'ఏడాదిలోగా మనుమడో, మనుమరాలినో కనివ్వండి, లేదా 5 కోట్ల పరిహారం కట్టండి' -కొడుకు, కోడలిపై తల్లితండ్రుల కేసు

పెళ్లి

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, పాట్రిక్ జాక్సన్
    • హోదా, బీబీసీ న్యూస్

ఉత్తరాఖండ్‌కు చెందిన ఓ దంపతులు తమ ఒక్కగానొక్క కుమారుడు, అతడి భార్య మీద కేసు వేశారు. వారికి పెళ్లి చేసి ఆరేళ్లు దాటినా కూడా తమకు మనుమడినో, మనుమరాలినో ఇవ్వడం లేదంటూ కోర్టును ఆశ్రయించారు.

''మా కుమారుడిని పెంచి పెద్ద చేయడానికి, పైలట్ ట్రైనింగ్ ఇప్పించడానికి, అట్టహాసంగా పెళ్లి చేయడానికి మేం సంపాదించి దాచుకున్న డబ్బులన్నీ ఖర్చు చేసేశాం'' అని సంజీవ్ (61), సాధనా ప్రసాద్ (57) చెప్తున్నారు.

ఏడాదిలోగా మనుమడు లేదా మనుమరాలిని ఇవ్వకపోతే తమ కొడుకు, కోడలు నుంచి తమకు ఐదు కోట్ల రూపాయల పరిహారం చెల్లించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

ఈ కేసు మీద వారి కొడుకు, కోడలు స్పందించినట్లు కనిపించటంలేదు.

ఆ తల్లిదండ్రులు ''మానసిక వేధింపులు'' ప్రాతిపదికన ఈ అసాధారణ దావా వేశారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది

తను దాచుకున్న డబ్బులన్నీ తన కొడుకు కోసం ఖర్చు చేశానని, 2006లో పైలట్ శిక్షణ కోసం అతడిని అమెరికాకు పంపించడానికి 50 లక్షల రూపాయాలు ఖర్చయిందని ప్రసాద్ చెప్పినట్లు టైమ్స్ ఆఫ్ ఇండియా ఒక కథనంలో తెలిపింది.

ఏడాది తర్వాత 2007లో అమెరికా నుంచి తిరిగి వచ్చిన తమ కొడుకు ఉద్యోగం కోల్పోయాడని, దీంతో, రెండేళ్లకు పైగా అతడికి తామే ఆర్థికంగా మద్దతు ఇవ్వాల్సి వచ్చిందని పేర్కొన్నారు.

శ్రేయ్ సాగర్ (35) ఆ తర్వాత ఎట్టకేలకు పైలట్‌గా ఉద్యోగం సంపాదించారు. ఉద్యోగ విరమణ చేసిన తాము ఆడుకోవటానికి ఒక మనుమడినో మనుమరాలినో ఇస్తారనే ఆశతో.. తమ కుమారుడికి 2016లో సుభాంగి సిన్హా (ఇప్పుడు ఆమె వయసు 31 సంవత్సరాలు)తో పెళ్లి జరిపించామని అతడి తల్లిదండ్రులు చెబుతున్నారు.

ఓ ఫైవ్ స్టార్ హోటల్‌లో ఈ పెళ్లి వేడుక కోసం భారీ మొత్తం చెల్లించామని, 60 లక్షల రూపాయల విలువైన కారు కొనిచ్చామని, విదేశాల్లో హనీమూన్‌కు పంపించామని ఆ తల్లిదండ్రులు చెప్తున్నారు.

వీడియో క్యాప్షన్, పెళ్ళిలో కరెంటు పోయింది... పెళ్ళికూతుళ్ళు మారిపోయారు

''మా కుమారుడికి పెళ్లయి ఆరేళ్లయింది. కానీ వాళ్లు ఇంకా బిడ్డను కనే ఆలోచన చేయటం లేదు. మేం కలిసి కాలం వెళ్లదీయటానికి కనీసం మాకొక మనుమడో మనుమరాలో ఉంటే మా బాధలను తట్టుకోగలం'' అని ప్రసాద్ పేర్కొన్నారు.

''మానసిక క్రూరత్వం'' కారణంగా ఈ దంపతులు నగదు పరిహారం డిమాండ్ చేశారని వారి తరఫు న్యాయవాది ఎ.కె. శ్రీవాస్తవ చెప్పారు.

''అవ్వా తాతలు కావాలన్నది ప్రతి అమ్మానాన్నల కల. వీళ్లు అవ్వా తాతలు కావటానికి చాలా ఏళ్లుగా ఎదురుచూస్తున్నారు'' అని పేర్కొన్నారు.

హరిద్వార్‌లో దాఖలు చేసిన ఈ దంపతుల పిటిషన్‌ను స్థానిక కోర్టు మే 17వ తేదీన విచారించే అవకాశముంది. ఈ అంశంపై వారి కొడుకు, కోడలు స్పందించినట్లు కనిపించలేదు.

వీడియో క్యాప్షన్, కోడలికి ఘనంగా రెండో పెళ్లి చేసిన అత్త

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)