రెండు తలల పామును చూశారా?

వీడియో క్యాప్షన్, రెండు తలల పామును చూశారా

రెండు తలల పాములను మీరెప్పుడైనా చూశారా? అసలు అలాంటివి నిజంగా ఉంటాయా అనే అనుమానం రావొచ్చు.

కానీ, ఈ వీడియో చూస్తే రెండు తలల పాములుంటాయని నమ్మాల్సిందే. అమెరికాలోని వర్జీనియా రాష్ట్రంలోని ఒక గార్డెన్‌లో ఈ రెండు తలల పామును గుర్తించారు.

ఈ పాము దూకుడుగా కనిపించనప్పటికీ రెండు తలలతో తనపైకి వచ్చే శత్రువులపై దాడి చేయగలదు. వాస్తవానికి రెండు తలలున్న ఏ జంతువైనా అడవుల్లో జీవించడం చాలా కష్టం. త్వరలో దీన్ని వన్యప్రాణి సంరక్షణ కేంద్రానికి తరలించే అవకాశాలున్నాయి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)