బిట్‌కాయిన్: క్రిప్టో కరెన్సీ లావాదేవీలను నిలిపేయాలంటూ బ్యాంకులకు చైనా ఆదేశం- Newsreel

ఫొటో సోర్స్, Reuters
క్రిప్టో కరెన్సీ వాడకాన్ని నిరోధించడానికి చైనా చర్యలు ప్రారంభించింది. డిజిటల్ కరెన్సీ లావాదేవీలను నిలిపేయాలంటూ బ్యాంకులు, ఆన్‌లైన్ చెల్లింపులు చేసే ప్లాట్‌ఫామ్‌లను చైనా సెంట్రల్ బ్యాంక్ 'పీపుల్స్ బ్యాంక్ ఆఫ్ చైనా' (పీబీఓసీ) ఆదేశించింది.
సిచువాన్ ప్రావిన్స్‌లో బిట్‌కాయిన్ మైనింగ్ ఆపరేషన్లను గత శుక్రవారం చైనా మూసి వేయించింది.
ఈ పరిణామాల మధ్య బిట్‌కాయిన్ ధర పది శాతానికి పైగా పడిపోయింది.
అయితే, మంగళవారం నాడు ఏషియా మార్కెట్లు స్వల్పంగా కోలుకుని స్థిరంగా కొనసాగాయి.
ఈ ఏడాది ఏప్రిల్‌లో ఒక బిట్‌కాయిన్ ధర రికార్డు స్థాయిలో 63,000 డాలర్లకు చేరుకుంది. అయితే, ఆ తర్వాత నుంచి పడిపోవడం ప్రారంభించింది.
అప్పటితో పోలిస్తే బిట్‌కాయిన్ ధర దాదాపు 50 శాతం పడిపోయింది.
క్రిప్టో కరెన్సీలో వ్యాపార కార్యక్రమాలపై కఠిన చర్యలు తీసుకోవాలని, ఈ కరెన్సీ కొనుగోలు, అమ్మకాలకు సంబంధించి ఎలాంటి ఆర్థిక సేవలను అందించవద్దని పలు ప్రధాన బ్యాంకులు, పేమెంట్ గేట్ వే సంస్థలకు ఆదేశాలు ఇచ్చినట్లు పీబీఓసీ సోమవారం వెల్లడించింది.
చైనాలో మూడో అతి పెద్ద బ్యాంకు అయిన అగ్రికల్చర్ బ్యాంక్ ఆఫ్ చైనా కూడా తాము పీపుల్స్ బ్యాంక్ ఆఫ్ చైనా ఆదేశాలను అనుసరిస్తున్నట్లు వెల్లడించింది. క్రిప్టో కరెన్సీతో బ్యాంకింగ్ సదుపాయం కల్పించబోమని చైనా పోస్టల్ సేవింగ్స్ బ్యాంక్ కూడా వెల్లడించిది.

ఫొటో సోర్స్, Reuters
ఇరాన్ అణు ఒప్పందం: క్షిపణి కార్యక్రమంపై చర్చించేది లేదన్న కొత్త అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ
అగ్ర దేశాలతో చర్చలను కొత్తగా ఎన్నికైన ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ స్వాగతించారు. అయితే, ఆ చర్చలు తమ దేశ ప్రయోజనాలకు అనుగునంగా ఉండాలని స్పష్టం చేశారు.
వియన్నా సమావేశంలో బాలిస్టిక్ క్షిపణి కార్యక్రమంపై చర్చలకు అవకాశం లేదని ఆయన తేల్చిచెప్పారు.
ఎన్నికల్లో విజయం తర్వాత తొలిసారిగా సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు.
2015లో ఇరాన్‌తో కుదుర్చుకున్న అణు ఒప్పందాన్ని పునరుద్ధరించాలని అమెరికా భావిస్తోంది. ఈ నేపథ్యంలో రైసీ ఈ వ్యాఖ్యలు చేశారు.
అసలేం జరిగింది..
ఇరాన్‌ను నమ్మని అగ్రరాజ్యాలు: ఇరాన్ అణ్వస్త్ర దేశంగా ఎదగాలని భావిస్తోందని, న్యూక్లియర్ బాంబును తయారు చేయాలని చూస్తోందని కొన్ని దేశాలు భావిస్తున్నాయి. అయితే ఈ ఆరోపణలను ఇరాన్ ఖండిస్తోంది.
2015లో కుదిరిన ఒప్పందం: 2015లో ఇరాన్‌తో ఆరు దేశాలు ఒక ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. దాని ప్రకారం ఇరాన్ కొన్ని అణు కార్యక్రమాలను ఆపేయాలి. ప్రతిఫలంగా ఇరాన్ ఆర్థిక రంగాన్ని దెబ్బతీస్తున్న కొన్ని కఠినమైన ఆంక్షలను అమెరికా, ఇతర దేశాలు సడలిస్తాయి.
అయితే, డోనాల్డ్ ట్రంప్ హయాంలో అమెరికా ఈ అణుఒప్పందం నుంచి వైదొలిగి ఇరాన్‌పై తిరిగి ఆంక్షలు విధించింది. దాంతో ఇరాన్ తన అణు కార్యక్రమాలను తిరిగి ప్రారంభించింది. అమెరికా కొత్త అధ్యక్షుడు బైడెన్ ఈ డీల్‌ను పునరుద్ధరించేందుకు ఆసక్తిగా ఉన్నారు. అయితే, ఎదుటి వాళ్లే ముందుగా చొరవ చూపించాలని ఇరుదేశాలు భావిస్తున్నాయి.
