LIVE: తిరుపతి లోక్‌సభ ఉపఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి గురుమూర్తి, నాగార్జునసాగర్‌లో టీఆర్ఎస్ అభ్యర్థి నోముల భగత్ విజయం

ఫొటో సోర్స్, facebook/twitter
ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతి లోక్‌సభ స్థానంలో వైసీపీ అభ్యర్థి గురుమూర్తి తన సమీప ప్రత్యర్థి, టీడీపీ అభ్యర్థి పనబాక లక్ష్మిపై 2,68,978 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు.
వైసీపీ అభ్యర్థికి 620686 ఓట్లు రాగా టీడీపీ అభ్యర్థికి 3,51, 708 ఓట్లు వచ్చాయి.
సాయంత్రం 4.30 గం.లకు అందిన సమాచారం ప్రకారం వైసీపీ వైసీపీ 56.68 శాతం, టీడీపీ 32.07 శాతం ఓట్లు సాధించాయి.
తెలంగాణలోని నాగార్జున సాగర్ అసెంబ్లీ నియోజకవర్గ ఉపఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్ధి నోముల భగత్ 18,872 ఓట్ల మెజారిటీతో తన సమీప ప్రత్యర్ధి కుందూరు జానారెడ్డి (కాంగ్రెస్) పై విజయం సాధించారు.
ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్ధికి 89,804 ఓట్లు రాగా, కాంగ్రెస్‌కు 70,932, బీజేపీకి 7,676, ఇండిపెండెంట్‌కు 2,915, టీడీపీకి 1,714 ఓట్లు వచ్చాయి.
నాగార్జున సాగర్‌లో బీజేపీ డిపాజిట్ కోల్పోయింది.

ఫొటో సోర్స్, JanaReddy/FB
కాంగ్రెస్ అభ్యర్థి జానారెడ్డి స్పందన
నాగార్జున సాగర్ ఉప ఎన్నికల ఫలితాలపై కాంగ్రెస్ అభ్యర్థి కె. జానారెడ్డి స్పందించారు. ప్రజా తీర్పు ను గౌరవిస్తున్నానని అన్నారు. అలాగే, గెలిచిన టీ.ఆర్.ఎస్ అభ్యర్థి ని అభినందిస్తున్నానని చెప్పారు.
కాంగ్రెస్ నాయకులంతా నా గెలుపు కోసం కృషి చేశారు. ప్రభుత్వ యంత్రాంగం అంతా సర్వ శక్తులు ఒడ్డినా కాంగ్రెస్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ సత్తా చాటిందని చెప్పిన జానారెడ్డి, "ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ ఏం కోల్పోలేదు. సార్వత్రిక ఎన్నికలైతే ఫలితం వేరేలా ఉండేది. ఈ ప్రొత్సాహంతో రాబోయే రోజుల్లో కాంగ్రెస్ శ్రేణులు ముందుకు వెళ్లాలి." అని అన్నారు.
నేను సాగర్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయలేదన్నది అబద్ధమని, శాశ్వత అభివృద్ధి చేశానని చెప్పుకున్నారు.
టీపీసీసీకి ఎవరు అధ్యక్షుడు ఎవరన్నది పార్టీ చూసుకుంటుందని చెబుతూనే భవిష్యత్తులో తాను మళ్లీ పోటీ చేయాల్సిన అవసరం ఉండదని అనుకుంటున్నానని జానారెడ్డి అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
నాగార్జునసాగర్‌లో మొదటి రౌండ్ నుంచి నోముల ఆధిక్యం
మొదటి రౌండ్ నుంచి టిఆర్ఎస్ అభ్యర్థి నోముల భగత్ ఆధిక్యం ప్రదర్శిస్తూనే ఉన్నారు.
మొదటి రౌండులో టీఆర్ఎస్ కు 1475 లీడ్ వచ్చింది. ఆ రౌండులో టిఆర్ఎస్‌కు 4228, కాంగ్రెస్ కి 2753 ఓట్లు వచ్చాయి.
ఇక రెండవ రౌండు ముగిసే సరికి టీఆర్ఎస్ 2216 ఓట్లీల ఆధిక్డ్యంలో ఉంది. మూడవ రౌండు ముగిసే సరికి టిఆర్ఎస్ 2665 ఓట్ల ఆధిక్యానికి వచ్చింది. ఆ రౌండులో టిఆర్ఎఎస్ కి 3421 ఓట్లు, కాంగ్రెస్ కి 2882 ఓట్లు వచ్చాయి. బీజేపీకి మొదటి రౌండులో కేవలం 157 ఓట్లు వచ్చాయి. నాల్గవ రౌండు ముగిసే సరికి టిఆర్ఎస్ 3457 ఓట్ల ఆధిక్యంలో ఉంది.
ఆ రౌండులో టిఆర్ఎస్ కి 4186, కాంగ్రెస్ కి 3202 ఓట్లు వచ్చాయి.
5వ రౌండ్ ముగిసే సరికి టిఆర్ఎస్ కి 4334 ఓట్ల ఆధిక్యం ఉంది. 5వ రౌండులో టిఆర్ఎస్ కి 3442 ఓట్లు, కాంగ్రెస్ కు 2676 ఓట్లు, బీజేపీ కి 74 ఓట్లు పడ్డాయి.
