సెంట్రల్ విస్టా ప్రాజెక్టుకు సుప్రీం కోర్టు పచ్చజెండా

ఫొటో సోర్స్, hcp design
దేశ రాజధాని దిల్లీలో సెంట్రల్ విస్టా ప్రాజెక్టుకు సుప్రీంకోర్టు పచ్చజెండా ఊపింది. అయితే, నిర్మాణం మొదలుపెట్టే ముందు హెరిటేజ్ కన్జర్వేషన్ కమిటీ అనుమతి తీసుకోవాలని సూచించింది.
ఈ ప్రాజెక్టుకు పర్యావరణ మంత్రిత్వ శాఖ అనుమతులు ఇవ్వడం సరైన చర్యేనని అత్యున్నత న్యాయస్థానం వ్యాఖ్యానించింది.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
జస్టిస్ ఏఎం ఖన్విల్కర్ నేతృత్వంలోని సుప్రీం ధర్మాసనం ఈ అంశంపై మంగళవారం తీర్పు వెల్లడించింది.
భవిష్యత్‌లో చేపట్టబోయే ఇలాంటి నిర్మాణ ప్రాజెక్టుల్లో స్మాగ్ టవర్లను ఏర్పాటుచేయాలని, ముఖ్యంగా కాలుష్యం ఎక్కువగా ఉండే నగరాల్లో ఇలాంటివి అవసరమని ధర్మాసనం వ్యాఖ్యానించింది.
మరోవైపు ధర్మాసనంలో మూడో న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా భిన్నాభిప్రాయం వ్యక్తంచేశారు. ''భూమి వినియోగంపై వస్తున్న సందేహాలపై నాకు భిన్నాభిప్రాయం ఉంది. ముందుగా హెరిటేజ్ కన్జర్వేషన్ కమిటీ అనుమతి కూడా తీసుకోలేదు" అని ఆయన అన్నారు. అయితే, ఈ ప్రాజెక్టును అనుమతించాలని ధర్మాసనంలోని మిగతా ఇద్దరు సభ్యులు తీసుకున్న నిర్ణయంతో తాను ఏకీభవిస్తున్నానని చెప్పారు.
ఈ ప్రాజెక్టులో భాగంగా కొత్త పార్లమెంటు భవన నిర్మాణానికి 2020 డిసెంబర్ 10వ తేదీన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శంకుస్థాపన చేశారు.
దిల్లీలోని లుట్యెన్స్ జోన్‌లో తలపెట్టిన ఈ సెంట్రల్ విస్టా ప్రాజెక్ట్ నిర్మాణాన్ని సవాలు చేస్తూ అనేక పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ ప్రాజెక్టు పలు నిబంధనలను ఉల్లంఘిస్తోందని పిటిషనర్లు ఆరోపించారు.
ఈ అంశంపై విచారించిన సుప్రీంకోర్టు.. సెంట్రల్ విస్టా ప్రాజెక్టు నిర్మించే ప్రాంతంలో ఉన్న చెట్లను కూల్చడం లేదా నరికివేయడం, భవనాల నిర్మాణం ఏవీ చేపట్టరాదని ఇటీవల సూచించింది.
ఇటీవల కొన్ని పరిణామాలతో సుప్రీంకోర్టు ఈ అంశాన్ని సూమోటోగా విచారణకు స్వీకరించింది.

ఫొటో సోర్స్, @LOKSABHASPEAKER
ఏమిటీ సెంట్రల్ విస్టా ప్రాజెక్టు?
దేశ రాజధాని దిల్లీలో ఇండియా గేట్ నుంచి రాష్ట్రపతి భవనం వరకూ ఉన్న ప్రాంతాన్ని అభివృద్ధి చేసేందుకు కేంద్రం తలపెట్టిన ప్రాజెక్ట్ పేరే 'సెంట్రల్ విస్టా'. దీని వ్యయం దాదాపు రూ. 20,000 కోట్లుగా చెప్తున్నారు.
సెంట్రల్ విస్టా ప్రాజెక్ట్ కోసం గుజరాత్‌కు చెందిన ఆర్కిటెక్చర్ సంస్థ హెచ్‌సీపీ డిజైన్, ప్లానింగ్ అండ్ మేనేజ్‌మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ ప్లాన్ అందించింది.
ఈ ప్లాన్‌లో ఒక కొత్త త్రిభుజాకారపు పార్లమెంట్ భవనం, ఒక కామన్ సెంట్రల్ సెక్రటేరియట్, రాష్ట్రపతి భవనం నుంచి ఇండియా గేట్ వరకూ ఉండే మూడు కిలోమీటర్ల రాజ్‌పథ్‌ను పునరుద్ధరించడం ఉంది.
కొత్త పార్లమెంట్ భవనంలో భారత ప్రజాస్వామ్య సంస్కృతిని ప్రదర్శించేలా ఒక భారీ హాల్, ఎంపీల కోసం ఒక లాంజ్, ఒక లైబ్రరీ, కమిటీ గదులు, డైనింగ్ హాళ్లు, పార్కింగ్ ప్లేసులు ఉంటాయి.
సెంట్రల్ విస్టా ప్రాజెక్టులో భాగంగా ప్రధాని నివాసం, కార్యాలయాన్ని కూడా సౌత బ్లాక్‌కు దగ్గరకు, ఉపరాష్ట్రపతి కొత్త నివాసాన్ని నార్త్ బ్లాక్ సమీపంలోకి తరలించే అవకాశం ఉంది.
ఇవి కూడా చదవండి
- కిమ్ జీ-యంగ్, బోర్న్ 1982: దక్షిణ కొరియాలో స్త్రీవాదులు, స్త్రీవాద వ్యతిరేకుల మధ్య ఉద్రిక్తతలు రాజేసిన ఫెమినిస్ట్ సినిమా
- సంస్కృతం - హిందీ - తమిళం - తెలుగు... ఏది ప్రాచీన భాష? ఏ భాష మూలాలు ఏమిటి?
- రేప్, డిప్రెషన్ నుంచి కోలుకునేందుకు ఈమెకు యోగా ఎలా ఉపయోగపడింది
- ఆల్కహాల్‌తో చేతులు కడుక్కునే నిరంకుశ నియంత.. నికొలస్ చాచెస్కూ
- ధోనీ రిటైర్మెంట్ ఎప్పుడు... గంగూలీ, ద్రావిడ్‌లకు వర్తించిన లాజిక్ అతనికి వర్తించదా...?
- రాయల్ వశిష్ట: గోదావరిలో 300 అడుగుల లోతులో మునిగిన బోటును ఎలా బయటకు తీశారంటే..
- హాంకాంగ్ ప్రజల నిరసనలకు కారణమైన మర్డర్ స్టోరీ.. ఎందుకింత వివాదాస్పదమైంది? హోటల్లో ఆ రాత్రి ఏం జరిగింది?
- ఏపీలో ఈ ఏడాదిలో మూడోసారి వరద.. ప్రకాశం బ్యారేజీ వద్ద గత 20 ఏళ్లలో కొత్త రికార్డు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








