IND vs NAM: టీ20 ప్రపంచకప్ నుంచి విజయంతో వైదొలిగిన భారత్.. నమీబియాపై 9 వికెట్ల తేడాతో గెలుపు

ఫొటో సోర్స్, Getty Images
ఐసీసీ టీ20 ప్రపంచకప్‌లో భాగంగా నమీబియాతో జరిగిన మ్యాచ్‌లో భారత ఓపెనర్లు రోహిత్ శర్మ (37 బంతుల్లో 56; 7 ఫోర్లు, 2 సిక్సర్లు), కేఎల్ రాహుల్ (36 బంతుల్లో 54 నాటౌట్; 4 ఫోర్లు, 2 సిక్సర్లు) అర్ధసెంచరీలతో చెలరేగారు.
దీంతో దుబాయ్ వేదికగా సోమవారం జరిగిన మ్యాచ్‌లో భారత్ 9 వికెట్ల తేడాతో విజయం సాధించింది.
వీరిద్దరికి తోడు వన్‌డౌన్ బ్యాట్స్‌మన్‌గా వచ్చిన సూర్యకుమార్ యాదవ్ (19 బంతుల్లో 25 నాటౌట్; 4 ఫోర్లు) రాణించడంతో భారత్ 15.2 ఓవర్లలో వికెట్ నష్టానికి 136 పరుగులు చేసి గెలుపొందింది.
16 పరుగులు ఇచ్చి మూడు వికెట్లు తీసిన రవీంద్ర జడేజాకు 'ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్' పురస్కారం లభించింది.
భారతదేశంలో జరగాల్సిన ఈ టీ20 ప్రపంచకప్ వేదిక కరోనా కారణంగా దుబయ్‌కు మారింది.
గ్రూప్ దశలో మొత్తం 5 మ్యాచ్‌లు ఆడిన భారత్.. పాకిస్తాన్, న్యూజిలాండ్‌లపై ఓడిపోయింది. తర్వాత అఫ్గానిస్తాన్, స్కాట్లాండ్, నమీబియాలపై గెలుపొందింది. మొత్తం 6 పాయింట్లు సాధించి గ్రూప్ 2లో మూడో స్థానంలో నిలిచింది.
ఈ మ్యాచ్‌తో టీ20 ప్రపంచకప్‌లో సూపర్ 12 దశ ముగిసింది. బుధవారం జరిగే మొదటి సెమీ ఫైనల్ మ్యాచ్‌లో ఇంగ్లండ్, న్యూజీలాండ్ జట్లు, గురువారం జరిగే రెండవ సెమీఫైనల్ మ్యాచ్‌లో పాకిస్తాన్, ఆస్ట్రేలియా జట్లు తలపడనున్నాయి.
మొదట రోహిత్... తర్వాత రాహుల్
133 పరుగుల లక్ష్యఛేదనకు బరిలోకి దిగిన భారత్‌కు ఓపెనర్లు శుభారంభం అందించారు.
మ్యాచ్ ఆరంభం నుంచే రోహిత్ జోరు సాగింది. తొలి ఓవర్‌లో ఓ బౌండరీ బాదిన అతను, రెండో ఓవర్‌లో 4, 6 కొట్టాడు.
మరోవైపు వీస్ బౌలింగ్‌లో రాహుల్ కూడా ఓ సిక్సర్‌తో అలరించాడు.
ఐదో ఓవర్‌లో బెర్నార్డ్ వేసిన రెండో బంతిని బౌండరీకి తరలించిన రోహిత్, నాలుగో బంతిని సిక్సర్‌గా మలిచాడు. దీంతో పవర్‌ప్లేలో భారత్ 54 పరుగులు చేసింది.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 1
తర్వాత కూడా ఓవర్‌కో ఫోర్ చొప్పున బాదిన రోహిత్ శర్మ 31 బంతుల్లోనే 50 పరుగుల మార్కును అందుకున్నాడు. దీంతో టీ20 ఫార్మాట్‌లో రోహిత్ ఖాతాలో 24 అర్ధసెంచరీలు చేరాయి. మరోవైపు ఇదే మ్యాచ్‌లో రోహిత్ టీ20ల్లో 3000 పరుగుల మైలురాయిని చేరుకున్నాడు.
పదో ఓవర్ ఐదో బంతికి జాన్ ఫ్రైలింక్ బౌలింగ్‌లో గ్రీన్‌కు క్యాచ్ ఇచ్చి రోహిత్ శర్మ అవుటయ్యాడు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 2
దీంతో తొలి వికెట్‌కు 86 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది.
సూర్యకుమార్ యాదవ్ అండగా రాహుల్ ఇన్నింగ్స్ నడిపించాడు. వీరిద్దరూ ఓవర్‌కు కనీసం ఒక ఫోర్ ఉండేలా చూసుకున్నారు.
ఇదే క్రమంలో 35 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్ల సహాయంతో రాహుల్ అర్ధసెంచరీని అందుకున్నాడు. అప్పటికి జట్టు స్కోరు 130/1.
