అస్సాం, మిజోరం: రెండు రాష్ట్రాల మధ్య సరిహద్దు వివాదం, ఆరుగురు అస్సాం పోలీసులు మృతి

ఫొటో సోర్స్, Ani
అస్సాం, మిజోరం రాష్ట్రాల మధ్య సరిహద్దు సమస్య మరింత ముదిరింది. తాజాగా చెలరేగిన హింసలో ఆరుగురు అస్సాం పోలీసులు ప్రాణాలు కోల్పోయారు.
ఈ మేరకు అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ ట్విటర్‌లో ధ్రువీకరించారు.
'అస్సాం పోలీసు విభాగానికి చెందిన ఆరుగురు జవాన్లు అస్సాం-మిజోరం సరిహద్దుల్లో తమ రాష్ట్ర సరిహద్దును కాపాడుకునే క్రమంలో ప్రాణాలొదలడం నన్ను తీవ్రంగా బాధించింది' అని ఆయన ట్వీట్ చేశారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 1
అస్సాంలోని కచార్ జిల్లా, మిజోరంలోని కొలాసిబ్ జిల్లాల మధ్య ఉన్న సరిహద్దు ప్రాంతంపై కొన్నేళ్లుగా వివాదం ఉంది.
కాగా తాజా ఇక్కడ హింస చెలరేగడంతో సోమవారం(26.07.2021) మధ్యాహ్నం నుంచి రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల అక్కడి పరిస్థితులకు సంబంధించిన వీడియోలను షేర్ చేయడంతో ఉద్రిక్తతలను తగ్గించాలంటూ ఒకరినొకరు ట్యాగ్ చేస్తూ ట్వీట్‌లు చేసుకున్నారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షాను కూడా ట్యాగ్ చేశారు.
మిజోరం వైపు నుంచి రాళ్లు విసిరారని, కాల్పులు జరిపారని అస్సాం సీఎం హిమంత ఆరోపించారు.

ఫొటో సోర్స్, Twitter/zeromthanga
అస్సాం పోలీసులు మరణించిన ఘటన తరువాత కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఇద్దరు ముఖ్యమంత్రులతో ఫోన్‌లో మాట్లాడి సమస్య పరిష్కరించాలని సూచించినట్లు మిజోరం సీఎం జొరామ్‌తంగాను ఉటంకిస్తూ ఏఎన్ఐ వార్తాసంస్థ వెల్లడించింది.
అమిత్ షా జోక్యం తరువాత అస్సాం తన పోలీసు బలగాలను ఉపసంహరించుకుని సరిహద్దులోని డ్యూటీ పోస్ట్‌ను సీఆర్‌పీఎఫ్‌కు అప్పగించిందని మిజోరం సీఎం చెప్పినట్లుగా ఏఎన్ఐ తెలిపింది.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 2
అస్సాంతో అంతర్రాష్ట్ర సరిహద్దు తగదా శాంతియుత వాతావరణంలో పరిష్కారం కావాలని మిజోరం కోరుకుంటోందని జొరామ్‌తంగా అన్నారు.
కాగా ఈశాన్య రాష్ట్రాలలో పరిస్థితులపై రెండు రోజుల కిందటే ఆ ప్రాంత ముఖ్యమంత్రులతో కేంద్ర హోం మంత్రి అమిత్ షా సమావేశమయ్యారు.

