రైతులు నిజంగానే ఎర్రకోట మీద త్రివర్ణ పతాకాన్ని దించి ఖలిస్తాన్ జెండా ఎగరేశారా?

ఎర్రకోట వద్ద రైతుల నిరసనలు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ఎర్రకోట వద్ద రైతుల నిరసనలు

దిల్లీలో రైతుల ట్రాక్టర్ ర్యాలీలో హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. ఒక రైతు చనిపోవడంతో అతడి మృతదేహంతో నిరసనకారులు ఐటీఓ వద్ద బైఠాయించారు. రైతులు భారీ సంఖ్యలో ఎర్రకోట మీదకు చేరుకుని జెండా ఎగురవేశారు.

ఈ రైతులు రిపబ్లిక్ డే నాడు ఎర్ర కోట మీద ఏ జెండాను ఎగురవేశారు? వాళ్లు ఎర్ర కోట మీద భారత త్రివర్ణ పతాకాన్ని దించి ఖలిస్తాన్ జెండాను ఎగరేశారని సోషల్ మీడియాలో వైరల్‌గా సాగుతున్న ప్రచారంలో నిజమెంత?

సోషల్ మీడియాలో వైరల్ అయ్యే కథనాల్లో నిజానిజాలను తేల్చి చెప్పే ఆల్ట్ న్యూస్ ఈ ప్రచారంపై 'ఫ్యాక్ట్ చెక్' కథనం ప్రచురించింది.

సోషల్ మీడియాలో చాలా మంది, భారత జెండాకు అవమానం జరిగిందంటూ పోస్టులు పెట్టారు, ట్వీట్లు చేశారు.

"మూడు రంగుల జెండా స్థానంలో మతపరమైన జెండాను ఎగరేయడం ద్వారా ఈ రైతులు ఏం చెప్పదలచుకున్నారు?" అని సోనమ్ మహాజన్ ప్రశ్నించారు.

బీజేపీ దిల్లీ శాఖ అధికార ప్రతినిధి హరీష్ ఖురానా, వరుణ్ గాంధీ పార్లమెంటరీ సెక్రటరీ ఇషితా యాదవ్, బీజేపీ మద్దతుదారులైన దివ్య కుమార్ సోతీ, షెఫాలీ వైద్య తదితరులు కూడా ఈ ప్రచారాన్ని ముందుకు తీసుకువెళ్లిన వారిలో ఉన్నారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 1
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 1

దిల్లీ బీజేపీ అధికార ప్రతినిధి హరీష్ ఖురానా తన ట్వీట్లో దిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీలను ఆక్షేపించారు. 'పాకిస్తాన్ ఆనందంలోనే మీకు ఆనందం ఉంది. వీళ్లు రైతులు కాదని మేం చెబుతూనే ఉన్నాం. కానీ, మీరు వారికి మద్దతు పలుకుతున్నారు' అని ట్వీట్ చేశారు.

బీజేపీ తరఫున సోషల్ మీడియాలో ప్రచారం చేసే @NindaTurtles @ExSecular @IamMayank తదితర హ్యాండిల్స్ ద్వారా కూడా ఈ ప్రచారం జోరందుకుంది.

ఈ ప్రచారం నిజమేనా?

ఈ ప్రచారంలో మొదటి అంశం, నిరసనకారులు భారత జెండాను దించారన్నది. నిజానికి నిరసనకారులు జెండా ఎగురవేసింది ఖాలీ జెండా కర్ర మీదే. చాలా వీడియోలు ఈ విషయాన్ని ధ్రువీకరిస్తున్నాయి.

ఏఎన్ఐ వార్తా సంస్థ ట్వీట్ చేసిన ఈ వీడియోలో భారత త్రివర్ణ పతాకం ఎర్రకోట ప్రవేశ ద్వారం వద్ద ఉన్న లాహోర్ గేట్ మీద రెపరెపలాడుతోంది. నిరసనకారుడు ఖాళీగా ఉన్న ఫ్లాగ్ పోస్టును ఎక్కుతున్నాడు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 2
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 2

ఇండియన్ ఎక్స్‌ప్రెస్ ట్వీట్ చేసిన ఈ చిత్రాలు కూడా నిరసనకారులు త్రివర్ణ పతాకాన్ని దించలేదని, వారు ఖాళీ ఫ్లాగ్ పోస్టుల మీద జెండాలు ఎగరేశారని సూచిస్తున్నాయి.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 3
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 3

