పశ్చిమ గోదావరి: జల్లేరు వాగులోకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు.. 9 మంది ప్రయాణికుల మృతి - BBC Newsreel

పశ్చిమ గోదావరి జిల్లాలో ఆర్టీసీ బస్సు ప్రమాదవశాత్తు జల్లేరు వాగులోకి దూసుకెళ్లింది. జంగారెడ్డిగూడెం సమీపంలో జరిగిన ఈ ప్రమాదంలో కనీసం ఆరుగురు మరణించినట్టు స్థానిక పోలీసులు ధృవీకరించారు.
వేలేరుపాడు నుంచి జంగారెడ్డిగూడెం వస్తున్న ఏపీఎస్ ఆర్టీసీ బస్సు ఈ ప్రమాదానికి గురయ్యింది. బస్సు ప్రమాదానికి గురయిన సమయంలో 47 మంది ప్రయాణికులున్నట్టు ఆర్టీసీ అధికారులు ప్రకటించారు.
ఘటన జరిగిన వెంటనే స్థానికులు కొందరిని రక్షించారు.
వాగు దాటుతున్న సమయంలో బస్సు అదుపు తప్పిందని ఆర్టీసీ అధికారులు ప్రాధమికంగా అంచనా వేస్తున్నారు. ప్రమాదంలో గాయపడిన వారిలో కొందరిని జంగారెడ్డి గూడెం ఆస్పత్రికి తరలించారు. బస్సు కింద చిక్కుకుపోయిన వారి గురించి సహాయక చర్యలు సాగుతున్నాయి.

జల్లేరు వాగులో బస్సు బోల్తా ఘటనలో 9మందికి పైగా ప్రయాణికులు ప్రాణాలు కోల్పోడం బాధాకరమని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు.
ప్రతిపక్ష నాయకుడు నారా చంద్రబాబు నాయుడు, టీడీపీ నాయకుడు నారా లోకేశ్, బీజేపీ నాయకుడు యస్.విష్ణువర్ధన్ రెడ్డి తదితరులు మృతుల కుటుంబాలకు సంతాపం ప్రకటించారు.
మృతులు ఒక్కొక్కరికీ రూ.25 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించి, బాధిత కుటుంబాలకు అందించాలని నారా లోకేశ్ డిమాండ్ చేశారు. రాష్ట్రంలో అధ్వాన్న రోడ్ల వల్లనే ప్రమాదం జరిగిందని ఆయన ఆరోపించారు.

ఫొటో సోర్స్, @ShivAroor
గ్రూప్ కెప్టెన్ వరుణ్ సింగ్ కన్నుమూత.. హెలీకాప్టర్ ప్రమాదంలో 14కు పెరిగిన మృతుల సంఖ్య
బిపిన్ రావత్ హెలీకాప్టర్ ప్రమాదంలో ప్రాణాలతో బయటపడిన గ్రూప్ కెప్టెన్ వరుణ్ సింగ్ బుధవారం తుదిశ్వాస విడిచారు.
ఈ విషయాన్ని భారత వైమానిక దళం (ఐఏఎఫ్) వెల్లడించింది.
డిసెంబర్ 8న జరిగిన హెలీకాప్టర్ ప్రమాదంలో తీవ్ర గాయాల పాలైన వరుణ్ సింగ్, ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈరోజు ఉదయం మరణించారని ఏఐఎఫ్ ట్వీట్ చేసింది.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 1
ఆయన మృతి పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేసిన ఐఏఎఫ్, ఆయన కుటుంబానికి ప్రగాఢ సంతాపాన్ని తెలియజేసింది.
ఆయన మృతి పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేసిన ఐఏఎఫ్, ఆయన కుటుంబానికి ప్రగాఢ సంతాపాన్ని తెలియజేసింది.
ప్రధాని నరేంద్ర మోదీ, ట్విట్టర్ వేదికగా నివాళులు అర్పించారు. ''గ్రూప్ కెప్టెన్ వరుణ్ సింగ్ దేశానికి నిర్భయంగా, గర్వంగా, అత్యంత వృత్తి విలువలతో సేవలందించారు. ఆయన వెళ్లిపోవడం చాలా బాధగా ఉంది. దేశం కోసం ఆయన చేసిన సేవలు మరువలేనివి. ఆయన మిత్రులకు, కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి. ఓం శాంతి'' అని ఆయన ట్వీట్ చేశారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 2
వెల్లింగ్టన్‌లోని డిఫెన్స్ సర్వీసెస్ స్టాఫ్ కాలేజ్ (డీఎస్‌ఎస్‌సీ)కి గ్రూప్ కెప్టెన్ వరుణ్ సింగ్ డైరెక్టింగ్ స్టాఫ్‌గా పనిచేశారు. ఆయన డిసెంబర్ 8న, జనరల్ రావత్‌ను తీసుకురావడానికి సూలూర్ వెళ్లారు.
తిరుగు ప్రయాణంలో, 14 మందితో ప్రయాణిస్తోన్న ఎయిర్‌ఫోర్స్ హెలీకాప్టర్ ఎంఐ-17వీ5 కూలిపోవడంతో ఘటనా స్థలంలోనే భారత తొలి సీడీఎస్ బిపిన్ రావత్, ఆయన భార్య మధులిక రావత్ సహా మొత్తం 13 మంది కన్నుమూశారు.
ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన గ్రూప్ కెప్టెన్ వరుణ్ సింగ్‌కు తొలుత వెల్లింగ్టన్‌లోని మిలటరీ ఆసుపత్రిలో చికిత్స అందించారు.
పరిస్థితి విషమంగానే ఉండటంతో ఆయనను డిసెంబర్ 10న బెంగళూరులోని కమాండ్ ఆసుపత్రికి తరలించారు.

