వివాదంలో కమెడియన్ వీర్ దాస్: ‘భారత్‌లో మహిళలను పగలు పూజిస్తారు... రాత్రివేళల్లో వారిపై సామూహిక అత్యాచారాలు చేస్తారు’

ఫొటో సోర్స్, Getty Images
హాస్య నటుడు వీర్ దాస్ చేసిన ఏకపాత్రాభినయం ప్రదర్శన దేశంలోని కొంతమందికి ఆగ్రహం తెప్పించింది. పోలీసులకు కొందరు ఫిర్యాదు చేశారు. తోటి నటులు కూడా ఆయనను విమర్శిస్తున్నారు.
అమెరికాలో ఒక కార్యక్రమం సందర్భంగా భారత కమెడియన్ వీర్ దాస్ భారతదేశం రెండు కోణాలను ఆవిష్కరించేలా ఏకపాత్రాభినయం చేశారు.
"భారత్‌లో మహిళలను పగలు పూజిస్తారు, రాత్రివేళల్లో వారిపై సామూహిక అత్యాచారాలు చేస్తారు" అంటూ తన నటన ద్వారా చూపించారు.
దీనిపై తీవ్ర విమర్శలు రావడంతో ఆయన స్పందించారు.
''ఇది రెండు వేర్వేరు భారతదేశాల గురించి ఒక వ్యంగ్య నాటిక'' అని చెప్పుకొచ్చారు.
మరికొందరు ఈ ప్రదర్శనకు మద్దతు తెలిపారు. వీర్ దాస్ ప్రదర్శనకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది.
ప్రపంచ పర్యటనలో భాగంగా నవంబర్ 12న వాషింగ్టన్ డీసీలో వీర్ దాస్ ఈ ప్రదర్శన ఇచ్చారు.
వీర్ దాస్ ప్రదర్శనకు సంబంధించిన 7 నిమిషాల వీడియోను ఆన్‌లైన్‌లో పెట్టగానే వైరల్‌గా మారింది.
''నేను భారత్ నుంచి వచ్చాను. అక్కడ గాలి నాణ్యత సూచి 9000 ఉంటుంది. కానీ మేం ఇంటి డాబాపైనే పడుకుంటాం. నక్షత్రాలను చూస్తాం'' అని నాటికలో వీర్ దాస్ చెప్పారు.
''శాఖాహారిగా ఉండటం గర్వంగా భావించే భారత్ నుంచి నేను వచ్చాను. కానీ కూరగాయలు పండించే రైతుల మీద నుంచే విచక్షణా రహితంగా వాహనాలు నడుపుతుంటాం'' అని వ్యాఖ్యానించారు.
నిరసన కార్యక్రమాలు చేపట్టిన రైతులపై నుంచి కేంద్ర మంత్రి కుమారుడికి చెందిన ఒక వాహనం వెళ్లడంతో రైతులు సహా ఎనిమిది మంది మరణించారు.
''భారతదేశం, మహిళలకు వ్యతిరేకంగా, వారిని కించపరిచే విధంగా వీర్ దాస్ వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు'' బీజేపీ దిల్లీ అధికార ప్రతినిధి తెలిపారు.
''ఆయన అమెరికా వెళ్లి ఈ తరహా వ్యాఖ్యలు చేశారు. అంతర్జాతీయ స్థాయిలో దేశం ప్రతిష్టను దిగజార్చారు. దీనిపై పోలీసులు విచారణ జరపాలని నేను కోరుకుంటున్నాను'' అని ఆదిత్య ఝా అన్నారు.
దాస్ చర్యలను ''సాఫ్ట్ టెర్రరిజం'' అని నటి కంగనారనౌత్ తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో రాసుకొచ్చారు. ఇలాంటి నేరస్థులపై కఠినమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
అయితే పలువురు ప్రతిపక్ష నేతలు వీర్ దాస్‌కు అండగా నిలిచారు.
''లక్షలాది మంది ప్రజల తరఫున దాస్ అలా మాట్లాడారు'' అంటూ కాంగ్రెస్ పార్టీ సభ్యుడు శశి థరూర్ ట్వీట్ చేశారు. 'స్టాండప్' అనే పదానికి అసలైన అర్థం తెలిపిన స్టాండప్ కమెడియన్ వీర్ దాస్ అని ప్రశంసించారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
యూఎస్‌లో తన ప్రదర్శనను వీర్ దాస్ సమర్థించుకున్నారు.
''విభిన్న పనులను చేసే, రెండు విభిన్న భారతదేశాలకు సంబంధించిన నాటికను తాను ప్రదర్శించానని'' వీర్ దాస్ పేర్కొన్నారు.
''ప్రతీ దేశానికి మంచి చెడులు, చీకటి, వెలుగు ఉంటాయి. ఇదేం రహస్యం కాదు. నాటిక వల్ల మనమంతా ప్రేమించే, గర్వించే, విశ్వసించే భారతదేశానికి అమెరికా వేదికపై భారీ చప్పట్లు లభించాయి. దయచేసి ఎడిట్ చేసిన కాపీలను చూసి మోసపోకండి'' అంటూ వీర్ దాస్ చెప్పుకొచ్చారు.
ఇటీవలి కాలంలో మరో కమెడియన్ మునావర్ ఫరూఖీ కూడా ఇలాంటి కేసునే ఎదుర్కొన్నారు. హిందు దేవుళ్లపై అసభ్యకర వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ ఆయనకు నెలకు పైగా జైలు శిక్ష విధించారు.
హిందూ మితవాద గ్రూపుల నుంచి బెదిరింపుల కారణంగా అప్పటి నుంచి ఆయన అనేక కార్యక్రమాలను రద్దు చేసుకున్నారు.
ఇవి కూడా చదవండి:
- భారతదేశం బొగ్గు వినియోగాన్ని ఆపేస్తే ఏం జరుగుతుంది?
- బిడ్డ నల్లగా పుట్టింది.. డీఎన్ఏ పరీక్ష చేసి ఈ జంట తెలుసుకున్న ‘భయానక’ నిజం ఏంటంటే..
- శిథిలమైన ఇంటిలో నిద్రిస్తోన్న చిన్నారి ఫొటోకు మొదటి బహుమతి
- టీ20 వరల్డ్ కప్: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా
- జిమ్మీ నీషామ్: ఒకప్పుడు క్రికెట్‌కు గుడ్‌బై చెప్పాలనుకున్నాడు కానీ, ఇప్పుడు న్యూజీలాండ్‌కు విజయాన్ని తెచ్చిపెట్టాడు
- జిన్నా టవర్ సెంటర్: పాకిస్తాన్ జాతిపిత పేరుతో గుంటూరులో స్తూపం ఎందుకుంది?
- కంగనా రనౌత్: ‘1947లో లభించింది స్వాతంత్ర్యం కాదు, భిక్ష.. మనకు స్వాతంత్ర్యం 2014లో వచ్చింది’
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








