బీటింగ్ రీట్రీట్: మహాత్మా గాంధీకి ఇష్టమైన ‘‘అబైడ్ విత్ మి’’ ట్యూన్ తొలగించారా, దీనిపై వివాదం ఎందుకు?

ఫొటో సోర్స్, Getty Images
దిల్లీలోని విజయ్ చౌక్‌లో ఏటా జనవరి 29న బీటింగ్ రీట్రీట్ సెరెమొనీ జరుగుతుంది. ఈ సంగీత కార్యక్రమంతో గణతంత్ర వేడుకలు ముగుస్తాయి.
17వ శతాబ్దం నుంచీ ఈ సైనిక కార్యక్రమం కొనసాగుతోంది. యుద్ధం జరిగేటప్పుడు, రోజూ సాయంత్రం యుద్ధం ముగిసిన తర్వాత సైనికులు డప్పులు వాయిస్తూ, కవాతు నిర్వహించాలని అప్పటి రాజు జేమ్స్ 2 ఆదేశించారు.
అప్పట్లో ఈ వేడుకను ‘‘వాచ్ సెట్టింగ్’’గా పిలిచేవారు. సాయంత్రం ఒక రౌండ్ తూటాలు గాల్లోకి పేల్చడంతో ఈ కార్యక్రమం మొదలవుతుంది. ఇప్పటికీ బ్రిటన్, అమెరికా, కెనడా, న్యూజీలాండ్, ఆస్ట్రేలియా, భారత్‌లలో ఈ ఆనవాయితీ కొనసాగుతోంది.
బీటింగ్ రీట్రీట్‌ను దేశానికి గర్వ కారణంగా భారత రక్షణ మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఈ సంగీత కార్యక్రమంలో భారత్‌తోపాటు పాశ్చాత్య ట్యూన్లను కూడా చోటు ఉంటుంది.
అయితే, ‘‘అబైడ్ విత్ మీ’’ ట్యూన్‌ను ఈ సారి తొలగించబోతున్నారంటూ 2020లానే ఇప్పుడు కూడా వార్తలు వస్తున్నాయి. మహాత్మా గాంధీకి ఇష్టమైన ఈ క్రిస్టియన్ ట్యూన్‌ను తొలగించాలని నరేంద్ర మోదీ ప్రభుత్వం నిర్ణయించినట్లు వాటిలో పేర్కొన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
జనవరి 22న భారత ప్రభుత్వ అధికారిక ట్విటర్ హ్యాండిల్ నుంచి ఓ వీడియోను ట్వీట్ చేశారు. దీనిలో కొంత మంది సైనికులు గణతంత్ర దినోత్సవ కవాతు కోసం కసరత్తులు నిర్వహిస్తున్నారు. దీనిలో కొన్ని హిందీ పాటలు వినిపిస్తున్నాయి.
ఆర్‌డీ బర్మన్ స్వరపరిచిన ఆప్నా దేశ్ సినిమాలోని ‘దునియా మే లోగో కో’తోపాటు ‘మోనికా ఓ మై డార్లింగ్’, ‘వన్స్ అపాన్ ఎ టైమ్’ సినిమాల్లోని పాటలు కూడా ఆ వీడియోలో వినిపిస్తున్నాయి.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 1
ఆ వీడియో ట్వీట్ చేసిన తర్వాత తాజా వివాదం మరింత ముదిరింది. రక్షణ మంత్రిత్వ శాఖ అధికారికంగా స్పందించనప్పటికీ, ఊహాగానాలు ఎక్కువయ్యాయి. ఈ ఏడాది 75వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని కేవలం భారత్ పాటల్నే మోదీ ప్రభుత్వం గణతంత్ర కవాతులో వినిపించబోతోందని ఆదివారం మీడియాలో వార్తలు వచ్చాయి.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 2
‘‘ఈ ఏడాది కేవలం భారత్ పాటల్ని మాత్రమే గణతంత్ర కవాతులో వినిపించబోతున్నట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. అబైడ్ విత్ మీ ట్యూన్ కూడా ఉండబోదు. దేశ రక్షణ కోసం ప్రాణాలు వదిలిన వారి కోసం ఓ పీపుల్ ఆఫ్ మై కంట్రీ పాటను ఆలపిస్తారు. బ్రిటిష్ కాలం నాటి పాటల్ని తొలగించబోతున్నారు’’అని ద హిందూ పత్రిక ఓ కథనం ప్రచురించింది.