చర్చలపై ఇరాన్ కొత్త అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ ఏమన్నారు?
"చర్చలు కేవలం చర్చలుగా మాత్రమే మిగిలిపోకూడదు. చర్చలను సాగదీయ కూడదు. ఫలితాలిచ్చే చర్చలు మాకు ముఖ్యం. ఆ ఫలితాలు మా దేశ ప్రయోజనాలకు అనుకూలంగా ఉండాలి" అని ఇబ్రహీం రైసీ అన్నారు.
అణు ఒప్పందాన్ని వెంటనే పునరుద్ధరించి, ఇరాన్‌ను ఆర్థికంగా దెబ్బతీసిన కఠిన ఆంక్షలను వెంటనే ఎత్తి వేయాలని ఆయన అమెరికాను కోరారు. ఒకవేళ అమెరికా అలా చేస్తే ఆ దేశ అధ్యక్షుడు జో బైడెన్‌ను కలుస్తారా అని మీడియా అడిగిన ప్రశ్నకు 'లేదు' అని ఆయన సమాధానమిచ్చారు.
ఇరాన్ బాలిస్టిక్ క్షిపణి ప్రయోగ కార్యక్రమం, స్థానిక విధానాలపై వియన్నా సమావేశంలో చర్చలు జరపబోమని ఇబ్రహీం రైసీ తేల్చి చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
రాహుల్ గాంధీ: కోవిడ్‌పై శ్వేతపత్రం విడుదల చేసిన కాంగ్రెస్ నేత
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ భారత్‌లో కోవిడ్ పరిస్థితులపై శ్వేతపత్రం విడుదల చేశారు.
ప్రభుత్వాన్ని విమర్శించడం తన లక్ష్యం కాదని, మూడో వేవ్‌ను ఎదుర్కొనేందుకు సన్నద్ధం కావడానికి వీలుగా దేశానికి సహాయపడేందుకు మాత్రమే శ్వేతపత్రం విడుదల చేసినట్లు ఆయన ప్రకటించారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 1
''కోవిడ్ మొదటి, రెండో వేవ్‌ల సమయంలో దాన్ని ఎదుర్కొన్న తీరు సక్రమంగా లేదన్నది సుస్పష్టం. అందుకు గల కారణాలు గుర్తించేందుకు మేం ప్రయత్నించాం. వైరస్ నిరంతరం మ్యుటేట్ అవుతున్నందున మూడో వేవ్ తరువాత కూడా మరిన్ని వేవ్‌లు ఉండొచ్చని చెప్పడానికి నేను వెనుకాడను'' అని రాహుల్ అన్నారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 2
''నిన్న అత్యధిక డోసులు వేయడమనేది చాలా మంచి పనే. అయితే, ప్రభుత్వం దీన్ని ఒక్క రోజుకే పరిమితం చేయరాదు. దేశ జనాభా మొత్తానికీ వ్యాక్సీన్ వేసేంతవరకు ఈ జోరు కొనసాగాలి'' అని రాహుల్ గాంధీ అన్నారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 3
''ఆక్సిజన్ కొరత లేకుండా సరఫరా తగినంత ఉండుంటే కోవిడ్‌తో చనిపోయినవారిలో 90 శాతం మందికి ఆ పరిస్థితి రాకుండా ప్రాణాలు నిలిచేవి. ప్రధానమంత్రి కన్నీళ్లు ప్రజల ప్రాణాలను కాపాడలేదు. ఆక్సిజన్ అందించి ఉంటే అది ప్రాణాలు కాపాడేది'' అన్నారు రాహుల్.
ఇవి కూడా చదవండి:
- ఆంధ్రప్రదేశ్‌లో కోవిడ్ ఆత్మహత్యలు ఎందుకు పెరుగుతున్నాయి... వీటిని ఆపేదెలా?
- కరోనా సేవకుడే కరోనాతో మృతి... వందల మృతదేహాలకు అంత్యక్రియలు చేసిన బృందంలో విషాదం
- చైనాలో అతి సంపన్నులపై పెరిగిపోతున్న అసహనం... సంపద ప్రదర్శనపై చిర్రెత్తిపోతున్న జనం
- లైంగిక దోపిడీ: 'అయినవారే, ఘోరాలకు పాల్పడుతుంటే అన్నీ మౌనంగా భరించే చిన్నారులు ఎందరో' - అభిప్రాయం
- కోవిడ్ వ్యాక్సీన్ పేటెంట్ వివాదం ఏంటి... ఈ హక్కులు తొలగిస్తే టీకా అందరికీ అందుతుందా?
- మ్యూకోర్మైకోసిస్: భారత్‌లో కోవిడ్ రోగుల అవయవాలు దెబ్బతీస్తున్న 'బ్లాక్ ఫంగస్'
- భారత్‌లో కోవిడ్ సంక్షోభం మోదీ బ్రాండ్ ఇమేజ్ను దెబ్బతీసిందా?
- కరోనావైరస్ సెకండ్ వేవ్ భారత్‌లో బలహీన పడుతోందా... కేసులు నిజంగానే తగ్గుతున్నాయా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








