హైదరాబాద్: బోయిగూడలో ఘోర అగ్నిప్రమాదం, 11 మంది సజీవ దహనం

బోయగూడ అగ్నిప్రమాదం

ఫొటో సోర్స్, UGC

ఫొటో క్యాప్షన్, బోయగూడ గోడౌన్లో అగ్నిప్రమాదం

సికింద్రాబాద్‌లోని బోయిగూడ సమీపంలో ఓ గోడౌన్లో అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘోర ప్రమాదంలో 11 మంది చనిపోయారు. ఒక వ్యక్తి ప్రాణాలతో బయటపడ్డారు.

మంటల్లో చిక్కుకుని మరణించిన వారంతా బీహార్‌కు చెందిన కూలీలుగా భావిస్తున్నారు.

బుధవారం ఉదయం 8 మంది మృతదేహాలను వెలికి తీసినట్లు అగ్నిమాపక శాఖ అధికారులు మీడియాకు తెలిపారు. అగ్నిప్రమాదం సమాచారం అందిన వెంటనే అక్కడికి చేరుకున్న అగ్నిమాపక శాఖ అధికారులు మంటలను త్వరగానే అదుపులోకి తీసుకురాగలిగారు.

చివరకు లోపల ఉన్న 12 మందిలో 11 మంది చనిపోయినట్లు ధ్రువీకరించారు.

బోయగూడ అగ్నిప్రమాదం

ఫొటో సోర్స్, UGC

ఫొటో క్యాప్షన్, బోయగూడ గోడౌన్లో అగ్నిప్రమాదం

ఈ రెండస్తుల స్క్రాప్ గోడౌన్లో మొత్తం 12 మంది ఉన్నారు. వారు అక్కడే పని చేస్తూ, అందులోనే పడుకుంటారు. వారిలో ఒక వ్యక్తి ప్రమాదం నుంచి తప్పించుకుని ప్రాణాలతో బయటపడ్డారు.

ప్రస్తుతం మంటలు పూర్తిగా అదుపులోకి వచ్చాయని అగ్నిమాపక శాఖ అధికారులు తెలిపారు.

ఈ ప్రమాదానికి కారణం ఏమిటన్నది ఇంకా తెలియాల్సి ఉంది.

ప్రాథమిక సమాచారం ప్రకారం మృతుల వివరాలు:

1. సికందర్ (40)

2. బిట్టు (23)

3. సత్యేందర్ (35)

4. గొల్లు (28)

5. దామోదర్ (27)

6. చింటూ (27)

7. రాజేశ్ (25)

8. దీపక్ (26)

9. పంకజ్ (26)

10. రాజేశ్ (25)

11. దినేశ్ (35)

వీరితో పాటు అక్కడే ఉన్న 25 ఏళ్ల ప్రేమ్ ఒక్కడే ప్రాణాలతో తప్పించుకోగలిగారు. ప్రమాదం సంభవించగానే ఆయన భవనం పైనుంచి దూకారు. కిందపడి గాయాల పాలైన ప్రేమ్‌ను చికిత్స కోసం గాంధీ ఆస్పత్రికి తరలించారు.

ఎనిమిది ఫైర్ ఇంజన్లు, జీహెచ్ఎంసీ సిబ్బంది, పోలీసులు ప్రమాద స్థలంలో సహాయక చర్యలు అందిస్తున్నారు. మృతదేహాలను పోస్ట్‌మార్టం కోసం గాంధీ ఆస్పత్రికి తరలించారు.

వీడియో క్యాప్షన్, సికింద్రాబాద్: బోయిగూడ అగ్నిప్రమాదంలో 11 మంది మృతి

మృతులు ఒక్కొక్కరికి రూ. 5 లక్షల పరిహారం

ఈ అగ్ని ప్రమాదం పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మంటల్లో చిక్కుకుని కార్మికులు చనిపోవడంపై కేసీఆర్ సంతాపం ప్రకటించారు.

మృతు కుటుంబాకు రూ. 5 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియాను సీఎం కేసిఆర్ ప్రకటించారు.ప్రమాదంలో ప్రాణాు కోల్పోయిన బీహార్ వలస కార్మికుల మృతదేహాలను వారి స్వస్థలాలకు తరలించేందుకు ఏర్పాట్లు చేయాలని కూడా సీఎస్ సోమేష్ కుమార్‌ను ముఖ్యమంత్రి ఆదేశించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)