ముంబయిలో భారీ వర్షాలకు ఇళ్లు కూలి 20 మంది మృతి

ఫొటో సోర్స్, ANI
ముంబయిలోని చెంబూరు భారత్ నగర్ ప్రాంతంలో చెట్టు విరిగిపడి గోడ కూలిన ప్రమాదంలో 17 మంది చనిపోయారు. గాయపడిన వారిని రాజవాడి ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
శిథిలాల నుంచి ఇప్పటివరకు 17 మంది మృతదేహాలను వెలికి తీశామని జాతీయ విపత్తు నిర్వహణ దళం ఇన్‌స్పెక్టర్ రాహుల్ రఘువన్ష్ తెలిపారు. శిథిలాల కింద మరో ఇద్దరు ఉండే అవకాశముందని వివరించారు.
ఇక, విఖ్రోలీలో ఓ ఇల్లు కూలిన ఘటనలో ముగ్గురు చనిపోయారు. ఇద్దరు వ్యక్తులు గాయపడ్డారు. పంచశీల్ చాల్ ప్రాంతంలోని సూర్యనగర్‌లో ఈ ప్రమాదం జరిగింది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల వల్ల తెల్లవారుజామున ఈ ఘటన జరిగింది.
చెంబూరు శిథిలాల నుంచి 16 మందిని కాపాడినట్లు ముంబయి అగ్నిమాపక అధికారులు చెప్పారు.

ఫొటో సోర్స్, ANI
శిథిలాల్లో చిక్కుకున్నవారిని రక్షించేందుకు సహాయ చర్యలు కొనసాగుతున్నాయని ఎన్డీఆర్ఎఫ్ తెలిపింది.
శనివారం రాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు ముంబయి నగరంలో చాలా చోట్ల వరదలు ముంచెత్తిన పరిస్థితి కనిపిస్తోంది.

ఫొటో సోర్స్, ANI
హనుమాన్ నగర్ ప్రాంతంలోని ఖండీవాలీలో ఇళ్లల్లోకి నీళ్లు వచ్చాయి. లోతట్టు ప్రాంతాలైన కింగ్స్ సర్కిల్, లాల్ బాగ్‌లలో నీళ్లు ఎక్కడిక్కడే నిలిచిపోయాయి.
కుంభవృష్ఠి కారణంగా సియాన్ రైల్వే లైన్ కూడా నీట మునిగింది.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
భారీ వర్షాలకు ఇళ్లు కూలడంతో ప్రాణాలు కోల్పోయిన వారికి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సంతాపం ప్రకటించారు.
మృతులు ఒక్కొక్కరికీ రూ.2 లక్షలు, గాయపడిన వారికి రూ.50,000 చొప్పున బాధిత కుటుంబాలకు సాయం అందిస్తామని ప్రధాన మంత్రి కార్యాలయం ప్రకటించింది.
2005 జులై 26నాడు ముంబయిని అతలాకుతలం చేసిన వర్షాన్ని తాజా పరిస్థితులు గుర్తు చేస్తున్నాయని పీటీఐ వార్తా సంస్థ తెలిపింది. ఆ రోజు 24 గంటల్లోనే 944 మి.మీ. వర్షపాతం నమోదైంది.
ఇవి కూడా చదవండి:
- విశాఖ ఏజెన్సీలో గిరిజన గ్రామాలకు రోడ్లు, కరెంటు - బీబీసీ కథనాలకు స్పందన
- గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్: 'ఇంటర్నెట్ స్వేచ్ఛపై దాడి జరుగుతోంది'
- దక్షిణాఫ్రికా: జాకబ్ జుమాను జైలుకు పంపడంపై అల్లర్లు, 72 మంది మృతి
- కోవిడ్-19: చైనా వ్యాక్సీన్లను ఇస్తున్న దేశాల్లో మళ్లీ కేసులు ఎందుకు పెరుగుతున్నాయి?
- ‘12 ఏళ్ల వయసులో పొట్ట పెరుగుతుంటే ఎందుకో అనుకున్నా, గర్భవతినని గుర్తించలేకపోయాను’
- 24 ఏళ్ల నిరీక్షణ, 5 లక్షల కి.మీ.ల ప్రయాణం-ఎట్టకేలకు కొడుకును కలుసుకున్న తండ్రి
- ఆంధ్రప్రదేశ్: శ్రీశైలంలో రహస్యంగా డ్రోన్లు ఎందుకు ఎగరేస్తున్నారు ? అనుమతి లేకుండా వీటిని వాడితే ఏం జరుగుతుంది?
- బండ్ల శిరీష: రిచర్డ్ బ్రాన్సన్ వర్జిన్ గెలాక్టిక్ స్పేస్ ఫ్లైట్లో గుంటూరు అమ్మాయి రోదసి యాత్ర విజయవంతం
- పీవీ సింధు ఈసారి ఒలింపిక్ గోల్డ్ మెడల్ గెలవడం ఖాయమేనా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









