తిరువనంతపురం గోల్డ్ స్మగ్లింగ్ కేసు - ఎన్ఐఏ విచారణకు హోం శాఖ అనుమతి

ఫొటో సోర్స్, Reuters
విదేశీ రాయబారుల ద్వారా భారత్‌కు బంగారం అక్రమ రవాణా జరుగుతోందంటూ ఓకొత్త వివాదం మొదలైంది. కేరళలోని ఓ అంతర్జాతీయ విమానాశ్రయం బాత్‌రూమ్‌లో దాచిన 30 కేజీల బంగారాన్ని కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు.
ఈ ప్యాకెట్‌పై తిరువనంతపురంలోని యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కాన్సులేట్ అడ్రస్ రాసి ఉంది. అయితే ఆ ప్యాకుట్‌కు తమకు ఏమీ సంబంధంలేదని యూఏఈ తేల్చి చెప్పగా, స్థానికంగా ఉంటున్న కాన్సులేట్ మాజీ ఉద్యోగి ఒకరిని అధికారులు అరెస్టు చేశారు. అతనితోపాటు మరో వ్యక్తిని కూడా అదుపులోకి తీసుకున్నారని స్థానికంగా వార్తలు వస్తున్నాయి.
దీనిపై సమగ్ర విచారణకు ఆదేశించామని ఢిల్లీలోని యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ రాయబార కార్యాలయం మంగళవారం నాడు ట్విటర్‌లో ప్రకటించింది.
"నిందితులు తీవ్రమైన నేరానికి పాల్పడటమే కాక, మా దేశ ప్రతిష్టకు భంగం కలిగించేలా వ్యవహరించారు. అలాంటి వారిని ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టబోము'' అని యూఏఈ రాయబార కార్యాలయం అధికారులు స్పష్టం చేశారు. " ఈ నేరానికి సంబంధించిన మూలాలు తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్న భారతీయ విచారణ అధికారులకు పూర్తి స్థాయిలో సహకరిస్తాం'' అని ఎంబసీ అధికారులు తెలిపారు.
"విధుల నిర్వహణలో నిర్లక్ష్యంగా ఉన్నందుకు కొన్ని నెలల కిందటే ఆ ఉద్యోగిని తొలగించాం'' అని నిందితుడి గురించి యూఏఈ రాయబారి గల్ఫ్ న్యూస్ అనే పత్రికకు వెల్లడించారు.
ఈ వ్యవహారంలో సీఎం రాజీనామా చేయాలని కేరళలోని ప్రతిపక్ష పార్టీలు ముఖ్యమంత్రిని డిమాండ్ చేయగా, ఆయన దాన్ని తిరస్కరించారు. అయితే ఓ సీనియర్ అధికారిని ప్రభుత్వం తొలగించింది.
రాయిటర్స్ న్యూస్ ఏజెన్సీ అంచనా ప్రకారం ప్రపంచవ్యాప్తంగా కరోనా ప్రభావంతో అంతర్జాతీయ విమాన సర్వీసులు నిలిచి పోవడంతో ఇండియాకు గోల్డ్ స్మగ్లింగ్ చేసే అవకాశాలు తగ్గిపోయాయి. అలాగే బంగారం ధర కూడా పెరిగింది.
"స్మగ్లింగ్‌కు అవకాశాలు తగ్గిపోయాయి. లాక్‌డౌన్ కారణంగా రవాణా సదుపాయాలు లేవు కాబట్టి రాబోయే రోజుల్లో మరింత తగ్గుతాయి'' అని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ సోమసుందరం అన్నారు.
2019 సంవత్సరంలో భారత దేశంలోకి 115 నుంచి 120 టన్నుల బంగారం అక్రమంగా రవాణా అయ్యిందని, ఈ సంవత్సరం దానికన్నా చాలా తక్కువగా ఉంటుందని ఆయన అన్నారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
ఎన్ఐఏతో విచారణకు హోం శాఖ ఆదేశం
తిరువనంతపురం బంగారం స్మగ్లింగ్ కేసుపై జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) విచారణకు కేంద్ర హోం శాఖ అనుమతించింది.
వ్యవస్థీకృత స్మగ్లింగ్ ఆపరేషన్ వల్ల దేశ భద్రతకు సంబంధించిన తీవ్రమైన పరిణామాలు కూడా ఉండొచ్చునని, కాబట్టే ఎన్ఐఏ విచారణకు అనుమతించినట్లు హోం శాఖ అధికార ప్రతినిధి ట్విటర్‌లో పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి:
- బంగారం ధరలకు, అంతర్జాతీయ సంక్షోభాలకు ఏమిటి సంబంధం...
- బంగారం ధర ఏడేళ్ళలో ఎన్నడూ లేనంత పెరిగింది... ఎందుకిలా?
- 'రాక్షసుడి బంగారం' బయటకు తీసే కార్మికుల కథ
- రూ.50,000కి దాటిన బంగారం ధర.. ఇప్పుడు కొంటే లాభమా.. అమ్మితే మంచిదా
- అప్పుడు బంగారం వేట.. ఇప్పుడు కోబాల్ట్ రష్
- బంగారం కొనాలా.. అమ్మాలా? ధర ఎందుకు పెరుగుతోంది?
- మెటల్ డిటెక్టర్‌తో గుప్తనిధి వేట.. రూ.48 లక్షల విలువైన 1.4 కేజీల బంగారం లభ్యం
- బంగారం రుణాలు: కరోనావైరస్ ఆర్థిక సంక్షోభంలో ఆశాకిరణాలు
- ప్రపంచంలో అత్యధికంగా బంగారాన్ని ఉత్పత్తి చేసే కంపెనీ ఇదే
- కరోనావైరస్ నుంచి కోలుకున్నా... ప్రైవేటు ఆస్పత్రులిచ్చే షాక్ నుంచి తేరుకోలేకపోతున్నారు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