ఆ తర్వాత మరో బౌండరీతో రాహుల్ మ్యాచ్‌ను ముగించాడు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 3
నమీబియా బ్యాటింగ్
టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన నమీబియా చెప్పుకోదగ్గ స్కోరు సాధించింది.
చివర్లో డేవిడ్ వీస్ (25 బంతుల్లో 26; 2 ఫోర్లు) రాణించడంతో నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 132 పరుగులు చేసింది.
ఓపెనర్ స్టీఫెన్ బార్డ్ (21 బంతుల్లో 21; 1 ఫోర్, 1 సిక్స్) రాణించాడు. మరో ఓపెనర్ మైఖేల్ వాన్ లిన్‌జెన్ (15 బంతుల్లో 14; 2 ఫోర్లు) కలిసి తొలి వికెట్‌కు 33 పరుగులు జోడించారు.
ఐదో ఓవర్ నాలుగో బంతికి బుమ్రా బౌలింగ్‌లో షమీకి క్యాచ్ ఇచ్చి మైఖేల్ అవుట్ కావడంతో నమీబియా వికెట్ల పతనం ప్రారంభమైంది.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 4
తర్వాతి ఓవర్లోనే క్రెగ్ విలియమ్స్ (0) డకౌట్ అయ్యాడు. దీంతో పవర్ ప్లేలో నమీబియా స్కోరు 34/2.
ఆ తర్వాత కూడా వికెట్ల పతనం కొనసాగింది. 10 ఓవర్లు ముగిసేసరికి నమీబియా 4 వికెట్లు కోల్పోయి 51 పరుగులు చేసింది.
చాహర్ వేసిన ఇన్నింగ్స్ 11వ ఓవర్‌లో గెర్హార్డ్ ఎరాస్మస్, వీస్ చెరో బౌండరీ బాదడంతో 11 పరుగులు లభించాయి.
13వ ఓవర్ మూడో బంతికి అశ్విన్ వైడ్ వేయడంతో పాటు, పంత్ బంతిని ఆపలేకపోవడంతో నమీబియాకు 5 పరుగులు లభించాయి. అయితే మరుసటి బంతికే ఎరాస్మస్ (12)ను అశ్విన్ అవుట్ చేశాడు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 5
ఆ తర్వాతి ఓవర్లో కూడా నో బాల్ కారణంగా నమీబియాకు మరో 5 పరుగులు లభించాయి. రాహుల్ చాహర్ వేసిన ఈ ఓవర్ చివరి బంతికి స్మిట్ ఫోర్ కొట్టడంతో మొత్తం 13 పరుగులు వచ్చాయి.
15వ ఓవర్ చివరి బంతికి స్మిట్ (9) అవుట్ కాగా జట్టు స్కోరు 93/6.
ఆ తర్వాత కూడా భారత ఫీల్డింగ్ తప్పిదాలతో నమీబియా ఖాతాలో పరుగులు చేరాయి.
ఈ మ్యాచ్‌లో భారత్ ఎక్స్‌ట్రాల రూపంలో ఏకంగా 17 పరుగులు సమర్పించుకోవడం విశేషం.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 6
ఇన్నింగ్స్ చివరి ఓవర్ షమీ బౌలింగ్‌లో రూబెన్ వరుసగా 6, 4 బాదడంతో 13 పరుగులు వచ్చాయి. దీంతో నమీబియా భారత్‌కు 133 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించగలిగింది.
భారత బౌలర్లలో రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్ చెరో 3 వికెట్లు పడగొట్టగా, జస్‌ప్రీత్ బుమ్రా 2 వికెట్లు తీశాడు.
ఇవి కూడా చదవండి:
- భూమిపైనే నరకాన్ని చూస్తున్న అఫ్గాన్లు.. ‘గుప్పెడు రొట్టెల పిండి కూడా దొరకట్లేదు’
- చరిత్ర: హానీమూన్ ఎప్పుడు, ఎందుకు మొదలైంది? దానికి ఆ పేరు ఎలా వచ్చింది?
- ఉత్తర కొరియాలో రహస్య ప్రాంతానికి వెళ్లిన అమెరికా యువకుడు.. ఆ తర్వాత ఏమైంది..
- ‘డుగ్ డుగ్' బుల్లెట్ బండిపై సినిమా, ఇంతకూ రాయల్ ఎన్ఫీల్డ్కు గుడి ఎందుకు కట్టారు
- నేను పదేళ్ల నుంచి ఒరిజినల్ మెటావర్స్ సెకండ్ లైఫ్‌లో జీవిస్తున్నా.. ఇక్కడ ఏం జరుగుతోందంటే..
- చెన్నై వరదలు: భారీ వర్షాలకు జలమయమైన నగరం
- పీవీ సింధు: పద్మభూషణ్ అవార్డు అందుకున్న బ్యాడ్మింటన్ క్రీడాకారిణి
- టీ20 వరల్డ్ కప్: 2007లోనే చాంపియన్‌గా నిలిచిన భారత్ 2021లో ఎందుకు చతికిలపడింది
- ప్రజలంతా ఆయుధాలు పట్టాలని కోరుతున్న దేశం, కారణమేంటి
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)