6వ రౌండ్ ముగిసే సరికి టిఆర్ఎస్ కి 5177 ఓట్ల ఆధిక్యం వచ్చింది. ఆ రౌండులో టిఆర్ఎస్ కి 3989, కాంగ్రెస్ కు 3049 ఓట్లు పడ్డాయి. ప్రస్తుతం ఏడవ రౌండ్ లెక్కింపు కొనసాగుతోంది.
ఈ ఎన్నికల్లో ఓటమితో కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధి జానారెడ్డికి ఆయన రాజకీయ కెరీర్‌లో మూడో ఓటమి అయ్యింది. 1994, 2018 ఎన్నికల్లో జానా ఓడిపోయారు.
కోవిడ్ ఏర్పాట్ల మధ్య
ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతి లోక్‌సభ స్థానం, తెలంగాణలోని నాగార్జున సాగర్ అసెంబ్లీ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు ఈ రోజు ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది.
ప్రత్యేక భద్రత ఏర్పాట్లు, కోవిడ్ నిబంధనల మధ్య కౌంటింగ్ నిర్వహిస్తున్నారు. కోవిడ్ నేపథ్యంలో అదనపు జాగ్రత్తలు పాటిస్తున్నట్టు తిరుపతి లోక్‌సభ నియోజకవర్గ ఎన్నికల రిటర్నింగ్ అధికారి చక్రధర్ బాబు ప్రకటించారు.
కౌంటింగ్ దగ్గర ఉండాలనుకునే అభ్యర్థులు, ఏజెంట్లు పూర్తిస్థాయిలో నిబంధనలు పాటించాలని ఇప్పటికే ఆదేశించారు.
నెల్లూరు జిల్లా గూడూరు, సూళ్లూరుపేట, వెంకటగిరి, సర్వేపల్లి అసెంబ్లీ నియోజక వర్గాల ఓట్లను నెల్లూరులోని డీకేడబ్ల్యూ కాలేజీలో లెక్కిస్తున్నారు.
చిత్తూరు జిల్లా పరిధిలోని తిరుపతి, శ్రీకాళహస్తి, సత్యవేడు అసెంబ్లీ నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు తిరుపతిలోని ఎస్వీ యూనివర్సిటీలో జరుగుతోంది.

ఫొటో సోర్స్, Getty Images
తిరుపతిలో..
మొదట సర్వీసు ఓట్లు, ఆ తర్వాత పోస్టల్ బ్యాలెట్ లెక్కిస్తారు. అత్యధికంగా తిరుపతికి సంబంధించి 25 రౌండ్లు కౌంటింగ్ జరుగుతుంది.
సూళ్లూరుపేట 24 రౌండ్లలో లెక్కిస్తారు. రెండు కౌంటింగ్ కేంద్రాల నుంచి సమాచారం నెల్లూరులోని ఆర్వో కార్యాలయానికి చేరుతుంది.
అక్కడి నుంచే అధికారికంగా ఓట్ల లెక్కింపు వివరాలు విడుదల చేస్తారు.
ఈవీఎం పద్ధతిలో జరిగిన ఎన్నికలు కావడంతో మధ్యాహ్నానానికి తుది ఫలితాలు వెలువడే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
నెగిటివ్ సర్టిఫికెట్ తప్పనిసరి
కౌంటింగ్ సిబ్బంది, ఏజెంట్లు, కౌంటింగ్ విధులకు హాజరయ్యే జర్నలిస్టులు కూడా కోవిడ్ నెగటివ్ సర్టిఫికెట్ సమర్పించాలని ఆర్వో ఇంతకుముందే ఆదేశించారు.
కోవిడ్ నియంత్రణలో భాగంగా పేస్ షీల్డ్, మాస్కులు, గ్లౌజులు ఇతర జాగ్రత్తలన్నీ పాటించాలని కూడా సూచించారు.
కోవిడ్ ప్రోటోకాల్ పాటించేలా పూర్తి జాగ్రత్తలు పాటించాలని ఆర్వో సూచించారు.
విజయోత్సవాలు వద్దు
కోవిడ్ పరిస్థితుల నేపథ్యంలో విజయోత్సవాలకు అనుమతి లేదని ఆర్వో, నెల్లూరు కలెక్టర్ కేవీఎన్ చక్రధర్ బాబు బీబీసీకి తెలిపారు.
‘‘ఈనెల 4 వరకు ఎన్నికల షెడ్యూల్ అమలులో ఉంటుంది. ఎవరూ నిబంధనలు అతిక్రమించకూడదు. విజయోత్సవ ర్యాలీలకు అనుమతి లేదు. ప్రజలు గుమిగూడే అవకాశం ఉన్న అన్ని సందర్భాల్లోనూ అడ్డుకుంటాం. ఇప్పటికే పార్టీల నేతలకు తెలియజేశాం అందరూ సహకరించాల’’ని కోరారు.
