సుప్రీంకోర్టు సీజేఐ ఎస్ఏ బాబ్డే హెలికాప్టర్ పర్యటనపై ప్రశాంత్ భూషణ్ ట్వీట్‌

బాబ్డే

ఫొటో సోర్స్, SCI.GOV.IN

    • రచయిత, సల్మాన్ రావి
    • హోదా, బీబీసీ ప్రతినిధి

భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గురించి ప్రముఖ లాయర్ ప్రశాంత్ భూషణ్ ఒక కొత్త ట్వీట్ చేశారు. దీనిపై దేశవ్యాప్తంగా జోరుగా చర్చ జరుగుతోంది.

జస్టిస్ బాబ్డే ఇటీవల తన సెలవులు గడిపిన సమయంలో మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఆయనకు ఒక హెలికాప్టర్ అందుబాటులో ఉంచింది.

దాని గురించి ప్రశాంత్ భూషణ్ అక్టోబర్ 21న ఒక ట్వీట్ చేశారు. ఆయన అందులో మధ్యప్రదేశ్ ప్రభుత్వం సీజేఐకి ఇచ్చిన ఆతిథ్యాన్ని ప్రశ్నించారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది

ట్వీట్‌లో "మధ్యప్రదేశ్ తిరుగుబాటు ఎమ్మెల్యేలను అనర్హులుగా పేర్కొనే ముఖ్యమైన కేసు తన ఎదుట పెండింగులో ఉన్నప్పుడు, మధ్యప్రదేశ్ ప్రభుత్వం భవిష్యత్తు ఈ కేసుపైనే ఆధారపడి ఉన్న సమయంలో... ప్రధాన న్యాయమూర్తి కాన్హా నేషనల్ పార్క్ సందర్శనకు, తన స్వస్థలం నాగపూర్ వెళ్లడానికి మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చిన ప్రత్యేక హెలికాప్టర్‌ను ఉపయోగించుకున్నారు" అన్నారు.

ఈ ట్వీట్‌లో వినయ్ సక్సేనా వర్సెస్ మధ్యప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్, మిగతా కేసుల్లో సుప్రీంకోర్టు ఆదేశాల కాపీ కూడా ప్రశాంత్ భూషణ్ పోస్ట్ చేశారు.

ఈ కేసు విచారణను చీఫ్ జస్టిస్ ఎస్ఏ బాబ్డే, జస్టిస్ ఎఎస్ బోపన్న, జస్టిస్ వి.సుబ్రమణ్యం బెంచ్ అక్టోబర్ 6న ప్రారంభించింది. ఈ కేసులో తుది తీర్పు నవంబర్ 4న వస్తుందని ఆదేశాల్లో చెప్పారు.

సుప్రీంకోర్టు

ఫొటో సోర్స్, Getty Images

మధ్యప్రదేశ్ ఎమ్మెల్యేల కేసు ఏంటి

మధ్యప్రదేశ్‌లో 22 మంది ఎమ్మెల్యేల సభ్యత్వం అంశం సుప్రీంకోర్టు ముగ్గురు సభ్యుల ధర్మాసనం ఎదుట పెండింగులో ఉంది. దీనిని విచారణను స్వయంగా బాబ్డే చేపట్టారని ప్రశాంత్ భూషణ్ చెబుతున్నారు.

మధ్యప్రదేశ్ ప్రభుత్వం భవిష్యత్తు ఈ కేసుపై ఆధారపడి ఉందని. అలాంటి పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం ఆతిథ్యాన్ని సీజేఐ స్వీకరించడం సబబేనా అని ప్రశ్నిస్తున్నారు.

మధ్యప్రదేశ్‌లో రాజకీయ డ్రామా కొన్ని నెలలపాటు నడిచింది. తర్వాత రాష్ట్రంలో కమల్‌నాథ్ ప్రభుత్వం నుంచి కొంతమంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేశారు. పార్టీని వీడారు.

దీంతో, కమల్‌నాథ్ తన పదవికి రాజీనామా చేశారు. తర్వాత బీజేపీ నుంచి శివరాజ్ సింగ్ చౌహాన్ ముఖ్యమంత్రి అయ్యారు.

ఆ తర్వాత పార్టీ మారినట్లు చెబుతున్న 22 మంది ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలంటూ కాంగ్రెస్ పార్టీ అప్పటి ప్రోటెం స్పీకర్ వినయ్ సక్సేనా సుప్రీంకోర్టు తలుపు తట్టారు. దీనికి సంబంధించి కోర్టులో ఒక పిటిషన్ దాఖలైంది.

ఈ పిటిషన్‌ను జస్టిస్ బాబ్డే నేతృత్వంలోని ముగ్గురు సభ్యుల ధర్మాసనం విచారించింది.

కేసు విచారణ ప్రస్తుతం కొనసాగుతోంది. ఇది నవంబర్ 4న మరోసారి ధర్మాసనం ఎదుటకు రానుంది.

ప్రశాంత్ భూషణ్

ఫొటో సోర్స్, PRASHANT BHUSHAN/ TWITTER

మధ్యప్రదేశ్ ప్రభుత్వం అందుబాటులో ఉంచిన హెలికాప్టర్‌లో ప్రధాన న్యాయమూర్తి మొదట మధ్యప్రదేశ్‌లోని కాన్హా నేషనల్ పార్క్ వెళ్లారని, తర్వాత అక్కడ నుంచి తన స్వస్థలం నాగపూర్ వెళ్లారని ప్రశాంత్ భూషణ్ చెబుతున్నారు.

మధ్యప్రదేశ్‌కు సంబంధించిన ఒక ముఖ్యమైన కేసును చీఫ్ జస్టిస్ విచారించబోతున్నారు కాబట్టే ఆయన పర్యటనపై ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి.

ఇంతకు ముందు కూడా ప్రశాంత్ భూషణ్ సుప్రీంకోర్టు సీజేఐ ఎస్ఏ బాబ్డే గురించి ట్వీట్ చేశారు. దీంతో కోర్టు ధిక్కరణ కేసులో ఆయనకు ఒక రూపాయి జరిమానా కూడా విధించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)