ఫొటో సోర్స్, Getty Images
ఆయన ఈఏడాది ఆగస్టు నెలలోనే భారతదేశ మూడో అత్యున్నత శౌర్య పురస్కారం 'శౌర్య చక్ర'ను అందుకున్నారు.
గతేడాది అక్టోబర్‌లో వింగ్ కమాండర్‌గా ఆయన చూపిన ధైర్యసాహసాలకు గుర్తుగా ఈ పురస్కారం దక్కింది.
అక్టోబర్ 12న, ప్రయోగాల్లో భాగంగా తేలికైన యుద్ధ విమానం తేజస్‌ను నడిపారు. అది చాలా ఎత్తుకు వెళ్లిన తర్వాత కాక్‌పిట్‌లో ఒక మెషీన్ విఫలం కావడంతో అత్యవసర పరిస్థితి తలెత్తింది. ఆ సమయంలో ఎంతో తెగువను ప్రదర్శించిన వరుణ్ సింగ్, దాన్ని సురక్షితంగా ల్యాండ్ చేశారు.
ఇవి కూడా చదవండి:
- మిస్ యూనివర్స్‌గా భారత యువతి హర్నాజ్
- ప్రధాని మోదీ ప్రారంభించనున్న కాశీ విశ్వనాథ్ కారిడార్ ప్రత్యేకతలేంటి
- భారత్‌కు తాలిబాన్ల ప్రశంసలు, మరింత సాయం కావాలని వినతి
- ఒమిక్రాన్: ‘బూస్టర్ డోస్’పై ఐసీఎంఆర్ నిపుణులు ఏమన్నారంటే..
- చెడ్డీ గ్యాంగ్: గుజరాత్ నుంచి వచ్చారు.. పగలు రెక్కీ, అర్థరాత్రి దోపిడీ
- మధులిక రావత్: సైనిక ఉద్యోగుల భార్యల సంక్షేమ సంఘం మాజీ అధ్యక్షురాలు
- ‘నా కళ్లతో నేను ఒక్క వ్యక్తినే చూశా.. ఆయన కాలిపోతున్నారు’ - బిపిన్ రావత్ హెలీకాప్టర్ ప్రమాదం ప్రత్యక్ష సాక్షి
- బీబీసీ 100 మంది మహిళలు 2021 - మంజులా ప్రదీప్: దళిత మహిళల హక్కుల కోసం పోరాడుతున్న ఉద్యమకారిణి
- 12ఏళ్ల మిస్టరీ వీడినట్లేనా? బిట్ కాయిన్‌ను కనిపెట్టిన సతోషీ నకమోటో ఈయనేనా?
- అనకాపల్లి బెల్లం మార్కెట్లో వ్యాపారం ఎందుకు తగ్గుతోంది?
- తిరుపతి: 2015లో కుండపోత వర్షాలు పడినా రాని వరదలు ఇప్పుడెందుకొచ్చాయి?
- పల్నాడు: ఈ పేరు ఎలా వచ్చింది, పల్నాడు ఉత్సవాల వెనుక కథ ఏంటి?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








