కేటీఆర్- విజయసాయి రెడ్డి: పంట పొలాల్లో వ్యాక్సినేషన్‌కు సంబంధించి ఒకే ఫొటో ట్వీట్ చేసిన ఇద్దరు నాయకులు, అసలు ఈ ఫొటో ఏ రాష్ట్రానిది?

ఫొటో సోర్స్, UGC
- రచయిత, బళ్ల సతీశ్
- హోదా, బీబీసీ ప్రతినిధి
తెలంగాణలో వ్యాక్సినేషన్ చురుగ్గా సాగుతోందని చెప్పడానికి మంత్రి కేటీఆర్ ఉపయోగించిన ఫొటో సోషల్ మీడియాలో ట్రోల్ అవుతోంది.
'రెండు ఫొటోలు. ఒకటి ఖమ్మం జిల్లాలోది. మరొకటి రాజన్న సిరిసిల్లా జిల్లాలోది. కానీ ఈ రెండు ఫొటోల్లో హెల్త్ కేర్ వర్కర్ల కమిట్‌మెంట్ కనిపిస్తోంది' అంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు. హెల్త్‌కేర్ వర్కర్లకు ఆయన అభినందనలు తెలిపారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 1
కేటీఆర్ ట్వీట్ చేసిన ఫొటోల్లో పొలంలో పని చేస్తున్న వారిని ఆ పొలంలోనే నిలబెట్టి హెల్త్‌కేర్ సిబ్బంది వ్యాక్సీన్ వేస్తోన్న దృశ్యం కనిపిస్తోంది.
అయితే, కేటీఆర్ ట్వీట్‌ను కొందరు ట్రోల్ చేస్తున్నారు. ఎందుకంటే మూడు రోజుల క్రితం ఇదే ఫొటోను వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి కూడా ట్విటర్‌లో పోస్ట్ చేశారు.
ఆంధ్రప్రదేశ్‌లో వ్యాక్సినేషన్ చురుగ్గా సాగుతోందనడానికి నిదర్శనమంటూ ఆయన కూడా ఇదే ఫొటోను ఉపయోగించారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 2
"రాష్ట్రం(ఆంధ్రప్రదేశ్)లో కోవిడ్ పరిస్థితులు, వ్యాక్సినేషన్‌పై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ ఉద్యోగులందరిలో స్ఫూర్తి నింపుతున్నారు. వైద్యారోగ్య సిబ్బంది అంకితభావంతో విధులు నిర్వహిస్తున్నారు. దీంతో రాష్ట్రంలో వ్యాక్సినేషన్ ఉద్యమంలా సాగుతోంది" అంటూ విజయసాయి రెడ్డి ట్వీట్ చేశారు.
విజయసాయి ట్వీట్ చేసిన మూడు రోజుల తరువాత ఇప్పుడు కేటీఆర్ అదే ఫొటోను ట్విటర్‌లో పోస్ట్ చేశారు.
కేటీఆర్ ఒక్కరే కాదు ఒక తెలుగు దిన పత్రిక తన జిల్లా ఎడిషన్‌లో కూడా ఈ ఫోటో ప్రచురించింది. ఇది నారాయణపేట జిల్లా ఉట్కూరు మండలంలో జరిగినట్టు ఆ పత్రిక రాసింది.
కానీ, తెలుగు దిన పత్రిక చెప్పినట్లు ఆ ఫొటో తమ జిల్లాకు చెందినది కాదని నారాయణ పేట జిల్లా వైద్యాధికారి రామ్మోహన రావు బీబీసీకి చెప్పారు.

