ప్రధాని మోదీకి దిల్లీ సీఎం కేజ్రీవాల్ క్షమాపణలు ఎందుకు చెప్పారు? - Newsreel

ఫొటో సోర్స్, ANI
దేశంలో కోవిడ్ పరిస్థితులను సమీక్షించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం నాడు పది రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సమావేశమయ్యారు. ఆ సమావేశంలో దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రధానికి క్షమాపణలు చెప్పారు.
శుక్రవారం ఉదయం అత్యంత కరోనా ప్రభావిత రాష్ట్ర ముఖ్యమంత్రులతో ప్రధాని మోదీ సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశంలో దిల్లీ సీఎం కేజ్రీవాల్ మాట్లాడడం మొదలుపెట్టగానే దాన్ని లైవ్ ప్రసారం చేయడం ప్రారంభించారు.దానికి మోదీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ "ఇది మన ప్రోటోకాల్‌కు, సంప్రదాయానికి విరుద్ధం. ఇన్ హౌస్ మీటింగ్ జరుగుతున్నప్పుడు ఏ ముఖ్యమంత్రి కూడా లైవ్ టెలికాస్ట్ ఇవ్వకూడదు. అది సబబు కాదు. మనం ఎప్పుడూ ప్రోటోకాల్ పాటించాలి" అని అన్నారు.మోదీ వ్యాఖ్యలకు కేజ్రీవాల్ ఇబ్బంది పడుతూ, "సరే సార్, ఇకపై ఇలా జరగకుండా చూసుకుంటాను. నేనేమైనా కఠినంగా మాట్లాడితే, నావల్ల ఏదైనా పొరపాటు జరిగితే అందుకు నేను క్షమాపణలు కోరుకుంటున్నాను" అని అన్నారు.
కేజ్రీవాల్ తన ప్రసంగంలో కరోనా జాతీయ ప్రణాళిక గురించి మాట్లాడారు. ఆక్సిజన్ కొరత గురించి, ఆక్సిజన్ ట్యాంకర్లను ఆపివేయడం గురించి మాట్లాడారు. దీనిపై ప్రధాని స్పందించాలని కోరారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 1
ఈ మీటింగ్ లైవ్ వెళ్లి ఉండకూడదని ప్రభుత్వ వర్గాలు అభిప్రాయపడినట్లు ఏఎన్ఐ వార్తా సంస్థ తెలిపింది. కేజ్రీవాల్ రాజకీయాలు చేస్తున్నారని వారు ఆరోపించారు.
కేజ్రీవాల్ తన ప్రసంగంలో ఆక్సిజన్ ఎయిర్‌లిఫ్టింగ్ చేయాలని సూచించారు. అయితే, అది ఇప్పటికే జరుగుతోందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.
ఈ సమావేశంలో ముఖ్యమంత్రులందరూ వారి వారి ప్రణాళికలను వివరించారు. కేజ్రీవాల్ తాను ఏం చేస్తున్నారో చెప్పలేదని వారు ఆరోపించారు.
ఈ సమావేశం ప్రత్యక్ష ప్రసారం చేయడం గురించి కేంద్రం నుంచి తమకు ఎటువంటి సూచనలు అందలేదని, అందుకే లైవ్ ప్రసారం చేశామని, అసౌకర్యానికి చింతిస్తున్నామని దిల్లీ సీఎంఓ తెలిపింది.
ఆక్సిజన్ సరఫరా విషయమై కేంద్రానికి, దిల్లీ ప్రభుత్వానికి మధ్య వివాదాలు నెలకొన్నాయి.
అంతకుముందు, కేంద్రం తమకు అందవలసిన ఆక్సిజన్ కోటా అందించలేదని కేజ్రీవాల్ ఆరోపించారు. తరువాత, కేంద్రం దిల్లీకి ఇవ్వాల్సిన వాటాను విడుదల చేసింది. అయితే, పలు చోట్ల ఆక్సిజన్ ట్యాంకర్లను అడ్డుకున్నారని దిల్లీ ప్రభుత్వం చెబుతోంది.దిల్లీలోని ఆస్పత్రుల్లో ఆక్సిజన్ సంక్షోభం తీవ్ర స్థాయిలో ఉంది.

ఫొటో సోర్స్, ANI
ముఖ్యమంత్రుల సమావేశంలో ప్రధాని మోదీ ఏం చెప్పారంటే...
కరోనా సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు కోవిడ్ ప్రభావిత రాష్ట్రాలకు పూర్తి సహాయం అందిస్తామని ప్రధాని మోదీ హామీ ఇచ్చారు.
అవసరమైన ఇంజెక్షన్లు, మందుల బ్లాక్ మార్కెట్ నిల్వలను నిరోధించడానికి రాష్ట్ర ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు.రైల్వే, వైమానిక దళాల సహాయంతో రాష్ట్రాలకు ఆక్సిజన్ సరఫరా చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిపారు."మనమందరం ఒక దేశంగా పని చేస్తే వనరుల కొరత ఉండదు" అని మోదీ అన్నారు.ఆస్పత్రుల భద్రత విస్మరించవద్దని, భయంతో మందులు కొని ఇంట్లో నిల్వ చేసుకోకూడదనే అవగాహన ప్రజల్లో కలిగించాలని కోరారు. మందులు, ఆక్సిజన్ విషయంలో అన్ని రాష్ట్రాలు కలిసి పనిచేయాలని, రాష్ట్రాలకు వెళ్లే ఆక్సిజన్ ట్యాంకర్లనూ ఎవరూ ఆపకుండా చూసుకోవాలని అన్నారు.