ఫొటో సోర్స్, Getty Images
ట్విటర్‌లో ఇద్దరు సీఎంల యుద్ధం
సరిహద్దుల్లో భారీగా చేరిన ప్రజలు రాళ్లు, కర్రలతో దాడిచేస్తున్న వీడియోను పోస్ట్ చేసి 'దయచేసి ఈ సమస్య పరిష్కరించండి' అంటూ మిజోరం సీఎం జొరామ్‌తంగా సోమవారం మధ్యాహ్నం ట్వీట్ చేశారు.
ప్రధాని కార్యాలయం, హోంమంత్రి కార్యాలయం, అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ, అస్సాంలోని కచార్ పోలీసు శాఖను కూడా ట్యాగ్ చేశారాయన.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 3
మిజోరం సీఎం చేసిన ఆ ట్వీట్‌కు అస్సాం ముఖ్యమంత్రి హిమంత స్పందిస్తూ.. ''మిజోరం ప్రజలు ఎందుకిలా కర్రలు పట్టుకుని హింసకు దిగాలని ఎందుకు చూస్తున్నారో దర్యాప్తు చేయండి. ప్రజలు ఇలా చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవద్దని కోరుతున్నాం'' అంటూ ఆయన కూడా ప్రధాని కార్యాలయాన్ని, అమిత్ షాను ట్యాగ్ చేశారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 4
''మా పోలీస్ పోస్ట్ నుంచి వైదొలగాలని కొలాసిబ్(మిజోరం) ఎస్పీ మమ్మల్ని అడుగుతున్నారు. అక్కడ మిజోరం ప్రజలు హింస మాత్రం ఆపేది లేదంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మేం ప్రభుత్వాన్ని ఎలా నడపాలి జొరామ్‌తంగా'' అంటూనే వీలైనంత వేగం జోక్యం చేసుకోండి అంటూ అమిత్ షా, పీఎంవోలను హిమంత బిశ్వశర్మ ట్యాగ్ చేశారు.
ఆ ట్వీట్‌కు సరిహద్దుల్లోని ఉద్రిక్త పరిస్థితులకు సంబంధించిన వీడియోను జోడించారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 5
ఆ ట్వీట్‌కు మిజోరం సీఎం స్పందిస్తూ.. ''అమిత్ షాతో సమావేశం తరువాత కూడా రెండు కంపెనీల అస్సాం పోలీసులు, ప్రజలు కలిసి మిజోరంలోకి వచ్చి తమ రాష్ట్ర ప్రజలపై లాఠీఛార్జి చేయడంతో పాటు టియర్ గ్యాస్ ప్రయోగించారని ఆరోపించారు.
అనంతరం హిమంత మరో ట్వీట్‌లో ''నేను ఇప్పుడే కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో మాట్లాడాను. సరిహద్దు వివాదంపై ఇప్పుడున్న పరిస్థితే కొనసాగిస్తామని, శాంతిని కొనసాగిస్తామని పునరుద్ఘాటించాను. ఐజ్వల్ వచ్చి చర్చలు జరపడానికి సుముఖత వ్యక్తం చేశాను'' అని ట్వీట్ చేశారు.
దానికి జొరామ్‌తంగా స్పందిస్తూ అలా అయితే అస్సాం పోలీసులను మిజోరం నుంచి వైదొలగాలని సూచించండని కోరారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 6
ఎందుకీ గొడవ?
అస్సాం, మిజోరం మధ్య 164.6 కిలోమీటర్ల సరిహద్దు ఉంది. మిజోరంలోని ఐజ్వల్, కొలాసిబ్, మామిత్ జిల్లాలతో అస్సాంలోని కచార్, హైలాకండి, కరీంగంజ్ జిల్లాలకు సరిహద్దు ఉంది.
రెండు రాష్ట్రాల మధ్య ఎన్నో ఏళ్లుగా ఈ సరిహద్దు వివాదం ఉంది. చొరబడుతున్నారంటూ ప్రజలు, ప్రభుత్వాలు కూడా ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకోవడం గతంలోనూ జరిగింది.
అస్సాంకు మిజోరంతో పాటు అరుణాచల్ ప్రదేశ్, మేఘాలయతోనూ సరిహద్దు వివాదాలున్నాయి.
ఇవి కూడా చదవండి:
- పెగాసస్ స్పైవేర్: ఇప్పటికీ సమాధానాలు దొరకని కీలక ప్రశ్నలు
- ఒకప్పటి భారతదేశానికి ఇప్పటి ఇండియాకు తేడా ఇదే
- తెలంగాణ: ఇప్పటివరకు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు, ఇంకా ఎన్ని ఇస్తారు?
- టోక్యో ఒలింపిక్స్: ప్రపంచంలోనే అతిపెద్ద క్రీడా ఉత్సవం ప్రత్యేకతలేంటి? భారత్ నుంచి ఎవరెవరు వెళ్తున్నారు?
- ప్రమాదం అని తెలిసినా చైనాలో ప్లాస్టిక్ సర్జరీల సంఖ్య ఎందుకు పెరుగుతోంది
- దానిష్ సిద్దిఖీ: పులిట్జర్ ప్రైజ్ అందుకున్న భారత ఫొటో జర్నలిస్ట్ తీసిన మరపురాని ఛాయా చిత్రాలు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)