పంజాబ్ కొత్త ముఖ్యమంత్రిగా చరణ్‌జిత్ సింగ్ చన్నీ

ఫొటో సోర్స్, Getty Images
పంజాబ్ కొత్త ముఖ్యమంత్రిగా చరణ్‌జిత్ సింగ్ చన్నీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు ఆ రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జ్ హరీశ్ రావత్ పేర్కొన్నారని ఏఎన్ఐ తెలిపింది.
దళిత సిక్కు కమ్యూనిటీకి చెందిన చరణ్‌జిత్ సింగ్ చన్నీ, అమరీందర్ సింగ్ ప్రభుత్వం లో సాంకేతిక విద్యాశాఖ మంత్రిగా పని చేశారు.
పంజాబ్ కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టి నేతగా ఏకగ్రీవంగా ఎన్నికై ముఖ్యమంత్రి కాబోతున్న చరణ్‌జిత్ సింగ్ చన్నీకి మాజీ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ శుభాకాంక్షలు తెలిపారు. సరిహద్దు రాష్ట్రం భద్రత విషయంలో ఆయన జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించారు.
చరణ్‌జిత్ సింగ్ ముఖ్యమంత్రి కాబోతున్నారనే వార్త తెలియగానే ఆయన అభిమానులు చండీగఢ్‌లోని గవర్నర్ నివాసం ముందు సంబరాలు చేసుకున్నారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 1
అంతకు ముందు కెప్టెన్ అమరీందర్ సింగ్ రాజీనామాతో ఖాళీ అయిన సీఎం పీఠం మీద ఎవరిని కూర్చోబెట్టాలన్నదానిపై కాంగ్రెస్ అధిష్టానం ముమ్మర కసరత్తు చేసింది.
దిల్లీ నుంచి వచ్చిన పరిశీలకుల బృందం చండీగఢ్‌లో సమావేశమై ముఖ్యమంత్రి అభ్యర్ధి ఎవరన్నదానిపై మంతనాలు జరిపారు.

ఫొటో సోర్స్, Gulshan Kumar
పంజాబ్ తదుపరి ముఖ్యమంత్రి సుఖ్‌జిందర్ సింగ్ రంధావా కావచ్చని మొదట ఊహాగానాలు వినిపించాయి. ఎక్కువమంది ఎమ్మెల్యేలు రంధావా పేరుకు మద్దతిచ్చారని సమావేశంలో పాల్గొన్న కొందరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు వెల్లడించారు.
ఈ నేపథ్యంలోనే రంధావా గవర్నర్ అపాయింట్‌మెంట్ కోరారంటూ ఏఎన్ఐ వెల్లడించింది. దీంతో ఆయనే కాబోయే ముఖ్యమంత్రి అన్న ఊహాగానాలు సాగాయి. కానీ చివరకు చరణ్‌జిత్ సింగ్ చన్నీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 2
ఇది కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయమని, దీనిపై తనకు ఎలాంటి అసంతృప్తి లేదని ఆ తర్వాత సుఖ్‌జిందర్ సింగ్ రంధావా మీడియాతో అన్నారు.
మరోవైపు పంజాబ్‌కు ఇద్దరు ఉపముఖ్యమంత్రులను నియమించే అవకాశం ఉందని, అందులో ఒకరు హిందు, మరొకరు దళితుడు అయ్యే అవకాశం ఉందని సమాచారం ఉన్నట్లు ఏఎన్ఐ వెల్లడించింది.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 3
దిల్లీలోనూ చర్చలు
మరోవైపు దిల్లీలో రాహుల్ గాంధీ నివాసంలో సమావేశమైన పార్టీ సీనియర్లు పంజాబ్ కొత్త సీఎం ఎంపికపై మంతనాలు జరిపారు. పంజాబ్ కాంగ్రెస్ పరిశీలకులు హరీశ్ చౌదరి, అజయ్ మాకెన్‌లు ఎమ్మెల్యేలతో మాట్లాడి వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు. చివరకు చన్నీని ఎంపిక చేశారు.
అంతకు ముందు సీఎం పగ్గాలు చేపట్టాల్సిందిగా అంబికా సోనీకి అధిష్టానం సూచించినా ఆమె దానిని సున్నితంగా తిరస్కరించారు. పంజాబ్ ముఖ్యమంత్రిగా ఒక సిక్కు వ్యక్తి మాత్రమే ఉండాలని తాను భావిస్తున్నట్లు ఆమె తెలిపారు.

ఫొటో సోర్స్, CAPT AMARINDER SINGH/TWITTER
బీజేపీ విమర్శలు
ఒక పక్క సీఎం అభ్యర్ది నిర్ణయంపై కాంగ్రెస్ పార్టీ పెద్దలు మంతనాలు జరుపుతుండగా, బీజేపీ నేతలు కాంగ్రెస్ పార్టీపై విమర్శలు చేశారు.
సిద్ధూపై మాజీ సీఎం అమరీందర్ సింగ్ దేశద్రోహం ఆరోపణలు చేశారని, ఈ వ్యాఖ్యలను కాంగ్రెస్ పార్టీ ఎందుకు సీరియస్‌గా తీసుకోవడం లేదని బీజేపీ నేత ప్రకాశ్ జావ్‌డేకర్ వ్యాఖ్యానించినట్లు ఏఎన్‌ఐ పేర్కొంది. ఈ వ్యవహారంలో రాహుల్, ప్రియాంకలు స్పందించాలని జావ్‌డేకర్ డిమాండ్ చేశారు.
ఇవి కూడా చదవండి:
- భారత్‌లోనే అత్యంత ఘాటైన రాజా మిర్చి కథ ఇది
- సాంబారు పుట్టినిల్లు తమిళనాడా.. మహారాష్ట్రా
- భారత్‌లో పోషకాహార లోపం పెరుగుతోంది... ఎందుకు?
- తాటితాండ్ర, తాటిగారెలు ఎలా తయారు చేస్తారు?
- బెల్లం: ఆహారమా... ఔషధమా
- ఒక్క భోజనం 40 వేల రూపాయలు.. హాట్‌కేకుల్లా అమ్ముడవుతున్న టికెట్లు... ఏంటి దీని ప్రత్యేకత
- తాటి ముంజలు: 'అధిక బరువుకు విరుగుడు, క్యాన్సర్ నిరోధకం'
- ‘ఇడ్లీ అమ్మ’కు ఆనంద్ మహేంద్ర ఊహించని గిఫ్ట్.. చనిపోయే దాకా ఒక్క రూపాయికే ఇడ్లీ అమ్ముతానంటున్న కమలాత్తాళ్
- బ్రిటన్‌లో భారతీయ వంటకాల వ్యాపారం చేస్తున్న 76 ఏళ్ళ బామ్మ
- 'ఈ నత్తలను తింటే స్వర్గంలో ఉన్నట్లుంటుంది... చలికాలం పున్నమి రోజుల్లో మాత్రమే వీటిని వేటాడాలి'
- ఆహారం వృథా: ఏటా 90 కోట్ల టన్నుల ఆహారాన్ని పారేస్తున్నారు...
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








