వీర్ మహాన్: WWEలో దుమ్ము దులుపుతున్న ఈ రెజ్లర్ ఎవరు?

వీర్ మహాన్

ఫొటో సోర్స్, twitter/VeerMahaan

    • రచయిత, హర్షల్ ఆకుడే
    • హోదా, బీబీసీ ప్రతినిధి

ఒకప్పుడు భారతదేశంలో క్రికెట్‌తో పాటు WWE, WWF షోలకు కూడా మంచి క్రేజ్ ఉండేది. అండర్‌టేకర్, కేన్, జాన్ సెనా, ది రాక్ లాంటి పెద్ద సూపర్‌స్టార్లు అప్పట్లో WWEలో అగ్రస్థానంలో ఉండేవారు. భారతదేశం నుంచి 'ది గ్రేట్ ఖలీ' (దలీప్ సింగ్ రానా) కూడా WWEలో తుక్కు రేగ్గొట్టేవాడు.

గ్రేట్ ఖలీకి పెద్ద అభిమాన గణం ఉండేది. ఇప్పుడు ఈ జాబితాలోకి వీర్ మహాన్ చేరాడు.

సోషల్ మీడియాలో వీర్ మహాన్‌పై విపరీతంగా చర్చలు జరుగుతున్నాయి. WWEలోకి ప్రవేశించిన తర్వాత వీర్ మహాన్ రూపం, స్టైల్ అందరినీ ఆకర్షిస్తోంది. భారతీయ శైలిలో శైవ నామాలు పెట్టుకుని ధృడంగా, బలంగా కనిపించే వీర్ మహాన్‌కు ఫాలోయింగ్ పెరిగిపోతోంది.

ఇంతకీ వీర్ మహాన్ ఎవరు? WWEలో అతడి ఎంట్రీపై ఇంత చర్చ ఎందుకు జరుగుతోంది?

వీర్ మహాన్

ఫొటో సోర్స్, twitter/WWEIndia

వీర్ మహాన్ ఎవరు?

ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఒక చిన్న గ్రామం నుంచి వచ్చి WWE స్థాయికి ఎదిగిన వీర్ మహాన్ తన ప్రయాణంలో ఎన్నో ఆటుపోటులు ఎదుర్కొన్నాడు.

ఈ కండల వీరుడి అసలు పేరు రింకు సింగ్ రాజ్‌పుత్. 34 ఏళ్ల రింకు ఉత్తర్‌ప్రదేశ్‌లోని రవిదాస్ నగర్ జిల్లాలో గోపిగంజ్‌ అనే చిన గ్రామంలో పుట్టాడు. రింకు సింగ్ తండ్రి ఓ ట్రక్ డ్రైవర్‌. ఆయనకు 9 మంది పిల్లలు. వారిలో రింకు ఒకడు. వీళ్ల కుటుంబం గోపిగంజ్‌లోనే నివసిస్తోంది.

రింకు చిన్నప్పటి నుంచీ ఆటలపై మక్కువ చూపేవాడు. కుస్తీ పట్టేవాడు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 1
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 1

బేస్‌బాల్‌లో వేగం

రింకు సింగ్ చదువుకునే రోజుల్లో జావెలిన్ త్రో ఆడేవాడు. జూనియర్ నేషనల్‌లో పతకం కూడా సాధించాడు. ఆ తరువాత లక్నోలోని గురుగోవింద్ సింగ్ స్పోర్ట్స్ కాలేజీలో చేరాడు.

2008లో రింకు ఒక టీవీ రియాలిటీ షో 'ది మిలియన్ డాలర్ ఆర్మ్'లో పాల్గొన్నాడు. ఇది ఒక బేస్‌బాల్ టాలెంట్ హంట్ షో. ఇందులో వేగంగా బేస్‌బాల్ విసరగలిగేళ్లు చాలామంది పాల్గొన్నారు.

రింకు జావెలిన్ త్రో అనుభవం ఈ షోకు బాగా ఉపయోగపడింది. అంతకుముందు అతడు బేస్‌బాల్ ఆడింది లేదు. కానీ, ధృడమైన శరీరం, వేగం కారణంగా ఈ టాలెంట్ షోలో రింకు గెలిచాడు.

ఈ షోలో రింకు సింగ్ గంటకు 140 కిమీ వేగంతో బంతి విసిరి నంబర్ వన్‌గా నిలిచాడు. తన నిజ జీవిత కథపై ఓ సినిమా కూడా రూపొందింది.

దీని తరువాత రింకు సింగ్‌కు బేస్‌బాల్‌పై ఆసక్తి పెరిగింది. ఈ ఆటలో కెరీర్ కోసం అతడు అమెరికా వెళ్లాడు. అక్కడ వివిధ బేస్‌బాల్ జట్లలో పాలుపంచుకున్నాడు. చివరికి పీటర్స్‌బర్గ్ పైరేట్స్‌తో ఒప్పందం కుదుర్చుకున్నాడు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 2
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 2

ప్రొఫెషనల్ అమెరికన్ బేస్‌బాల్ జట్టులో ఆడిన తొలి భారతీయ క్రీడాకారుడిగా రింకు రికార్డు సృష్టించాడు. క్రమంగా బేస్‌బాల్ విసిరే వేగాన్ని గంటకు 140 కిమీ నుంచి 145 కిమీకి పెంచాడు.

