందని అనుకోలేదు'
- పొరపాటున ఇతర అకౌంట్లకు ట్రాన్స్ఫర్ చేసిన డబ్బును తిరిగి పొందడం ఎలా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)











