IPL 2020: మహేంద్ర సింగ్ ధోనీ మ్యాజిక్ ఎక్కడ? ఏమైంది? అతనితో సహా అందరూ వెతుకుతున్నారు..

ఎంఎస్ ధోనీ

ఫొటో సోర్స్, BCCI/IPL

    • రచయిత, వాత్సల్య రాయ్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

అదే క్రికెట్, అదే ఐపీఎల్, జట్టులో ఆటగాళ్లు కూడా చాలావరకూ వాళ్లే. ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే.. కెప్టెన్ కూడా అతడే. కానీ గత 12 ఏళ్లుగా కనిపించిన చెన్నై టీమ్‌కు ఇప్పటి టీమ్‌కు తేడా ఉంది.. ఏదో అయ్యింది.

తొమ్మిది సార్లు ఫైనల్‌కు వెళ్లి, మూడు సార్లు ట్రోఫీ సొంతం చేసుకున్న చెన్నై సూపర్ కింగ్స్ ఐపీఎల్‌లో సాధారణంగా అగ్ర స్థానంలో ఉంటుంది.

కానీ, సోమవారం ఐపీఎల్-13 పాయింట్ల పట్టికలో చెన్నై అత్యంత దిగువకు అంటే 8వ స్థానానికి జారిపోయింది.

కెప్టెన్ ధోనీ కూడా అంతకు ముందులా లేడు. చేతి నుంచి క్యాచ్‌లు జారుతున్నాయి. పరుగు తీసే సమయంలో రనౌట్ అవుతున్నాడు. ఇంతకు ముందులా అతడి బ్యాట్ బంతిని కనెక్ట్ చేయలేకపోతోంది. బెస్ట్ ఫినిషర్ అనే ట్యాగ్ అతడి చేతుల్లోంచి మెల్లగా జారిపోతోంది.

ఇప్పుడు పిచ్‌పై నాటౌట్‌గా నిలబడిపోతున్న ధోనీ.. జట్టు ఓటమిని కళ్లారా చూడాల్సొస్తోంది.

జట్టు క్రెడిట్? అది బహుశా అగాథంలోకి చేరుకోకపోవచ్చు. కానీ, టీమ్ పరిస్థితి మాత్రం ఘోరంగా ఉంది. విమర్శకులు దాడి చేయడానికి అస్త్రశస్త్రాలతో సిద్ధంగా ఉన్నారు.

చెన్నై సూపర్ కింగ్స్ ఘనత ఒక మెట్టు కిందికి దిగినప్పుడల్లా దానిపై విమర్శల దాడి జరుగుతూనే ఉంటుంది.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 1
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 1

మాజీ క్రికెటర్, ఐపీఎల్ కామెంటరేటర్ ఆకాష్ చోప్రా ట్విటర్‌లో ఇలాంటి వ్యాఖ్యలు చేశారు.

చెన్నై పడవకు చిల్లులు

టీమ్ ప్రస్తుతం ఎక్కడ, ఏ పరిస్థితుల్లో ఉందో కెప్టెన్ ధోనీకి కూడా తెలుసు. జట్టుపై ట్రోల్స్, విమర్శకుల దాడి నిజమేనని మిస్టర్ కూల్ స్వయంగా చెప్పాడు.

అక్టోబర్ 10న రాయల్ చాలెంజర్స్ చేతుల్లో చెన్నై ఓటమి పాలైనపుడు ధోనీ “పడవ(చెన్నై సూపర్ కింగ్స్)కు చాలా చిల్లులు పడ్డాయని” అన్నారు.

పదిరోజుల క్రితం ఈ మాట చెప్పిన వ్యక్తిని, చెన్నై సూపర్ కింగ్స్, ఐపీఎల్‌లోనే కాదు 21వ దశాబ్దపు క్రికెట్ చరిత్రలోనే అత్యంత విజయవంతమైన, చరిష్మా ఉన్న కెప్టెన్లలో ఒకరుగా లెక్కిస్తారు.

అప్పుడు ప్రతి ఫార్మాట్‌లో, ఎక్కువగా టోర్నీల్లో, ఐపీఎల్‌లో ఓడిపోతారనుకున్న మ్యాచ్‌లను ధోనీ ఒంటిచేత్తో గెలిపించి అద్భుతాలు చేశాడు. అలాంటి అద్భుతాల వల్లే అతడికి ‘మాజికల్’ లాంటి పేర్లు కూడా పెట్టారు. ‘జో జీతా వహీ ధోనీ’(ఎవరు గెలుస్తారో అతడే ధోనీ) అనుకునేవారు.