కోవిడ్ చికిత్సకు జైడస్ కాడిలా 'విరాఫిన్'కు అనుమతి

ఫొటో సోర్స్, Getty Images
వయోజనుల్లో కోవిడ్ ఇంఫెక్షన్ మధ్యస్థ (మోడెరేట్) స్థాయిలో ఉన్నవారికి చికిత్స అందించేందుకు జైడస్ కాడిలా వారి పెగిలేటెడ్ ఇంటర్‌ఫెరాన్ ఆల్ఫా-2బీ, 'విరాఫిన్' అత్యవసర వినియోగానికి డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ) ఆమోదించింది.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 2
ఎయిమ్స్, ఐసీఎంఆర్ కొత్త గైడ్‌లైన్స్ ప్రకారం కోవిడ్ మోడెరేట్ స్థాయి అంటే వ్యాధి లక్షణాలు ఎక్కువగానే ఉంటూ ఆక్సిజన్ స్థాయి 93% నుంచి 90% వరకు ఉండాలి.

భారత్‌లో వరుసగా రెండోరోజు 3 లక్షలకు పైగా కొత్త కేసులు

ఫొటో సోర్స్, Getty Images
భారత్‌లో కరోనావైరస్ సెకండ్ వేవ్ విజృంభిస్తోంది.
వరుసగా రెండోరోజు 3 లక్షలకు పైగా కొత్త కేసులు నమోదయ్యాయి.
గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 3,32,730 కొత్త కేసులు వచ్చాయని ఏఎన్ఐ వార్తా సంస్థ తెలిపింది.
2,263 మంది కరోనాతో చనిపోయారు. దాంతో మొత్తం మృతుల సంఖ్య 1,86,920కి చేరింది.
1,93,279 మంది డిశ్చార్జ్ అయ్యారని కేంద్ర వైద్య శాఖ పేర్కొంది.
దేశవ్యాప్తంగా ప్రస్తుతం 24,28,616 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
మొత్తం 13,54,78,420 మందికి వ్యాక్సీన్ వేశారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 3

ఫొటో సోర్స్, fb/ktr
కేటీఆర్‌కు కరోనా పాజిటివ్
తెలంగాణ మంత్రి కేటీఆర్‌కు కోవిడ్ పాజిటివ్ వచ్చింది.
ఆయన స్వయంగా ఈ విషయాన్ని ట్విటర్‌లో తెలిపారు.
తేలికపాటి లక్షణాలు మాత్రమే ఉన్నాయని, ఇంట్లో ఐసోలేషన్‌లో ఉన్నానని ఆయన చెప్పారు.
గడిచిన కొన్ని రోజులుగా తనను కలిసిన వారు కోవిడ్ పరీక్షలు చేయించుకుని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 4
ఇవి కూడా చదవండి:
- విశ్వ రహస్యాలు శోధించే ప్రయోగశాలలో పరిశోధనలు ఏం చెబుతున్నాయి
- కరోనావైరస్: మిగతా దేశాలు వ్యాక్సీన్ తయారు చేసుకోకుండా ధనిక దేశాలు అడ్డుపడుతున్నాయా?
- ఇస్రో గూఢచర్యం కేసు: కేరళ పోలీసుల పాత్రపై దర్యాప్తునకు సుప్రీం ఆదేశం
- వరల్డ్ హ్యాపీనెస్ డే: అత్యంత సంతోషకర దేశంగా ఫిన్లాండ్, 139వ స్థానంలో భారత్
- నోబెల్‌కు 5 సార్లు నామినేట్ అయిన ‘భారత అణు కార్యక్రమ పితామహుడు’ మరణానికి కారణమేంటి
- విశాఖపట్నం: మహానగరం మధ్యలో అభయారణ్యం... అందులో రహస్య గిరిజన గ్రామం...
- వంటకాల కోసం తగువులాడుకుంటున్న దేశాలు... భారత్, పాకిస్తాన్ల మధ్య కూడా ఓ వివాదం
- చైనా, తైవాన్: రెండు దేశాల మధ్య పైనాపిల్ యుద్ధం
- ఫ్రెండ్స్ సమక్షంలో పూలతో ప్రపోజ్ చేసి, హగ్ చేసుకున్న ప్రేమ జంట... బహిష్కరించిన యూనివర్సిటీ
- 173 మందితో వెళ్తున్న విమానంలో మంటలు చెలరేగితే ల్యాండింగ్‌కు అనుమతి ఇచ్చారు.. తరువాత ఏమైందంటే
- తెలంగాణ బడ్జెట్ 2021: రూ.2,30,826 కోట్లతో బడ్జెట్.. వెయ్యి కోట్లతో సీఎం దళిత్ ఎంపవర్మెంట్ ప్రోగ్రాం
- నరేంద్ర మోదీ: ‘‘తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో కోవిడ్ వ్యాక్సిన్ల వృధా 10 శాతం పైనే ఉంది’’
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