2009 నుంచి 2016 వరకు ప్రపంచవ్యాప్తంగా అనేక బేస్‌బాల్ పోటీల్లో పాల్గొన్నాడు. అతడి ఆట ప్రపంచం దృష్టిని ఆకర్షించింది.

2018లో రింకు సింగ్ బేస్‌బాల్ ఆటకు వీడ్కోలు పలికాడు. తరువాత, ప్రొఫెషనల్ రెజ్లింగ్‌పై శ్రద్ధ పెట్టడం ప్రారంభించాడు. 2018లో WWEతో సంతకం చేశాడు.

భారత ఆటగాడు సౌరవ్ గుర్జార్‌తో కలిసి 'ది ఇండస్ షేర్' పేరుతో జట్టును ఏర్పాటు చేశాడు. వీరిద్దరూ కలిసి WWE NXTలో పాల్గొన్నారు. ప్రారంభ దశలో రింకు సింగ్ తన అసలు పేరుతోనే WWEలో ప్రసిద్ధి పొందాడు.

వీళ్ల జట్టులో జిందర్ మహల్ అనే ఆటగాడు కూడా చేరాడు. ఆ సమయంలోనే రింకు సింగ్ తన పేరును వీర్‌గా మార్చుకున్నాడు. అప్పటి నుంచి వీర్ పేరుతోనే రెజ్లింగ్ పోటీల్లో పాల్గొన్నాడు.

వీర్, షాంకీ, జిందర్‌ల జట్టు వరుసగా 12 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. పలు కారాణాల వల్ల 2021లో వీర్ తన జట్టు నుంచి విడిపోయాడు. స్వతంత్ర రెజ్లర్‌గా WWE Raw తో సంతకం చేశాడు. ఈసారి తన పేరును వీర్ మహాన్‌గా మార్చుకున్నాడు.

వీడియో క్యాప్షన్, దివ్య కాక్రణ్: శిక్షించాలని రెజ్లింగ్‌కు పంపిస్తే.. రెజ్లర్‌గా మారారు

వీర్ మహాన్ ట్రంప్ కార్డ్ ఏమిటి?

స్మార్ట్‌ఫోన్‌లు లేని కాలంలో, WWE ప్లేయర్‌లు వారి ట్రంప్ కార్డ్‌లతోనే ప్రాచుర్యం పొందేవారు. ఈ ట్రంప్ కార్డ్‌లో రెజ్లర్ ఎత్తు, బరువు మొదలైన వాటి సమాచారం ఉంటుంది.

మరి వీర్ మహాన్ ట్రంప్ కార్డ్ ఏంటి?

వీర్ మహాన్ ఎత్తు 6 అడుగుల 4 అంగుళాలు, బరువు 125 కిలోలు.

WWE షోలలో, వీర్ మహాన్ భారతీయ శైలిలో కనిపిస్తాడు. భుజాల వరకూ పెరిగిన జుట్టు, నల్లటి కళ్లు, పొడవాటి గడ్డం, నుదుటిపై శైవ నామాలతో గంభీరంగా కనిపిస్తాడు.

రింకు గంధంతో నుదుటిపై పెట్టుకునే అడ్డ నామాలు, మెడలో వేసుకునే రుద్రాక్ష పూసలు భారతీయ సంప్రదాయాన్ని గుర్తుచేస్తాయి.

వీర్ మహాన్

ఫొటో సోర్స్, twitter/WWEIndia

అతడి పాత మిత్రుడు, ఒకప్పటి జట్టు సభ్యుడు సౌరవ్ గుర్జార్ ఇలాగే శైవ నామాలు పెట్టుకునేవాడు.

వీర్ మహాన్ ఛాతీపై టాటూ ఉంటుంది. దాన్లో 'మా' (అమ్మ) అని పెద్ద అక్షరాలతో రాసి ఉంటుంది. అది అందరి దృష్టిని విశేషంగా ఆకర్షిస్తుంది. వీర్ మహాన్ నల్లటి దుస్తులే ధరిస్తాడు. ఈ స్టైలో రింకు మిగతావారి కన్నా ప్రత్యేకంగా కనిపిస్తాడు.

ఇదే స్టైల్‌తో ఈ ఏడాది ఏప్రిల్ 4న WWEలోకి అడుగుపెట్టాడు. గత ఏడాది అక్టోబర్‌లో వీర్ WWE Rawలో చేరే విషయంపై చాలా చర్చ జరిగింది. విస్తృత ప్రచారం కూడా జరిగింది. చివరకు ఏప్రిల్ 4న వీర్ మహాన్ బరిలోకి దిగాడు.

ఈ మ్యాచ్‌లో వీర్ మహన్, తండ్రీకొడుకులైన రే మిస్ట్రియో, డొమినిక్ మిస్ట్రియోలతో తలపడ్డాడు. వారిని చిత్తుగా ఓడించాడు. ఈ మ్యాచ్‌పై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరిగింది.

వీడియో క్యాప్షన్, ‘మగాళ్లతో ఫైట్ చేయటం నాకిష్టం’

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)