హాథ్‌రస్: దళిత యువతిని గ్యాంగ్ రేప్ చేసి హత్య చేశారన్న సీబీఐ... దాఖలైన చార్జిషీట్

ఫొటో సోర్స్, PRAKASH SINGH
ఉత్తర ప్రదేశ్‌లోని హథ్‌రస్‌లో 19 ఏళ్ల దళిత యువతిపై జరిగిన సామూహిక అత్యాచారం, హత్య కేసులో సీబీఐ శుక్రవారం ఛార్జిషీట్ దాఖలు చేసింది.
19 ఏళ్ల యువతిపై సామూహిక అత్యాచారం, హత్యాయత్నం జరిగిందని పేర్కొంటూ.. ఈ కేసులో నిందితులైన సందీప్, లవ్‌కుశ్, రవి, రాములపై అత్యాచారం, హత్య నేరాలను సీబీఐ అధికారులు నమోదు చేశారు.
అలహాబాదు హై కోర్టు పర్యవేక్షణలో సీబీఐ ఈ కేసును దర్యాప్తు చేస్తోంది.
ప్రస్తుతం ఈ నలుగురు నిందితులు జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు. గాంధీనగర్‌లోని ఫోర్నెసిక్ సైన్స్ ల్యాబొరెటరీలో నలుగురికీ వివిధ రకాల పరీక్షలు జరిపినట్లుగా సీబీఐ తెలిపింది.
అంతేకాకుండా, మృతురాలికి చికిత్స చేసిన జవహర్ లాల్ నెహ్రూ హాస్పిటల్ వైద్య సిబ్బందితో కూడా మాట్లాడినట్లు సీబీఐ అధికారులు తెలిపారు.

ఫొటో సోర్స్, Gopal Shoonya/BBC
ఉత్తర్‌ప్రదేశ్‌లోని హాథ్‌రస్‌లో దళిత యువతిపై గ్యాంగ్ రేప్ జరిగిందన్న ఆరోపణలతో నమోదైన కేసు దేశవ్యాప్తంగా చర్చనీయమైంది. ఈ కేసులో ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం తీవ్ర విమర్శలను ఎదుర్కొంది. ఉత్తర ప్రదేశ్ పోలీసులు..మృతురాలి కుటుంబం అనుమతి లేకుండా, వారు దగ్గర లేని సమయంలో అంత్యక్రియలు జరిపించడం వివాదాస్పదమమైంది.
అంతేకాకుండా, నిందితుల పక్షం వహించి..కొన్ని గ్రామాల్లో మహాపంచాయితీ ఏర్పాటు చెయ్యడం కూడా వివాదాస్పదమయ్యింది.
ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం…బాధితుల గ్రామంలోకి మీడియా ప్రవేశించకుండా కొంతకాలం అడ్డుకుంది.

ఫొటో సోర్స్, Gopal Shoonya/BBC
బాధితురాలి కుటుంబంపై నార్కో టెస్ట్ జరపడం గురించి కూడా యూపీ ప్రభుత్వం మాట్లాడింది. సాధారణంగా నిందితులపై నార్కో టెస్ట్ జరుపుతారు.
ఈ రకమైన వైఖరితో యూపీ ప్రభుత్వం అనేక ఆరోపణలు ఎదుర్కోవడంతో ఈ కేసులో ఒక ప్రత్యేక దర్యాప్తు కమిటీ (సిట్)ను ఏర్పాటు చేసారు. తరువాత ఈ కేసును సీబీఐకు అప్పగించారు.
ఇవి కూడా చదవండి:
- లవ్ జిహాద్: అమ్మాయి ఎవరిని వివాహం చేసుకోవాలో నిర్ణయించేది ఆ అమ్మాయా, తల్లిదండ్రులా, ప్రభుత్వమా?
- నపుంసకులుగా మార్చే శిక్షతో అత్యాచారాలు ఆగిపోతాయా? ఇమ్రాన్‌ఖాన్ ప్రభుత్వ నిర్ణయంతో నేరస్తులు మారిపోతారా?
- పశ్చిమ బెంగాల్లో జేపీ నడ్డాపై దాడి: మోదీ, మమతా ప్రభుత్వాల మధ్య ముదురుతున్న విభేదాలు
- సర్దార్ వల్లభాయ్ పటేల్‌ను కాదని జవహర్లాల్ నెహ్రూను మహాత్మా గాంధీ ప్రధానిని చేశారు ఎందుకు?
- డాక్టర్లు బ్రెయిన్ ట్యూమర్ ఆపరేషన్ చేస్తుంటే... ఆ అమ్మాయి పియానో వాయించింది
- పోర్న్‌హబ్: యూజర్లు అప్లోడ్ చేసిన వీడియోలను తొలగిస్తున్నామన్న అడల్ట్ వీడియో సైట్
- చైనా, మాల్దీవుల రుణ వివాదం: 'మా తాతల ఆస్తులు అమ్మినా మీ అప్పు తీర్చలేం'
- సముద్రపు చేపలా.. చెరువుల్లో పెంచిన చేపలా.. ఏవి తింటే ఆరోగ్యానికి మంచిది?
- బ్రేక్‌ఫాస్ట్ నిజంగానే ఆరోగ్యానికి మేలు చేస్తుందా?
- అవసరమైనది గుర్తుండాలంటే అక్కర్లేనిది మరచిపోవాలి.. అదెలాగంటే
- కొన్ని పదాలు నాలుక చివరి వరకు వస్తాయి, కానీ గుర్తుకు రావు... వీటిని గుర్తు చేసుకోవడం ఎలా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








