రాష్ట్రపతి భవన్‌కు కాంగ్రెస్ నేతల పాదయాత్ర, అడ్డుకున్న పోలీసులు

ఫొటో సోర్స్, ANI
వ్యవసాయ చట్టాలకు సంబంధించి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌కు విజ్ఞాపన పత్రం సమర్పించేందుకు ర్యాలీగా వెళ్లేందుకు సిద్ధమైన కాంగ్రెస్ నాయకులను దిల్లీ పోలీసులు అడ్డుకున్నారు.
సెక్షన్ 144 అమలులో ఉండటం వల్ల ఎక్కువ మంది గుమిగూడటంపై నిషేధం ఉందని పోలీసు అధికారులు తెలిపారు.
ముందస్తు అనుమతి ఉన్నవారిని మాత్రమే రాష్ట్రపతి భవన్‌కు వెళ్లేందుకు అనుమతిస్తామని చాణక్యపురి ఏసీపీ ప్రగ్యా వార్తా సంస్థ ఏఎన్‌ఐ వార్తా సంస్థతో చెప్పారు.
ర్యాలీగా వెళ్లేందుకు సిద్ధమైన కాంగ్రెస్ నాయకులను ఆ పార్టీ ప్రధాన కార్యాలయం వద్దే పోలీసులు అడ్డుకున్నారు. ప్రియాంక గాంధీతో పాటు మరికొందరు కాంగ్రెస్ నేతలను దిల్లీలోని మందిర్ మార్గ్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
తర్వాత రాహుల్ గాంధీ నేతృత్వంలో ముగ్గురు నేతలు రాష్ట్రపతిని కలిసేందుకు వెళ్లారు.

ఫొటో సోర్స్, ANI
కాంగ్రెస్ నేతల ర్యాలీని పోలీసులు అడ్డుకున్న తర్వాత ప్రియాంక గాంధీ మీడియాతో మాట్లాడారు. "ప్రభుత్వం రైతుల గొంతును వినడంలేదు. లక్షల మంది దిల్లీ సరిహద్దుల వద్ద ఉన్నారు. రైతులు తమకు ఇబ్బందులు ఉన్నాయని చెబుతున్నారు. ప్రభుత్వం ఈ చట్టాలను ఎందుకు వెనక్కి తీసుకోవడంలేదు? ఇది ప్రజాస్వామ్య దేశం, ప్రభుత్వం ప్రజల మాట వినాలి. మనం సైనికుల గురించి మాట్లాడుకుంటాం, వాళ్లు కూడా రైతుల బిడ్డలే. వాళ్ల మాట వినకూడదా?. ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా గొంతెత్తిన వారిని తీవ్రవాదులుగా చూస్తున్నారు. రైతుల వాణిని వినిపించేందుకే మేము ఈ పాదయాత్ర చేస్తున్నాం" అని ఆమె అన్నారు.
ఈ దేశం ప్రజాస్వామ్య దేశమని, ఎన్నికైన ఎంపీలకు రాష్ట్రపతిని కలిసే హక్కు ఉందని, ప్రతిపక్ష పార్టీ కావడం రైతుల గొంతు పెంచడం తన పార్టీ పని అన్నారు. ’’ అని ప్రియాంక అన్నారు.
రైతులను కాంగ్రెస్ రెచ్చగొడుతోందన్న ఆరోపణలపై ఆమె మాట్లాడుతూ.. "రైతులు బాగా అవగాహన ఉన్నవారు. ఏది మంచో, ఏది చెడో వారికి తెలుసు" అని ఆమె వ్యాఖ్యానించారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
రాష్ట్రపతిని కలిసిన తర్వాత రాహుల్ గాంధీ మీడియాతో మాట్లాడారు. కొత్త వ్యవసాయ చట్టాలు రైతు వ్యతిరేక చట్టాలు అని రాష్ట్రపతికి చెప్పినట్టు రాహుల్ గాంధీ తెలిపారు.
"ఈ చట్టాలను ప్రభుత్వం వెనక్కి తీసుకునేంత వరకూ రైతులు తమ ఇళ్లకు వెళ్లరు. ప్రభుత్వం జాయింట్ పార్లమెంటు సమావేశం పెట్టి ఈ చట్టాలను వెనక్కి తీసుకోవాలి. రైతులు, కార్మికులకు ప్రతిపక్ష పార్టీలు అండగా ఉంటాయి" అని రాహుల్ గాంధీ అన్నారు.
ఇవి కూడా చదవండి:
- నీటి కాలుష్యం: వైజాగ్ మరో ఏలూరు కానుందా?
- రైతుల నిరసనలు దేశాన్ని కుదిపేస్తుంటే, తెలుగు రాష్ట్రాల రైతులు ఏమంటున్నారు?
- ఏపీ రాజధాని చుట్టూ ఏడాదిగా ఏం జరిగింది? అమరావతి భవితవ్యం ఏంటి?
- దివీస్‌ను బంగాళాఖాతంలో కలిపేస్తామన్న జగన్ ఇప్పుడు అనుమతులు ఎందుకిచ్చారు
- 451 ఏళ్ల బానిసత్వం నుంచి గోవాను లోహియా ఎలా విడిపించారు?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