వైసీపీ ఎంపీ బల్లి దుర్గా ప్రసాద్ హఠాన్మరణంతో తిరుపతి లోక్‌సభ స్థానానికి ఉప ఎన్నిక జరిగింది.
సీఎం జగన్మోహన్‌రెడ్డికి వ్యక్తిగత ఫిజియోథెరపిస్టు డాక్టర్ గురుమూర్తి వైసీపీ అభ్యర్థిగా, టీడీపీ తరఫున కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మి, బీజేపీ-జనసేన ఉమ్మడి అభ్యర్థిగా కర్ణాటక మాజీ సీఎస్ రత్నప్రభ, కాంగ్రెస్ నుంచి చింతా మోహన్, సీపీఎం తరఫున నెల్లూరు యాదగిరి పోటీలో నిలిచారు.
నల్గొండలో సాగర్ ఉప ఎన్నిక కౌంటింగ్
తెలంగాణలో నాగార్జునసాగర్ ఉప ఎన్నిక కౌంటింగ్ నల్గొండలో జరుగుతోంది.
మొత్తం 25 రౌండ్లలో లెక్కింపు చేపడతారు.
సాయంత్రం 4లోపు అన్ని రౌండ్ల లెక్కింపు పూర్తవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు.
కోవిడ్ నిబంధనల మేరకు అధికారులు కౌంటింగ్ ఏర్పాట్లు పూర్తి చేశారు.
అభ్యర్థులు, ఏజెంట్లకు కరోనా పరీక్షలు..
ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు, కౌంటింగ్ ఏజెంట్లకు ఇప్పటికే కోవిడ్ పరీక్షలు చేశారు.
ఏప్రిల్ 29న నల్లగొండ జిల్లా నిడమనూరులో వీరికోసం ప్రత్యేక క్యాంపు ఏర్పాటు చేశారు. వీరిలో 8 మందికి పాజిటివ్ అని తేలింది.
కౌంటింగ్ విధుల్లో ఉన్న సిబ్బంది, అక్కడ ఉండబోయే మీడియా ప్రతినిధులకు కూడా జిల్లా కేంద్రంలో శనివారం కరోనా పరీక్షలు చేశారు.
లెక్కింపు జరుగుతున్నప్పుడు ప్రతి 3 గంటలకు ఒకసారి కౌంటింగ్ కేంద్రాన్ని శానిటైజ్ చేస్తారు., మొత్తం 400 మంది కౌంటింగ్ సిబ్బంది లెక్కింపు ప్రక్రియలో పాల్గొంటున్నారు.
సాగర్‌లో 41 మంది అభ్యర్థులు
టీఆర్ఎస్ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య అకాల మరణంతో నాగార్జునసాగర్ ఉప ఎన్నిక జరిగింది.
నియోజకవర్గంలోని మొత్తం 346 పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ నిర్వహించారు.
సాగర్ స్థానంలో అధికార టీఆర్ఎస్ అభ్యర్థిగా నోముల భగత్, కాంగ్రెస్ అభ్యర్థిగా జానారెడ్డి, బీజేపీ అభ్యర్థిగా రవి నాయక్ పోటీ చేశారు. వీరితో కలిపి మొత్తం 41 మంది అభ్యర్థులు పోటీలో నిలిచారు.
సాగర్ నియోజకవర్గంలో మొత్తం 2,20,300 మంది ఓటర్లు ఉన్నారు.
ఇవి కూడా చదవండి:
- అంగారకుడి మీద ఒకప్పుడు ప్రవహించిన నీరంతా ఆ గ్రహం పైపొరలోనే బందీగా ఉందా?
- స్కైల్యాబ్: ‘అంతరిక్షంలో వ్యోమగాముల తిరుగుబాటు’ వెనకున్న అసలు కథ ఇది..
- కరోనావైరస్: భారతదేశంలో 3 లక్షలు దాటిన రోజువారీ కోవిడ్ కేసులు...
- నోబెల్‌కు 5 సార్లు నామినేట్ అయిన ‘భారత అణు కార్యక్రమ పితామహుడు’ మరణానికి కారణమేంటి
- విశాఖపట్నం: మహానగరం మధ్యలో అభయారణ్యం... అందులో రహస్య గిరిజన గ్రామం...
- వంటకాల కోసం తగువులాడుకుంటున్న దేశాలు... భారత్, పాకిస్తాన్ల మధ్య కూడా ఓ వివాదం
- చైనా, తైవాన్: రెండు దేశాల మధ్య పైనాపిల్ యుద్ధం
- బానిసలుగా వచ్చి బాద్‌షాలయ్యారు
- ఫ్రెండ్స్ సమక్షంలో పూలతో ప్రపోజ్ చేసి, హగ్ చేసుకున్న ప్రేమ జంట... బహిష్కరించిన యూనివర్సిటీ
- 173 మందితో వెళ్తున్న విమానంలో మంటలు చెలరేగితే ల్యాండింగ్‌కు అనుమతి ఇచ్చారు.. తరువాత ఏమైందంటే
- నరేంద్ర మోదీ: ‘‘తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో కోవిడ్ వ్యాక్సిన్ల వృధా 10 శాతం పైనే ఉంది’’
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