ఇక రెండో విషయం, నిరసనకారులు ఖలిస్తాన్ జెండాను ఎగరేశారా అన్నది. వారు ఎగరేసింది ఖలిస్తాన్ జెండా కాదు. వారు ఎగరేసిన జెండాలు నిషాన్ సాహిబ్ లేదా సిక్కు మతానికి సంబంధించిన జెండాలు. "రెండు కరవాలాల గుర్తుతో పసుపు లేదా కాషాయ రంగులో, త్రికోణాకారంలో ఉన్న జెండాలు సిక్కు మతానికి చెందిన పతాకాలు. అవి ఖలిస్తాన్ జెండాలు కావు" అని 'పంజాబ్: జర్నీస్ థ్రో ఫాల్ట్ లైన్స్' గ్రంథ రచయిత అమన్ దీప్ సంధు చెప్పారని ఆల్ట్ న్యూస్ తన కథనంలో పేర్కొంది.

భారతీయ పతాకాన్ని తాకకుండా సిక్కు జెండాలు ఎగరవేయడాన్ని, ఈ దేశంలోని ఒక వర్గం ప్రజలు తమ ఉనికిని చాటుకోవడానికి చేసిన ప్రయత్నంగా చూడాలని కూడా అమన్ దీప్ అన్నారు.

"నిషాన్ సాహిబ్ జెండాను ఖలిస్తాన్ జెండా అని చెబుతున్నారంటే, ప్రతి గురుద్వారా కూడా ఒక ఖలిస్తానేనా? ప్రతి సిక్కూ ఖలిస్తానీయా?" అని జర్నలిస్ట్ హరితోష్ సింగ్ బల్ ప్రశ్నించారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 4
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 4

నిషాన్ సాహిబ్ ఏంటి?

''నిషాన్ సాహిబ్‌లో నిషాన్ అనేది ఒక పర్షియన్ పదం. సాహిబ్ ఒక గౌరవ సూచిక''అని పంజాబ్ యూనివర్సిటీలోని గురు గ్రంథ్ సాహిబ్ విభాగం ఛైర్మన్ ప్రొఫెసర్ సరబ్జీందర్ సింగ్ చెప్పారు.''మొఘల్ చక్రవర్తి జహంగీర్ అదేశాలపై లాహోర్‌లో సిక్కుల మతగురువు అర్జన్ దేవ్‌ను హతమార్చిన తర్వాత ఆరో సిక్కుల మతగురువు గురు హర్‌గోబింద్ సింగ్ నిషాన్ సాహిబ్''ను ఏర్పాటుచేశారు''. ''సింహాసనాన్ని అధీష్టించి, సైన్యాన్ని సిద్ధంచేసి నిషాన్ సాహిబ్‌ను ఏర్పాటుచేయాలని గురు హర్‌గోబింద్ సింగ్‌కు గురు అర్జన్ దేవ్ సూచించినట్లు సిక్కు మత గ్రంథాల్లో ఉంటుంది''.''సిక్కుల్లో స్వేచ్ఛా భావనకు కేసరి నిషాన్ సాహిబ్ ప్రతీక. ఇది ఒక మతపరమైన ముద్ర. ప్రతి గురుద్వారాలోనూ ఇది కనిపిస్తుంది. ఎర్రకోటపై ఎగరేసిన కేసరి నిషాన్ సాహిబ్ జెండాకు ఏ రాజకీయ పార్టీతోనూ సంబంధంలేదు. ఇది కేవలం సిక్కు మత చిహ్నం''అని ఆయన చెప్పారు.

నిజానికి, సిక్కు జెండాలు రిపబ్లిక్ డే పరేడ్ లో పంజాబ్ శకటాల మీద కనిపించడం మామూలే. ఈ ఏడాది పరేడ్‌లో కూడా అవి దర్శనమిచ్చాయి.

రిపబ్లిక్ డే పంజాబ్ శకటం

ఫొటో సోర్స్, Doordarshan

కాబట్టి, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నట్లుగా, మరికొన్ని వర్గాలు ప్రచారం చేస్తున్నట్లుగా ట్రాక్టర్ ర్యాలీలో నిరసనకారులు భారత త్రివర్ణ పతాకాన్ని దించి ఖలిస్తాన్ జెండా ఎగురవేశారన్నది పూర్తిగా అవాస్తవం. వాళ్లు సిక్కు జెండాలు ఎగురవేసింది కూడా ఖాళీగా ఉన్న జెండా కర్రల మీదే.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)