కోవిడ్: ‘ఇదే నా చివరి గుడ్ మార్నింగ్ కావొచ్చు’ అంటూ ఫేస్‌బుక్‌లో పోస్ట్ పెట్టిన కొన్ని గంటల్లోనే చనిపోయిన డాక్టర్

మానసి

ఫొటో సోర్స్, MANISHA JADHAV

మహారాష్ట్ర సెవ్రీలోని టీబీ ఆస్పత్రిలో చీఫ్ మెడికల్ ఆఫీసర్‌‌గా పనిచేస్తున్న డాక్టర్ మనీషా జాధవ్‌కు కరోనావైరస్‌ పాజిటివ్ వచ్చింది.

సోమవారం రాత్రి ముంబయిలోని బాబాసాహెబ్ అంబేడ్కర్ ఆస్పత్రిలో ఆమె చనిపోయారు.

చనిపోవడానికి కొన్ని గంటల ముందు ఆమె ఫేస్‌బుక్‌లో ఒక పోస్ట్ పెట్టారు.

"బహుశా ఇది నా ఆఖరి గుడ్ మాణింగ్ కావచ్చు. నేను మళ్లీ మిమ్మల్ని చూడలేకపోవచ్చు. అందరూ జాగ్రత్తగా ఉండండి. మరణం శరీరానికే, ఆత్మకు కాదు. ఆత్మకు చావు లేదు" అని ఫేస్‌బుక్ పోస్టులో రాశారు.

కోవిడ్

ఫొటో సోర్స్, Manisha Jadhav

ఆమె పోస్ట్ అందర్ని కదిలించింది.

మీకు ఏం కాదంటూ చాలామంది నెటిజన్లు ఆమెకు ధైర్యం చెప్పారు.

"ఆందోళన పడకండి. మీరు త్వరలోనే కోలుకుంటారు. మీకు అండగా మేమంతా ఉన్నాం. మీకు ఏం కాదు" అని కామెంట్ చేశారు.

కానీ ఫేస్‌బుక్‌లో పోస్ట్ పెట్టిన 36గంటల తర్వాత మనీషా చనిపోయారు.

ముంబయి మేయర్ కిశోరీ పెడ్నేకర్ ఆమె మరణం పట్ల సంతాపం వ్యక్తం చేశారు.

"మేం ఒక మంచి డాక్టర్‌ను కోల్పోయాం. ఆమె కుటుంబం ఇప్పుడు ఎంత విషాదంలో ఉందో మేం అర్థం చేసుకోగలం" అని మీడియాతో అన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)