ఫొటో సోర్స్, Getty Images
బీటింగ్ రీట్రీట్ సెరెమొనీలో 1950ల నుంచీ ‘అబైడ్ విత్ మీ’ ట్యూన్‌ను ఆలపిస్తున్నారు. అయితే, ఈ ఏడాది విడుదల చేసిన గణతంత్ర కవాతులో ఆలపించే అవకాశమున్న 26 ట్యూన్‌ల జాబితాలో దానికి చోటు దక్కలేదు.
ఈ విషయంపై ప్రభుత్వాన్ని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. ఇదివరకటి మన్మోహన్ సింగ్ ప్రభుత్వంలో ఆర్థిక మంత్రిగా పనిచేసిన పి చిదంబరం ఆదివారం ఈ విషయంపై విలేకరుల సమావేశం ఏర్పాటుచేసి మాట్లాడారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 3
‘‘1847లో రాసిన అబైడ్ విత్ మి.. ఒక క్రిస్టియన్ పాట కావొచ్చు. కానీ, నేడు అన్ని మతాల వారికీ దానితో సంబంధముంది. 1950ల నుంచీ ఈ ట్యూన్‌ను రీట్రీట్ సెరెమొనీలో వినిపిస్తున్నాయి. ఇప్పుడు ఈ పాటను ప్లే చేయడంలేదని తెలిసి నాతోపాటు లక్షల మంది ప్రజలు విచారం వ్యక్తం చేస్తున్నారు. బీజేపీ ప్రభుత్వంలో అసహనం ఏ స్థాయికి పెరిగిందంటే, దాన్ని ఖండించడానికి మాటలు కూడా దొరకడం లేదు’’అని చిదంబరం వ్యాఖ్యానించారు.
2020లోనూ సెరెమొనీలో వినిపించే పాటల జాబితాలో అబైడ్ విత్ మీకి చోటు దక్కలేదు. దీనిపై సోషల్ మీడియాలో వివాదం రాజుకుంది. దీంతో ఎట్టకేలకు కవాతులో ఈ పాటను చేర్చారు.
ఆనాడు మహాత్మా గాంధీ ముని మనవడు గోపాలకృష్ణ గాంధీ స్పందిస్తూ.. ‘‘ఈ ట్యూన్ వల్ల ఎవరికి అగౌరవం కలుగుతోంది? దీని వల్ల ఎవరు నొచ్చుకుంటున్నారు? గాయాలను మాన్పే ఇంత మంచి పాట ఎవరిని బాధపెడుతోంది? మహాత్మా గాంధీకి ఎంతో ఇష్టమైన ఈ ట్యూన్‌లో మాధుర్యాన్ని ప్రభుత్వం ఎందుకు గుర్తించలేకపోతోంది?’’అని వ్యాఖ్యానించారు.
అబైడ్ విత్ మీని స్కాటిష్ రచయిత హెన్రీ ఫ్రాన్సిస్ రాశారు. దీన్ని ప్రముఖ కళాకారుడు విలియమ్ హెన్రీ మాంక్ ఆలపించారు.

ఫొటో సోర్స్, Getty Images
అసంతృప్తి
అబైడ్ విత్ మీ ట్యూన్‌ను తొలగించడంపై చాలా మంది సోషల్ మీడియా వేదికగా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
‘‘దీన్ని రీట్రీట్‌లో ఆలపించడంలేదనే వార్త విని షాక్‌కు గురయ్యాను. ఇది మనసును తాకే ట్యూన్. దీనితో ఏ మతానికి సంబంధం లేదు. ఇది తరతరాలుగా వస్తోంది. దీని ద్వారా దేశం కోసం అమరులైన జవాన్లను మనం స్మరించుకుంటాం’’అని సైనిక ప్రధాన కార్యాలయంలో ఓ సీనియర్ సైన్యాధికారి చెప్పినట్లు ద టెలిగ్రాఫ్ ఓ కథనాన్ని ప్రచురించింది.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 4
భారత ప్రభుత్వ హ్యాండిల్ ట్వీట్ చేసిన వీడియోను షేర్ చేస్తూ.. విశ్రాంత కల్నల్ అజయ్ శుక్లా ఇలా రాసుకొచ్చారు. ‘‘త్రివిధ దళాలను నరేంద్ర మోదీ ప్రభుత్వం అగౌరవపరుస్తోంది. ముఖ్యంగా కవాతును మితిమీరిన బాలీవుడ్ పాటలతో నింపుతోంది. సైన్యాధిపతుల కళ్లు మూసుకుపోయాయా? ఇప్పటికైనా మీరు కళ్లు తెరవండి’’అని ఆయన వ్యాఖ్యానించారు.
ఇటీవల మోదీ ప్రభుత్వం అమర జవాన్ జ్యోతిని జాతీయ యుద్ధ స్మారకంలో విలీనం చేసింది. ఈ విషయంలో కొందరు ప్రభుత్వానికి మద్దుతు పలకగా.. మరికొందరు విమర్శలు చేశారు.
ఇవి కూడా చదవండి:
- ఇమ్రాన్ ఖాన్‌ను సూటి ప్రశ్న అడిగిన పాకిస్తానీ హౌజ్‌వైఫ్, ప్రధాన మంత్రి ఏం చెప్పారంటే..
- గాంధీని హత్య చేసే సమయానికి నాథూరామ్ గాడ్సే నిజంగానే ఆర్ఎస్ఎస్ను విడిచిపెట్టారా? ఆ రహస్యమేమిటి..
- ఆన్లైన్ గేమ్స్ ఆడి కోటీశ్వరులు కావొచ్చు
- బొబ్బిలి యుద్ధానికి 265 ఏళ్లు: ఆ రోజున ఏం జరిగింది?
- అమ్మాయి పెళ్లికి రూ.71 లక్షలు పొందే మార్గం ఇది
- అయోధ్యలో 251 మీటర్ల ఎత్తైన రాముడి విగ్రహం: 'అయ్యా, మమ్మల్నందరినీ ఇక్కడే పాతిపెట్టి, మా భూమిని తీసుకోండి'
- గ్రీన్ గోల్డ్: ఈ పండ్లను బంగారంలా చూస్తారు.. వీటి కోసం దొంగల ముఠాలు కాపు కాస్తుంటాయి
- అర్చకత్వం చేస్తూనే 9 పీజీలు పూర్తి చేసిన పూజారి
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)