ఫొటో సోర్స్, Twitter
ఈలోపు ఈ వాక్సినేషన్ ఫొటోలపై సోషల్ మీడియా యూజర్లలో గందరగోళం మొదలైంది.
విజయసాయిరెడ్డి, కేటీఆర్ ఇద్దరూ ఒకే ఫొటోను ట్వీట్ చేయడం గురించి చాలా మంది ప్రశ్నించారు.
కొందరు ఇది ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన వ్యాక్సినేషన్ అంటూ కూడా ట్వీట్ చేశారు.
బీబీసీ పరిశీలనలో కూడా ఈ ఫొటో ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన వ్యాక్సినేషన్‌కు సంబంధించినదే అని తెలిసింది. ఈ విషయాన్ని విజయనగరం డీఎంహెచ్ఓ డాక్టర్ ఎస్‌వీ రమణకుమారి బీబీసీకి ధృవీకరించారు.
ఆ ఫొటోలో ఉన్నది తమ బృందమేనని ఆమె బీబీసీతో చెప్పారు. దీనిని విజయనగరం జిల్లా మెంటాడ మండలంలో తీసిన ఫొటోగా తేల్చారు.
ఇక తను ట్వీట్ చేసిన దానిలో మొదటి ఫోటో (ట్వీట్‌లో ఎడమ వైపు) ఖమ్మం జిల్లాకు చెందినదని కేటీఆర్ చెప్పారు.
అదే ఫొటోను నల్లగొండ జిల్లాలో జరిగిన వ్యాక్సినేషన్‌కు సంబంధించింది అంటూ మరో తెలుగు పత్రిక రాసింది. అయితే, ఆ ఫొటో ఖమ్మం, నల్లగొండ రెండు జిల్లాలకు సంబంధించినది కాదని తేలింది.
ఆ విషయాన్ని ఖమ్మం డీఎంహెచ్ఓ, నల్గొండ డీఎంహెచ్ఓ బీబీసీకి ధృవీకరించారు.
మరోవైపు, రెండు పత్రికల్లో వచ్చిన వార్తల ఆధారంగానే తాను ఆ ట్వీట్ చేసినట్లు మంత్రి కేటీఆర్ వివరణ ఇచ్చారు.
తెలంగాణ హెల్త్‌కేర్ వర్కర్లు అద్భుతంగా పని చేస్తున్నారని, వారిని అభినందిద్దామని ఆయన అన్నారు.

ఫొటో సోర్స్, Twitter/ktr
ఇవి కూడా చదవండి:
- మొగిలయ్య పాడిన భీమ్లా నాయక్ టైటిల్ సాంగ్ అసలు పాట ఏంటి? కిన్నెర చరిత్ర ఏంటి?
- హైదరాబాద్ మెట్రోను అమ్మేస్తారా, నష్టాలకు కారణాలేంటి?
- హెరాయిన్ కేసు: నిందితుడు సుధాకర్ ఎవరు, ఆయన వెనుక ఎవరున్నారు?
- మంగమ్మ హోటల్ కరెంట్ బిల్ రూ. 21 కోట్లు
- అఫ్గానిస్తాన్: ఆకలి తీర్చుకోవడానికి అన్నీ అమ్మేస్తున్నారు
- భారత్‌లో గత 70 ఏళ్లలో ఏ మతస్థుల జనాభా ఎంత పెరిగింది?
- పోర్న్ చూడడం, షేర్ చేయడం నేరమా... చైల్డ్ పోర్న్ ఫోన్లో ఉంటే ఎలాంటి శిక్షలు విధిస్తారు?
- కోవిషీల్డ్ టీకాను గుర్తించిన బ్రిటన్, భారతీయులు ఇకపై క్వారంటైన్లో ఉండాల్సిన అవసరం లేదా?
- నాగ చైతన్యతో విడాకుల రూమర్స్‌పై మీడియా ప్రశ్న.. ‘గుడికి వచ్చి.. బుద్ధుందా?’ అన్న సమంత
- Pak Vs NZ: పాకిస్తాన్ పర్యటన రద్దు చేసుకోవాలంటూ న్యూజీలాండ్‌కు నిఘా సమాచారం ఇచ్చిందెవరు
- AUKUS ఒప్పందం ఏంటి? అమెరికా, ఆస్ట్రేలియాపై ఫ్రాన్స్ ఆగ్రహం ఎందుకు? చైనా ఎందుకు భయపడుతోంది?
- సమంత అక్కినేని: నన్ను భయపెట్టే పాత్రలనే చేస్తా
- బ్రసెల్స్: కొత్తగా నిర్మిస్తున్న వీధికి ఒక సెక్స్ వర్కర్ పేరు.. ఎందుకంటే..
- సీతాఫలంపై చైనా, తైవాన్ మధ్య వివాదం ఎందుకు?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)









