తాండవ్: అమెజాన్ వెబ్ సిరీస్‌పై ఆగ్రహించిన హిందువులకు క్షమాపణలు చెప్పిన నటీనటులు, సిబ్బంది

తాండవ్‌పై వ్యతిరేకతలు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, తాండవ్‌కు వ్యతిరేకంగా బీజేపీ మద్దతుదారుల నిరసనలు

అమెజాన్ ప్రైమ్‌ పొలిటికల్ డ్రామా 'తాండవ్‌' వెబ్ సిరీస్‌ హిందువుల మనోభావాలకు భంగం కలిగించిందనే ఆరోపణలకు, ఆ షోలో నటించిన నటీనటులు, సిబ్బంది క్షమాపణలు చెప్పారు.

కొంతమంది హిందూ రాజకీయ నేతలు ఈ షోను తొలగించాలంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

అధికార బీజేపీకి చెందిన ఒక నేత "ఇది ఉద్దేశపూర్వకంగా హిందూ దేవతలను అపహాస్యం చేస్తోందని" అన్నారు.

బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ ప్రధాన పాత్రలో నటించిన ఈ వెబ్ సిరీస్‌ను, 'హౌస్ ఆఫ్ కార్డ్స్' అనే సూపర్ హిట్ షో ఆధారంగా తీశారు.

విమర్శలు ఎదుర్కుంటున్న సన్నివేశాల్లో యూనివర్సిటీలో వేసే ఒక డ్రామా సన్నివేశం కూడా ఉంది. అందులో శివుడి వేషంలో ఉన్న ఒక పాత్ర 'ఆజాదీ'(స్వాతంత్ర్యం) గురించి మాట్లాడుతుంది. భారత్‌లో ఇది వివాదాస్పద పదంగా ఉంది.

పోస్ట్‌ Instagram స్కిప్ చేయండి
Instagram ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో Instagram అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు Instagram కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of Instagram ముగిసింది

"తాండవ్' అనేది ఒక కల్పిత కథ. ఇందులో సన్నివేశాలు, వ్యక్తులు, ఘటనలకు ఏదైనా పోలిక ఉండడం పూర్తిగా యాదృచ్చికం" అని ఉన్న ఒక ప్రకటనను ఈ వెబ్ సిరీస్ డైరెక్టర్ అలీ అబ్బాస్ జఫర్ సోమవారం తన ట్విటర్, ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు.

"తాండవ్‌ కోసం పనిచేసిన నటీనటులు, సిబ్బంది అనుకోకుండా ఎవరి మనోభావాలనైనా కించపరిచి ఉంటే, అందుకు బేషరతుగా క్షమాపణలు చెబుతున్నాం" అన్నారు.

ఈ సిరీస్ గురించి తీవ్ర భయాందోళనలు వ్యక్తం చేస్తూ తమకు భారీ సంఖ్యలో పిటిషన్లు, ఫిర్యాదులు వచ్చాయని భారత సమాచార మంత్రిత్వ శాఖ తమ నటీనటులు, సిబ్బందికి చెప్పిందని జఫర్ తెలిపారు.

శుక్రవారం విడుదలైన తాండవ్ సిరీస్ భారతీయ జనతా పార్టీ నేతల నుంచి తీవ్ర విమర్శలు ఎదుర్కుంది.

ముంబయిలో ఉన్న సైఫ్ అలీ ఖాన్ ఇంటి బయట ఆదివారం పోలీసుల బందోబస్తు ఉండడం కనిపించిందని హిందుస్తాన్ టైమ్స్ చెప్పింది.

పోస్ట్‌ X స్కిప్ చేయండి
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది

దీనిపై ముంబయిలో పోలీసులకు ఫిర్యాదు చేశానని బీజేపీ నేత, మహారాష్ట్ర ఎమ్మెల్యే రాం కదమ్ చెప్పారు.

