GDP: కోవిడ్ సెకండ్ వేవ్ దెబ్బతీసినా రికార్డ్ స్థాయి వృద్ధిని నమోదు చేసిన భారత ఆర్థిక వ్యవస్థ

ఫొటో సోర్స్, Getty Images
భారత ఆర్థిక వ్యవస్థ రికార్డు స్థాయిలో పుంజుకొంది. కోవిడ్ సెకండ్ వేవ్ తీవ్రంగా దెబ్బ తీసినప్పటికీ జూన్‌తో ముగిసిన 2021-22 తొలి త్రైమాసికంలో ఆర్థిక వ్యవస్థ జోరందుకుంది.
2020లో దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ అమలైన నాటితో పోల్చితే కోవిడ్ సెకండ్ వేవ్ సమయంలో ఆంక్షలు తక్కువగా ఉండడంతో ఆర్థిక కార్యకలాపాలు సజావుగానే సాగాయి. ఇది ఆర్థిక వ్యవస్థ కోలుకోవడానికి ఊతమిచ్చింది.
ఏప్రిల్ నుంచి జూన్ వరకు త్రైమాసికంలో స్థూల జాతీయోత్పత్తి(జీడీపీ) 20.1 శాతం పెరిగింది.
గత ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో భారత ఆర్థిక వ్యవస్థలో 24 శాతం క్షీణత నమోదైంది.

ఫొటో సోర్స్, Getty Images
ఆర్థిక వ్యవస్థలో వృద్ధికి వినియోగ వ్యయం, ప్రైవేటు పెట్టుబడులు కారణమయ్యాయని చీఫ్ ఎకనమిక్ అడ్వైజర్ కేవీ సుబ్రమణియన్ చెప్పారు.
తయారీ, నిర్మాణ రంగాలు కూడా ఆర్థిక వృద్ధికి ఊతమిచ్చాయని భారత గణాంక మంత్రిత్వ శాఖ లెక్కలు చెబుతున్నాయి.
గత ఆర్థిక సంవత్సరంలో భారత ఆర్థిక వ్యవస్థ 7.3 శాతం క్షీణత నమోదు చేసింది.
కరోనా మహమ్మారి కారణంగా తీవ్రంగా దెబ్బతిన్న ఆర్థిక వ్యవస్థలలో భారత్ కూడా ఒకటి.
ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో 21.4 శాత వృద్ధి ఉండొచ్చని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అంచనా వేయగా అంతకంటే స్వల్పంగా తక్కువ వృద్ధి నమోదైంది.
వృద్ధి రేటు పెరిగేలా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మరిన్ని ఉద్దీపన చర్యలు చేపట్టే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు.
కోవిడ్ కాలంలో ఆర్థిక వ్యవస్థ మందగించకుండా అనేక దేశాలు వినియోగ వ్యయం పెంచేందుకు భారీ మొత్తాలు కేటాయించగా భారత ప్రధాని నరేంద్ర మోదీ మాత్రం మౌలిక రంగం, ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ, పన్ను సంస్కరణలకు ప్రాధాన్యమిచ్చారు.
కొన్ని కీలక రంగాలు ఇంకా కోలుకోనప్పటికీ భారత ఆర్థిక వ్యవస్థ పుంజుకోనుందని ఆర్థిక నిపుణులు ఆశాభావం వ్యక్తంచేస్తున్నారు.
కరోనా మహమ్మారి ప్రబలడానికి ముందు రోజులతో పోల్చితే ఇప్పటికీ దేశంలో వినియోగ వ్యయం తక్కువగానే ఉంది.
కరోనావైరస్ మూడో వేవ్ ఉంటుందన్న భయాలు, వ్యాక్సినేషన్ ఇంకా నెమ్మదిగానే సాగుతుండడం వంటివి ఆర్థిక వ్యవస్థలో చలనానికి ప్రతిబంధకాలని నిపుణులు చెబుతున్నారు.
ఇవి కూడా చదవండి:
- పీవీ నరసింహారావు, మన్మోహన్లు సంక్షోభంలో అవకాశాలను ఎలా అందిపుచ్చున్నారు ?
- ఒకప్పటి భారతదేశానికి నేటి ఇండియాకు తేడా ఇదే
- ఇండియన్ బ్యూరోక్రసీ: ఇక్కడ బాత్రూం టవల్ కూడా అధికారి ప్రతిష్టను పెంచుతుందా?
- మోదీ ఏడేళ్ల పాలనలో భారత ఆర్థిక వ్యవస్థ ఎలా ఉందో ఈ ఏడు చార్టులు చెప్పేస్తాయి
- కొత్త నోట్లు ముద్రిస్తే భారత ఆర్థిక వ్యవస్థ గాడిన పడుతుందా
- కరోనా కాలంలో మోదీ ప్రభుత్వం సామాన్యుల జేబును భద్రంగా చూసుకుందా?
- ఆత్మనిర్భర్ భారత్: మోదీ రూ.20 లక్షల కోట్ల ప్యాకేజ్ ఏమయింది, నిధులు ఎవరికి చేరాయి?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