ధోనీ

ఫొటో సోర్స్, BCCI/IPL

శిఖరం నుంచి జారాడు

కానీ, ఆ గోల్డెన్ డేస్‌కు ముగింపు పలకాల్సిన సమయం ఆసన్నమైనట్లు ధోనీకి కూడా తెలుస్తోంది. అందుకే, ఆగస్టు 15న అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైరవుతున్నట్టు మహి ప్రకటించాడు.

అయితే, ఐపీఎల్ ప్రారంభంలో ‘బ్రాండ్ ధోనీ’ చరిష్మా కాస్త కూడా తగ్గలేదు. చెన్నై సూపర్ కింగ్స్ స్టార్ బ్యాట్స్ మెన్ సురేశ్ రైనా, అనుభవజ్ఞుడైన స్పిన్నర్ హర్భజన్ సింగ్ ఐపీఎల్-13 నుంచి తప్పుకుంటామని ప్రకటించినప్పటికీ ఆ జట్టు ఫేవరెట్‌గానే ఉంది.

చివరగా ధోనీ 2018లో జట్టును ఐపీఎల్ చాంపియన్‌గా నిలిపాడు. గత సీజన్‌లో కూడా రన్నరప్‌గా నిలిచిన చెన్నై విజయానికి కేవలం ఒక్క పరుగు దూరంలో నిలిచింది. ఫ్యాన్స్ కూడా క్రికెట్‌కు ‘పూర్తిగా వీడ్కోలు’ చెప్పేముందు మహీ మ్యాజిక్ మరోసారి చూడాలని తహతహలాడారు.

ధోనీ

ఫొటో సోర్స్, BCCI/IPL

మొదట గెలుపు, తర్వాత వరుస ఓటములు

2020లో డిఫెండింగ్ చాంపియన్ ముంబయి ఇండియన్స్ ను ఓడించిన ధోనీ టీమ్ ఐపీఎల్-13లో తన ప్రస్థానం ప్రారంభించింది. రెండో మ్యాచ్‌లో 200 పైగా పరుగులు చేసి, రాజస్థాన్ రాయల్స్ ను ఓడించింది.

కానీ ఇదే మ్యాచ్‌లో ముఖ్యంగా కెప్టెన్ బ్యాటింగ్ ఆర్డర్‌లో కిందికి వెళ్లడంపై ప్రశ్నలు వెల్లువెత్తాయి. తర్వాత ఒడిన ప్రతిసారీ విమర్శించారు. టాప్ ఆర్డర్, ముఖ్యంగా షేన్ వాట్సన్ వైఫల్యంపై ప్రశ్నలు వచ్చాయి.

బ్యాటింగ్ ఆర్డర్ సరిగా లేకపోవడం, కేదార్ జాధవ్ గురించి కెప్టెన్ ధోనీ బోనులో నిలబడాల్సి వచ్చింది.

వాట్సన్ రెండు మ్యాచుల్లో తన బ్యాటింగ్ పవర్ చూపించాడు. కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌తో మ్యాచ్‌లో చెన్నైకి విజయం అందించాడు. కోల్‌కతా నైట్ రైడర్స్ మీద అతడు హాఫ్ సెంచరీ చేసినా చెన్నై 10 పరుగుల తేడాతో ఓడిపోయింది.

మహేంద్ర సింగ్ ధోనీ

ఫొటో సోర్స్, BCCI/IPL

కొందరు ఫిట్‌గా లేరు, కొందరు హిట్ కాలేదు

చెన్నై జట్టులో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడు ఫాఫ్ డుప్లెసీ. 375 పరుగులతో అతడు ఈ సీజన్‌ టాప్ బ్యాట్స్ మెన్లలో మూడో స్థానంలో ఉన్నాడు.

కానీ, డుప్లెసీ బ్యాటింగ్‌లో వాట్సన్, ధోనీ, రైనాలా మ్యాచ్‌ను విజయం అంచులకు చేర్చగలిగే పవర్ లేదు.

ఫిట్‌నెస్ ఫ్యాక్టర్ కూడా కెప్టెన్ ధోనీ గేమ్ ప్లాన్ మీద ప్రభావం చూపింది. చెన్నైని కోలుకోలేని దెబ్బ కొట్టింది. ముంబైతో మొదటి మ్యాచ్‌లో జట్టును గెలిపించిన అంబటి రాయుడు అదే మ్యాచ్‌లో గాయపడ్డాడు. తర్వాత రెండు మ్యాచ్‌లు ఆడలేకపోయాడు.

