హరిద్వార్ ధర్మ సంసద్: సుమోటోగా విచారణ జరపాలని కోరుతూ సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తికి 76 మంది లాయర్ల లేఖ - Newsreel

హరిద్వార్

ఫొటో సోర్స్, social media

ఇటీవల దిల్లీ, హరిద్వారలలో జరిగిన రెండు మతపరమైన కార్యక్రమాలలో, "ఒక వర్గంపై హింసను" ప్రేరేపించిన కేసులను సుమోటాగా తీసుకుని విచారించాలని 76 మంది సుప్రీం కోర్టు న్యాయవాదులు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణకు లేఖ రాశారు.

"ఇలాంటి సంఘటనలు ఈ మధ్య కాలంలో సాధారణం అవుతున్నాయి. పోలీసులు సరైన చర్యలు తీసుకోనప్పుడు వీటిని నివారించడానికి చట్టం తక్షణమే జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఉంది" అని ఆ లేఖలో రాశారు.

దుష్యంత్ దవే, ప్రశాంత్ భూషణ్, బ్రందా గ్రోవర్, సల్మాన్ ఖుర్షీద్, పాట్నా హైకోర్టు మాజీ న్యాయమూర్తి అంజనా ప్రకాష్ సహా పలువురు ప్రముఖ న్యాయవాదులు ఈ లేఖపై సంతకం చేశారు.

"ఈ సంఘటనలు, ఆ సందర్భంగా చేసిన ప్రసంగాలు ద్వేషపూరితమే కాక, ఒక వర్గం మొత్తాన్ని చంపేందుకు ఇచ్చిన బహిరంగ ఆహ్వానం. ఇలాంటి ప్రసంగాలు మన దేశ ఐక్యత, సమగ్రతకు భంగం కలిగించడమే కాకుండా లక్షలాది ముస్లిం పౌరుల జీవితాలను ప్రమాదంలోకి నెడతాయి" అని ఆ లేఖలో వివరించారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 1
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 1

డిసెంబర్ 17 నుంచి డిసెంబర్ 19 వరకు ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్‌లో 'ధర్మ సంసద్' నిర్వహించారు.

ఇందులో పాల్గొన్నవారి 'వివాదాస్పద ప్రసంగాల' వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

మతాన్ని రక్షించడానికి ఆయుధాలు చేపట్టాలని, 2029 వరకు ముస్లిం ప్రధానమంత్రి రాకుండా చూడాలని, ముస్లిం జనాభా పెరగనివ్వకూడదని, ముస్లింలకు వ్యతిరేకంగా హిందువులు ఆయుధాలు పట్టాలని.. ఆ ప్రసంగాల్లో పిలుపునిచ్చారు.

ఈ ఘటనలపై ఉత్తరాఖండ్ పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. ఇందులో ఇప్పటివరకు ముగ్గురి పేర్లను చేర్చారు. కానీ, ఒక్కరిని కూడా అరెస్ట్ చేయలేదు.

గ్రే హౌండ్స్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ప్రతీకాత్మక చిత్రం

ఛత్తీస్‌గఢ్‌‌లో ఆరుగురు మావోయిస్టుల మృతి

(ఆలోక్ ప్రకాశ్ పుతుల్, రాయ్‌పూర్ నుంచి)

ఛత్తీస్‌గఢ్ తెలంగాణ సరిహద్దుల్లో రెండు రాష్ట్రాల సంయుక్త ఆపరేషన్‌లో ఆరుగురు మావోయిస్టులు చనిపోయినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ ప్రాంతంలో ఆపరేషన్ ఇంకా కొనసాగుతోందని పోలీసులు చెప్పారు.

మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందనే విషయాన్ని పోలీసులు తోసిపుచ్చలేదు.

"తెలంగాణ గ్రేహౌండ్స్‌తో కలిసి ఛత్తీస్‌గఢ్ జిల్లా రిజర్వ్ పోలీసులు, సీఆర్పీఎఫ్ ప్రత్యేక ఆపరేషన్ నిర్వహించాయి. ఈ సందర్భంగా సోమవారం జరిగిన ఎదురు కాల్పుల్లో మావోయిస్టులు పెద్ద సంఖ్యలో చనిపోవడం, గాయపడడం జరిగింది" అని బస్తర్ రేంజ్ ఐజీ సుందర్ రాజ్ బీబీసీకి చెప్పారు.