కదమ్ నుంచి ఫిర్యాదు అందిందని, కానీ.. ఇంకా దానిపై దర్యాప్తు ప్రారంభించలేదని స్థానిక పోలీసులు చెప్పారని సీఎన్ఎన్ రాసింది.

ఈ వివాదంపై తాము ఎలాంటి వ్యాఖ్య చేయదలుచుకోలేదని అమెజాన్ ఇండియా ప్రతినిధి బీబీసీతో చెప్పారు.

ఈ సిరీస్ సమర్ ప్రతాప్ సింగ్(సైఫ్ అలీ ఖాన్) జీవితం గురించి చూపిస్తుంది. తండ్రి దేవకీ నందన్(తిగ్మాంషు శుక్లా) ప్రధాన మంత్రి పదవిని తనకు అప్పగించాలని ఆ పాత్ర ఆశపడుతుంది. కానీ అతడి తండ్రి ప్లాన్స్ మరోలా ఉంటాయి.

తాండవ్‌పై వ్యతిరేకతలు

ఫొటో సోర్స్, AMAZON

ఫొటో క్యాప్షన్, తాండవ్ వెబ్ సిరీస్‌లో ఒక దృశ్యం

అమెజాన్‌కు భారత్ అంత ముఖ్యం ఎందుకు

స్థానిక కంటెంట్‌తోపాటూ, అంతర్జాతీయ హిట్ షోస్ కూడా అందిస్తున్ననెట్‌ఫ్లిక్స్, అమెజాన్, డిస్నీ హాట్‌స్టార్ లాంటి స్ట్రీమింగ్ ప్లాట్‌ఫాంలకు భారత్‌లో ఆదరణ పెరుగుతోంది.

"ప్రస్తుతం ప్రపంచంలో అత్యంత ఉత్సాహకరంగా ఉన్న స్ట్రీమింగ్ మార్కెట్లలో భారత్ ఒకటి. అలాంటివి దేశంలో ఎన్నో ఉన్నాయి. మహమ్మారి వల్ల భారత్‌లో డిజిటల్ గ్రోత్ పెరిగింది. మా దగ్గర ఎన్నో ఒరిజినల్స్ ఉండడం మా అదృష్టం. మేం ఈ సమయంలో సినిమాలపై మా పెట్టుబడులు కూడా రెట్టింపు చేశాం"" అని గత వారం డెడ్‌లైన్‌తో మాట్లాడిన అమెజాన్ ఎగ్జిక్యూటివ్ గౌరవ్ గాంధీ అన్నారు.

స్ట్రీమింగ్ టీవీ సేవలు ఇప్పటివరకూ అభ్యంతర దృశ్యాలను కత్తిరించే దేశంలోని సెన్సార్ బోర్డులకు నియంత్రణలో లేవు.

కానీ, దేశంలోని సంప్రదాయ మీడియాతోపాటూ స్ట్రీమింగ్ కంటెంట్‌ను కూడా నియంత్రించాలని భారత సమాచార మంత్రిత్వ శాఖ భావిస్తోందని నవంబర్లో అది ప్రకటించింది. దీంతో వీటిపై కూడా సెన్సార్ షిప్ ఉంటుందని కొందరు భావిస్తున్నారు.

ఇటీవల విక్రమ్ సేథ్ నవల 'ఎ సూటబుల్ బాయ్‌' ఆధారంగా బీబీసీ అదే పేరుతో నిర్మించిన సిరీస్ నెట్‌ఫ్లిక్స్‌లో రావడంపై కూడా వివాదం రాజుకుంది.

దీనిలో, ఒక హిందూ ఆలయం నేపథ్యంలో హిందూ అమ్మాయిని, ముస్లిం అబ్బాయి ముద్దు పెట్టుకునే సన్నివేశాన్ని చిత్రీకరించారు.

"ఆలయ పరిసరాల్లో ముద్దు సన్నివేశాలు చిత్రీకరిస్తారంటూ" ఒక బీజేపీ నేత నవంబర్‌లో పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)