దిల్లీతో జరిగిన మ్యాచ్‌లో డ్వేన్ బ్రావో అన్‌ఫిట్ అయ్యాడు. చివరి ఓవర్ వేయడానికి అందుబాటులో లేకుండాపోయాడు. చెన్నై ఓటమికి దీనిని అతిపెద్ద కారణంగా భావించారు. దిల్లీ చివరి ఓవర్లో 17 పరుగులు చేయాల్సిన సమయంలో రవీంద్ర జడేజాకు బంతి ఇవ్వడం అక్షర్ పటేల్‌ రెచ్చిపోయేలా చేసింది.

మహేంద్ర సింగ్ ధోనీ

ఫొటో సోర్స్, BCCI/IPL

అదృష్టం కలిసి రాలేదు

పరిమితంగా ఉన్న ప్రత్యామ్నాయాలను అటూఇటూ చేసిన ధోనీ జట్టు తలరాతను మార్చాలని చాలా ప్రయత్నించాడు. కానీ ఆ ప్రయోగాలు ఎక్కువగా విఫలమైనట్లు నిరూపితమైంది.

ఉదాహరణకు శామ్ కరన్ ఓపెనింగ్ చేయలేకపోతున్నాడు. రషీద్ ఖాన్, యజువేంద్ర చహల్, అక్షర్ పటేల్, శ్రేయస్ గోపాల్, రాహుల్ తేవతియా లాంటి స్పిన్నర్లు సక్సెస్ అవుతున్న చోట పీయూష్ చావ్లా తన ప్రభావం చూపించలేకపోతున్నాడు.

డుప్లెసీ మినహా చెన్నై ఆటగాళ్లు ఎవరూ ఐపీఎల్ టాప్ 10 బ్యాట్స్ మెన్లలో లేరు. అలాగే అత్యధిక వికెట్లు తీసిన టాప్ 10 బౌలర్లలో కూడా చెన్నై బౌలర్ ఎవరూ లేరు.

డ్వేన్ బ్రావో

ఫొటో సోర్స్, BCCI/IPL

ప్రశ్నల వెల్లువ

కానీ, ఇప్పుడు టీమ్ టోటల్ ఫెయిల్యూర్ గురించి ఎక్కువ ప్రశ్నలు ధోనీకే వస్తున్నాయి. రైనా, హర్భజన్‌లకు ప్రత్యామ్నాయం వెతక్కుండా బ్రావో లాంటి ముదురు ఆటగాడిపై ఎక్కువ నమ్మకం ఉంచిన ధోనీ, గత సీజన్‌లో సక్సెస్ అయిన ఇమ్రాన్ తాహిర్, మిగతా యువ ఆటగాళ్లకు అవకాశం ఇవ్వకుండా తప్పు చేశాడని, దానికి జట్టు మూల్యం చెల్లించిందని విమర్శకులు అంటున్నారు.

దీనికి ధోనీ సమాధానం కూడా ఇచ్చాడు. “నిజమే, ఈ ఏడాది మేం అలా చేయలేకపోయాం. బహుశా మాకు మా యువ ఆటగాళ్లలో ఆ మెరుపు కనిపించలేదు, ఏమో, రాబోవు మ్యాచుల్లో వాళ్లకు అవకాశం ఇస్తామేమో, వాళ్లు ఒత్తిడి లేకుండా ఆడుతారేమో” అన్నాడు.

ఐపీఎల్-13లో చెన్నై 10 మ్యాచ్‌లు ఆడేసిన తర్వాత, జట్టు పైకి వెళ్లడానికి పెద్దగా అవకాశాలు కూడా లేని సమయంలో ధోనీ భవిష్యత్ మ్యాచ్‌ల గురించి మాట్లాడుతున్నాడు.

కానీ, సోమవారం రాజస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో సంజు శాంసన్ క్యాచ్‌ను ఒంటి చేత్తో పట్టిన ధోనీ కష్ట సమయాల్లో అవకాశాలను పట్టుకోవడం కూడా తనకు తెలుసని చూపించాడు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 2
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 2

నంబర్ 7 మ్యాజిక్

బహుశా, అందుకేనేమో.. 70 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచి ధోనీ టీమ్‌ను ఏడు వికెట్లతో ఓడించడంలో కీలకంగా నిలిచిన వికెట్ కీపర్, బ్యాట్స్ మెన్ జోస్ బట్లర్ ‘మాన్ ఆఫ్ ద మ్యాచ్’ ట్రోఫీకి బదులు ధోనీ తనకు గిఫ్ట్ ఇచ్చిన ‘7వ నంబర్’ జెర్సీ పట్టుకుని కనిపించాడు.

ఆ జెర్సీకి ఒక మ్యాజిక్ ఉంది, దానిని అభిమానులు ఆ మ్యాజిక్ చూడాలనుకుంటున్నారు, ధోనీ కూడా దాన్ని వెతుక్కోవాలని అనుకుంటున్నాడు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)