ఛత్తీస్‌గఢ్ సుక్మా జిల్లాలోని కిస్తారామ్ ప్రాంతంలో 40 నుంచి 50 మంది మావోయిస్టులు సమావేశమవుతున్నట్లు సమాచారం అందడంతో ఒక రోజు ముందే ఈ ఆపరేషన్ ప్లాన్ చేసినట్లు పోలీసులు చెబుతున్నారు.

ఆ తర్వాత మావోయిస్టులను చుట్టుముట్టడానికి ప్రయత్నం జరిగింది. రెండు రాష్ట్రాల భద్రతా బలగాలు సంయుక్త ఆపరేషన్ ప్రారంభించాయి. తెలంగాణా గ్రేహౌండ్స్ దళానికి, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి.

ఈ ఎన్‌కౌంటర్‌లో ఇప్పటివరకూ భద్రతా బలగాలు ఆరుగురు మావోయిస్టుల మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు.

మావోయిస్టులను ఎదుర్కోడానికి ప్రత్యేకంగా శిక్షణ తీసుకున్న తెలంగాణా గ్రేహౌండ్స్, మహారాష్ట్ర సీ-60 దళాలు గత కొన్నేళ్లుగా పెద్ద సంఖ్యలో ఎన్‌కౌంటర్లలో పాల్గొన్నాయి.

గత నెల గడ్చిరోలి ప్రాంతంలో ఇదే సీ-60 దళం నిర్వహించిన ఆపరేషన్లో మావోయిస్ట్ సెంట్రల్ కమిటీ సభ్యుడు మిలింద్ తెల్తుంబ్డే సహా 26 మంది మృతిచెందారు.

సల్మాన్ ఖాన్ Salman Khan

ఫొటో సోర్స్, HINDUSTAN TIMES / AFP

పామును కర్రతో బయటకు తీసుకెళ్తుంటే, మూడు సార్లు కాటేసింది-సల్మాన్ ఖాన్

శనివారం రాత్రి సల్మాన్ ఖాన్‌ను ఒక పాము కాటు వేసింది. ఆస్పత్రిలో కోలుకున్న ఆయన తనను పాము ఎలా కాటేసిందో చెప్పారని ఏఎన్ఐ ట్వీట్ చేసింది.

"నా ఫాంహౌస్‌లోకి ఒక పాము వచ్చింది. నేను ఒక కర్రతో దాన్ని బయట వదిలేద్దామని తీసుకెళ్లా. అది మెల్లగా నా చేతిపైకి వచ్చేయడంతో, దాన్ని పట్టుకుని విడిపించడానికి ప్రయత్నించా. అప్పుడే అది నన్ను మూడుసార్లు కాటేసింది. అది ఒక రకమైన విషపూరిత పాము. నాకు 6 గంటలు ఆస్పత్రిలో చికిత్స అందించారు. ప్రస్తుతం ఆరోగ్యంగా ఉన్నాను" అని సల్మాన్ చెప్పారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 2
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 2

బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్‌ శనివారం రాత్రి తన పన్‌వెల్ ఫామ్ హౌస్‌లో ఉన్నప్పుడు ఈ ఘటన జరిగింది.

పాము కరవడంతో ఆయన్ను శనివారం రాత్రి 3.30 సమయంలో నవీ ముంబయిలో ఉన్న ఎంజీఎం ఆస్పత్రిలో చేర్పించారు.

అక్కడ ఆయనకు ప్రాథమిక చికిత్స తర్వాత కొన్ని గంటలకే డిశ్చార్జ్ చేశారు.

డిసెంబర్ 27న సల్మాన్ ఖాన్ పుట్టినరోజు. ఆయన ఎక్కువగా పన్‌వెల్‌ పాంహౌస్‌లోనే తన పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటుంటారు.

వీడియో క్యాప్షన్, సల్మాన్ ఖాన్: పామును కర్రతో బయటకు తీసుకెళ్తుంటే, మూడు సార్లు కాటేసింది
వీడియో క్యాప్షన్, అరిచే పాము వెనుక అసలు కథ

ఇవి కూడా చదవండి:

బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.