విరాట్ కోహ్లీ: 'టీ20 కెప్టెన్సీ నుంచి తప్పుకుంటా'- Newsreel

విరాట్ కోహ్లీ

ఫొటో సోర్స్, PA Media

టీ20 జట్టు కెప్టెన్సీపై విరాట్ కోహ్లీ కీలక నిర్ణయం తీసుకున్నారు.

దుబాయ్‌లో జరిగే టీ20 వరల్డ్ కప్ తర్వాత టీ20 కెప్టెన్సీ నుంచి తప్పుకుంటానని ఆయన ప్రకటించారు.

ఈ మేరకు కోహ్లీ ట్వీట్ చేశారు.

ఈ నిర్ణయానికి రావడం అంత సులువు కాదు, ఎంతో చర్చించి చివరికి ఈ నిర్ణయం తీసుకున్నానని కోహ్లీ చెప్పారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 1
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 1

కోహ్లీ ఏమని ట్వీట్ చేశారంటే..

'భారతదేశానికి ప్రాతినిధ్యం వహించడమే కాకుండా, టీమిండియాను నడిపించే అదృష్టం నాకు దక్కింది. క్రికెట్ జట్టు కెప్టెన్‌గా నా ప్రయాణంలో సహకరించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. ఆటగాళ్లు, సహాయక సిబ్బంది, సెలెక్షన్ కమిటీ, కోచ్‌లు ఇలా ప్రతిఒక్కరికి థ్యాంక్యూ. భారత్‌ గెలవాలని ప్రార్థించిన ప్రతి భారతీయుడికి కూడా. వీరందరి సహకారం లేకుండా నేను ఇది సాధించేవాడిని కాదు.

పనిభారాన్ని అర్థం చేసుకోవడం చాలా ముఖ్యమైన విషయం. గత 8, 9 సంవత్సరాలుగా మూడు ఫార్మాట్‌లలో ఆడుతున్నాను. గత ఐదారేళ్లుగా క్రమం తప్పకుండా కెప్టెన్‌ బాధ్యతలు మోస్తున్నాను. టెస్టులు, వన్డేల్లో టీమిండియాకు నాయకత్వం వహించడానికి నేను పూర్తి సిద్ధంగా ఉండాల్సిన అవసరం ఉంది. టీ20 కెప్టెన్‌గా జట్టుకు నాకు సాధ్యమైనంత వరకు సహాయ సహకారాలు అందించాను. ఇకపై టీ20 జట్టులో బ్యాట్స్‌మన్‌గా కొనసాగుతాను.

వాస్తవానికి ఈ నిర్ణయం తీసుకోవడానికి చాలా సమయం పట్టింది. రవి భాయ్, రోహిత్‌తో చర్చించిన తర్వాతే అక్టోబర్‌లో దుబాయ్‌లో జరిగే టీ20 ప్రపంచ కప్ తర్వాత నేను టీ20 కెప్టెన్‌గా వైదొలగాలని నిర్ణయించుకున్నాను' అని కోహ్లీ పేర్కొన్నారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 2
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 2

టీ20 కెప్టెన్‌గా విరాట్ కోహ్లీ సేవలు మర్చిపోలేమని బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా చెప్పారు.

ఇది కోహ్లీ వ్యక్తిగత నిర్ణయమని, దాన్ని తాము గౌరవిస్తామని ఆయన ట్వీట్ చేశారు.

నిమజ్జనం

హైదరాబాద్: హుస్సేన్ సాగర్‌లో వినాయక నిమజ్జనాలు చేసుకోవచ్చు - సుప్రీం కోర్టు

వినాయక విగ్రహాలను హైదరాబాద్‌లోని హుస్సేన్ సాగర్‌లో నిమజ్జనం చేసుకోవచ్చని సుప్రీం కోర్టు గురువారం స్పష్టంచేసింది.

ప్లాస్టర్ ఆఫ్ పారిస్ (పీవోపీ)తో తయారుచేసిన విగ్రహాలను హుస్సేన్ సాగర్‌లో నిమజ్జనం చేయొద్దని తెలంగాణ హైకోర్టు గతవారం ఆదేశాలు జారీచేసింది. ఈ ఆదేశాలను తెలంగాణ ప్రభుత్వం సుప్రీం కోర్టులో సవాల్ చేసింది.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 3
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 3

''సాగర్‌లో వేసిన విగ్రహాలను వెంటనే మళ్లీ బయటకు తీసేస్తామని, ఇది పేరుకు మాత్రమే నిమజ్జనం. దీనికి అనుమతులు జారీచేయాలి''అని తెలంగాణ ప్రభుత్వం సుప్రీం కోర్టును అభ్యర్థించింది.

వాదనల అనంతరం, హుస్సేన్ సాగర్‌లో నిమజ్జనానికి అనుమతి ఇస్తున్నట్లు సుప్రీం కోర్టు తెలిపింది.

అయితే, ఈ అనుమతులు ఈ ఏడాదికి మాత్రమే వర్తిస్తాయని కోర్టు చెప్పింది.

ఫ్రాన్స్

ఫొటో సోర్స్, AFPCo

ఇస్లామిక్ స్టేట్ ప్రధాన నాయకుణ్ని హతమార్చిన ఫ్రాన్స్

గ్రేటర్ సహారా ప్రాంతంలో ఇస్లామిక్ స్టేట్ మిలిటెంట్ సంస్థకు చెందిన ప్రధాన నాయకుడు అద్నాన్ అబూ వాలిద్ అల్ సహ్రావీని హతమార్చినట్లు ఫ్రాన్స్ తెలిపింది.

ఆఫ్రికాలోని సహేల్ ప్రాంతంలో ఉగ్రవాదంపై పోరాటంలో ఇది భారీ విజయమని ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మానుయేల్ మెక్రాన్ గురువారం ప్రకటించారు.

అయితే, అల్ సహ్రావీని ఎక్కడ హతమార్చారన్నది ఫ్రాన్స్‌ వెల్లడించలేదు.

ఆఫ్రికాలోని చాలా ప్రాంతాల్లోని ప్రజలపై అల్-సహ్రావీ గ్రూప్ ఇటీవల కాలంలో దాడులు చేపట్టింది.

ఫ్రాన్స్‌కు చెందిన సహాయక సిబ్బందితోపాటు అమెరికా ప్రత్యేక బలగాలనూ ఈ సంస్థ లక్ష్యంగా చేసుకుంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)