తెలంగాణ: మామిడి కాయలు కోశారన్న అనుమానంతో ముఖానికి పేడ పూసి తినిపించారు...పోలీసుల అదుపులో నిందితులు

ఫొటో సోర్స్, UGC
మామిడి తోటలో దొంగతనం చేయడానికి వచ్చారన్న అనుమానంతో మహబూబాబాద్ జిల్లా తొర్రూరులో ఇద్దరు చిన్నారులపై దాడి ఘటన సంచలనం సృష్టించింది.
దీనిపై స్పందించిన పోలీసులు వారిపై చర్యలు చేపట్టారు.

ఫొటో సోర్స్, UGC
మైనర్ బాలలపై దాడికి పాల్పడిన బానోత్ యాకుబ్, బానోత్ రాములు అనే ఇద్దరు వ్యక్తులపై సెక్షన్ 342, 324, 504తోపాటు జువైనల్ జస్టిస్ చట్టంలోని సెక్షన్ 75 కింద కేసులు నమోదు చేశారు.

ఫొటో సోర్స్, UGC
అసలేం జరిగింది?
పోలీసులు అందించిన వివరాల ప్రకారం మహబూబాబాద్ జిల్లా తొర్రూరులోని సాయి నగర్‌కు చెందిన ఇద్దరు మైనర్ బాలురు తమ పెంపుడుకుక్క కనబడకపోవడంతో దాన్ని వెతుక్కుంటూ కంటాయపాలెం రోడ్డు దగ్గర్లోని ఓ మామిడి తోటలోకి వెళ్లారు.
అయితే, తోటకు కాపలాగా ఉంటున్న బానోత్ యాకుబ్, బానోత్ రాములు... వీరిద్దరు మామిడి కాయల దొంగతనానికి వచ్చారని అనుమానించి వారిని తాళ్లతో కట్టి కర్రతో తీవ్రంగా కొట్టారు.

ఫొటో సోర్స్, UGC
ఇద్దరి ముఖానికి పశువుల పేడను పూసి, వారితో తినిపించారు.
ఆ దారిలో వెళ్తున్న ఒక వ్యక్తి ఈ ఘటనంతా వీడియో తీసి వాట్సాప్ గ్రూప్‌లలో పోస్ట్ చేశారు.
ఆ వీడియోలు ఇప్పుడు వైరల్ అయ్యాయి.
ఈ ఘటనపై స్పందించిన పోలీసులు దాడికి పాల్పడిన ఇద్దరు వ్యక్తులపై కేసులు నమోదు చేసి వారిని అదుపులోకి తీసుకున్నారు.
ఇవి కూడా చదవండి:
- సెక్స్‌కు ఒకసారి ఒప్పుకుంటే... ప్రతిసారీ ఒప్పుకున్నట్లేనా?
- లాక్డౌన్: జనతా కర్ఫ్యూకి ఏడాది.. దేశంలో మళ్లీ లాక్డౌన్.. ఎక్కడెక్కడంటే
- రూ. 2000 నోట్ల ముద్రణను రిజర్వు బ్యాంక్ ఆపేసింది... పెద్ద నోటు మళ్లీ రద్దవుతుందా?
- బ్యాంకుల సమ్మె ఎందుకు? మోదీ ప్రభుత్వం.. ప్రభుత్వ బ్యాంకులను ఎందుకు ప్రైవేటీకరిస్తోంది?
- IPO అంటే ఏమిటి... దరఖాస్తు చేసిన వారందరికీ షేర్లు కేటాయిస్తారా? కేటాయించకపోతే ఏం చేయాలి?
- మ్యూచువల్ ఫండ్స్: మహిళలు పెట్టుబడి పెట్టేందుకు అద్భుతమైన మార్గం ఇదేనా?
- విశాఖపట్నం: సాగర తీరంలో టీయూ-142 యుద్ధ విమానం... దీని చూస్తే ఎందుకు ఉద్వేగం ఉరకలేస్తుంది?
- మియన్మార్‌లో 'సరోంగ్ విప్లవం': మహిళలు నడుముకు కట్టుకునే 'సరోంగ్' వస్త్రం.. నిరసనకారుల ఆయుధంగా మారిన వైనం
- యాంటీకిథెరా: రెండు వేల ఏళ్ల కిందటి 'పురాతన కంప్యూటర్'.. గుట్టు వీడబోతోందా
- గుజరాత్: టీ షర్ట్ ధరించి వచ్చిన కాంగ్రెస్ ఎమ్మెల్యేను సభ నుంచి పంపించేసిన స్పీకర్
- బిర్యానీ పక్కాగా వండాలంటే కచ్చితమైన లెక్కలు ఉంటాయా? దీనికో ఆల్గారిథమ్ ఉందా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








